సినిమా చూసి నాన్న భుజం తట్టారు.. జీవితంలో మరిచిపోలేను.. మహేష్ బాబు

Recommended Video

Mahesh Babu Reveals His Memorable Moment With Super Star Krishna || Filmibeat Telugu

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా మే 9న విడుదలకు ముస్తాబవుతున్నది. మహేష్ కెరీర్‌లో ఇది 25వ ప్రాజెక్ట్ కావడంతో మరింత క్రేజ్ పెరిగింది. అత్యంత భారీ బడ్జెట్, సాంకేతిక విలువలతో ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ రూపొందించారు. అందాలభామ పూజా హెగ్డే, అల్లరి నరేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషనల్‌లో భాగంగా మహేష్ బాబు తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ..

 నాన్నతో కలిసి సినిమా

నాన్నతో కలిసి సినిమా

చిన్నతనం నుంచి నేను నాన్న నటించిన సినిమాలు ఆయనతోనే చూసేవాడ్ని. అలాగే నా సినిమాలు ఎప్పుడూ నాన్నగారితో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్‌ 35 థియేటర్లో మార్నింగ్‌ షోలు చూసేవాడ్ని. 'మురారి' సినిమా క్లైమాక్స్‌ అయిపోయాక నాన్నగారు ఏమీ మాట్లాడకుండా నా భుజం మీద చెయ్యి పెట్టారు. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని మహేష్ అన్నారు.

ఇండస్ట్రీకి అది మ్యాజిక్ డేట్

ఇండస్ట్రీకి అది మ్యాజిక్ డేట్

తెలుగు సినిమా పరిశ్రమలో మే 9 తేదీకి ఆ ప్రాముఖ్యత ఉంది. జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి లాంటి చిత్రాలు అదే రోజు విడుదలై ఘన విజయం సాధించాయి. ఆ తేదీ అనేది ఒక మ్యాజికల్‌ డేట్‌. ఆరోజున అందరికీ చాలా సూపర్‌హిట్స్‌ ఉన్నాయి. 'మహర్షి' కూడా ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తుంది. మా చిత్రంతో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ కొట్టబోతున్నాం. మా ఫ్యాన్స్‌ కూడా ఇప్పటి నుంచి మీ సినిమాలు మేలోనే రిలీజ్‌ చేయండి అనేలా ఉంటుంది అని మహేష్ తెలిపారు.

20 ఏళ్లుగా నాపై ప్రేమ ఆదరణ

20 ఏళ్లుగా నాపై ప్రేమ ఆదరణ

హిట్టు, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా నన్ను అభిమానులు ఆదరిస్తున్నారు. గత 20 ఏళ్లుగా 25 సినిమాలకు వాళ్లు చూపించిన ప్రేమ చాలా చాలా గొప్పది. వాళ్ళు లేకపోతే నేను లేను. మరో 20 సంవత్సరాలు 25 సినిమాలకు కూడా వాళ్ళు చూపించే అభిమానం, ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని మహేష్ అన్నారు.

 నా భార్యే చూసుకొంటున్నదని

నా భార్యే చూసుకొంటున్నదని

సినిమాలే కాకుండా పలు బ్రాండ్లకు నేను అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాను. నా యాడ్స్ గురించి అంతా నా వైఫ్ నమత్ర చూసుకొంటుంది. ఏదైనా బ్రాండ్ ఎంపిక చేసుకొనే ముందు బ్రాండ్‌ వేల్యూస్‌ చూస్తాను. దానికి సంబంధించిన అన్ని విషయాలు నమ్రత చూసుకుంటుంది. దాని కోసం ఓ టీమ్ పనిచేస్తుంటుంది. అందుకే బ్రాండ్ విషయంలో మంచి క్రెడిట్ ఉంది అని మహేష్ తెలిపారు.

 ఇండియాలో బెస్ట్ ఉండాలనే కలతో

ఇండియాలో బెస్ట్ ఉండాలనే కలతో

ఆరేళ్ల క్రితం '1' నేనొక్కడినే సినిమా చేస్తున్నప్పుడు ఏషియన్‌ సినిమాస్‌ సునీల్‌గారితో మాల్ విషయంపై చర్చ జరిగింది. ఆ తర్వాత ఆయన ఫాదర్‌తో డిస్కస్‌ చేయడం జరిగింది. ఏదైనా కడితే ఏదో మాల్ కట్టామనే విధంగా కాకుండా ఇండియాలోనే బెస్ట్‌గా ఉండాలి. గ్రేట్‌ సౌండ్‌. లేటెస్ట్‌ ప్రొజెక్టర్స్‌. అన్నీ హంగులతో ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌లా ఉండాలి అని అనుకొన్నాం. ఈ రోజు నా కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు పెరగడంతో పాటు చాలామంది సెలబ్రిటీస్‌ వెళ్లి సినిమాలు చూస్తున్నారనే విషయం తెలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X