బాలకృష్ణ మాస్ సినిమానా? మీదపడి చూస్తారా? నెగిటివ్ రివ్యూలపై నాగవంశీ క్రేజీ కామెంట్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా లక్కీ భాస్కర్. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు వస్తున్న స్పందనపై నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ మీడియాతో మాట్లాడుతూ..
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఎక్కడా సినిమా గురించి ఒక్క నెగటివ్ కామెంట్ కూడా కనిపించలేదు. అంతలా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడం కోసం మీడియా ముందుకి వచ్చాము. థాంక్స్ అనేది చాలా చిన్న మాట. సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలుగుతోంది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని అన్నారు.

లక్కీ భాస్కర్ సినిమాకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తున్నది. కలెక్షన్లు మాస్ సినిమాకు వచ్చినంత రాకపోవచ్చు. ఇది బాలకృష్ణ సినిమానా? ప్రేక్షకులు వచ్చి థియేటర్‌పై పడి సినిమా కాదు. మూడు సినిమాల్లో మాకే మంచి కలెక్షన్లు వచ్చాయి. సీతారామం కంటే బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండు, మూడు వారాలపాటు ఒకే ఫ్లోతో ఈ సినిమా థియేట్రికల్‌గా కంటిన్యూ అవుతుంది అని నాగవంశీ అన్నారు.
తెలుగులో కొత్త జానర్‌లో లక్కీ భాస్కర్ సినిమా చేశాం. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తున్నది. మొదటిరోజు కలెక్షన్లు భారీగా నమోదయ్యాయి. విడుదలైన ప్రతి చోటా కలెక్షన్లు బాగున్నాయి. లాంగ్ రన్‌లో ఈ చిత్రం ఇంకా మంచి వసూళ్లను రాబడుతుంది.విడుదలకు ముందే లక్కీ భాస్కర్‌కి నెగటివ్ రివ్యూలు రావని నేను నమ్మకం వ్యక్తం చేశాను. ఇప్పుడు ఆ నమ్మకం నిజమైనందుకు సంతోషంగా ఉంది అని నాగవంశీ తెలిపారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ లభిస్తున్నది. ఫైట్లు లేకనప్పటికీ, మాస్ ప్రేక్షకులు నచ్చిందని చెబుతున్నారు. సినిమాలో హీరో గెలిచిన ప్రతిసారీ తామే గెలిచినట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇంతటి స్పందన రావడానికి ఎమోషనల్ జర్నీనే కారణం అని అన్నారు.
దుల్కర్ స్టార్ అయినప్పటికీ, ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకునే సన్నివేశం చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇప్పుడు ఆ సన్నివేశానికి అంత మంచి పేరు రావడానికి కారణమే ఆయనే. దుల్కర్ ఫెర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు భారీగా పెరుగుతాయి అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











