అందరిలా నేను మనిషినే.. అలా చేస్తే కోపం రాదా.. ప్రియా వారియర్ విభేదాల ‌గురించి మరో హీరోయిన్

Recommended Video

Lovers Day Heroine Noorin Shereef Exclusive Interview With Filmibeat Telugu

నేషన్ సెన్సేషన్ ప్రియా వారియర్, నూరీన్ షరీఫ్, రోషన్ నటించిన లవర్స్ డే సినిమాకు యూత్‌, ఇతర వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమా రెండోవారం పూర్తి చేసుకొని మూడు వారంలోకి అడుగుపెట్టబోతున్నది. ఈ సందర్బాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ నూరీన్ షరీఫ్ తన అనుభవాలను, అభిప్రాయాలను తెలుగు ఫిల్మీబీట్‌తో పంచుకొన్నది. ఆమె ఏం చెప్పారంటే..

ముందుగా నేనే మెయిన్ హీరోయిన్‌ను

ముందుగా నేనే మెయిన్ హీరోయిన్‌ను

తొలుత లవర్స్ డే సినిమాలో నాది మెయిన్ హీరోయిన్ పాత్ర. ప్రియా వారియర్ కన్నుగీటిన టీజర్ వైరల్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. దాంతో కథలో మార్పులు చోటుచేసుకొన్నాయి. ప్రియా వారియర్ పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో నాకు ఆమె పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. సినిమా కోసం నిర్మాత, దర్శకులు అలా చేయడం మంచే జరిగింది.

 నా పాత్ర ప్రాధాన్యతను తగ్గించినపుడు

నా పాత్ర ప్రాధాన్యతను తగ్గించినపుడు

నా పాత్ర పరిధిని, సినిమాలో నా ప్రాధాన్యతను తగ్గించినప్పుడు నాకు కొంత బాధ కలిగింది. ఎవరికైనా అది జరిగితే కొంత ఇబ్బంది ఉంటుంది. ఎమోషనల్‌గా కొంత ఫీలయ్యాను. కాకపోతే నా పాత్రకు ఉండే ఇంపార్టెటెన్స్ ఉండటంతో హ్యాపీగా ఫీలయ్యాను. సినిమాకు మంచి జరిగుతుందనే భావనలో ఉన్నాను.

ప్రియా వారియర్‌తో విభేదాలు లేవు

ప్రియా వారియర్‌తో విభేదాలు లేవు

ప్రియా వారియర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. సినిమా షూటింగ్ ప్రాసెస్‌లో మా మధ్య అల్లరి బాగా ఉండేది. ఒకరికొకరం టీజింగ్ చేసుకొనే వాళ్లం. షూటింగ్‌లోనే తను పరిచయం అయింది. షూటింగ్ తర్వాత పెద్దగా కలుసుకోలేదు.

హ్యాపీ ఎండింగ్‌‌కు మంచి రెస్పాన్స్

హ్యాపీ ఎండింగ్‌‌కు మంచి రెస్పాన్స్

లవర్స్ డే సినిమాకు అన్ని భాషల్లో మా సినిమాకు మంచి స్పందన వస్తున్నది. ఎంటర్‌టైన్‌మెంట్, ఇతర అంశాలు బాగా ఆకట్టుకొంటున్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ట్రాజెడీ ఎండింగ్‌ను మార్చి హ్యాపీ ఎండింగ్‌ను చేర్చిన తర్వాత ఇంకా మంచి రెస్పాన్స్ వస్తున్నది. ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

 ఒమర్ లులుతో మరో సినిమా

ఒమర్ లులుతో మరో సినిమా

లవర్స్ డే సినిమాకు ముందే దర్శకుడు ఓమర్ లులుతో మరో చిత్రాన్ని కమిట్ అయ్యాను. ఇంకా ఆ చిత్రం మొదలుకాలేదు. తెలుగు, మలయాళంలో కొన్ని సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఫైనలైజ్ కాలేదు. అయితే మీడియాకు వెల్లడిస్తాను అని నూరీన్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X