Mahesh Babu SS Rajmouli movie: జక్కన్నతో సినిమా చేస్తే.. మూడేళ్లు లేవని మరిచిపోవాల్సిందే..ఫ్యాన్స్‌కు మరో షాక్
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారీ పాట మూవీతో ప్రేక్షకుల ముందుకు మే 12వ తేదీన వచ్చేందుకు ముస్తాబవుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత సుమారు రెండున్నర ఏళ్ల తర్వాత మళ్లీ అభిమానుల్లో జోష్ పెంచేందుకు వస్తున్నాడు. సర్కారు వారీ పాట సినిమాకు సంబంధించిన విశేషాలను ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వెల్లడిస్తూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు. అయితే త్వరలోనే దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోయే సినిమాపై ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించారు. సర్కారు వారి పాట, అలాగే ఇతర విషయాలను గురించి మహేష్ బాబు ఏం చెప్పారంటే?

తెలుగు సినిమాకే పరిమితం అంటూ
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా గురించి చర్చ జరుగుతున్నది. అయితే ప్రతీ ఒక్కరు ప్యాన్ ఇండియా స్థాయి సినిమాలు చేయాలని కోరుకొంటుంటే.. మహేష్ బాబు మాత్రం తెలుగు సినిమాకే పరిమితం కావాలనుకొంటున్నానని అభిమానులకు షాక్ ఇచ్చినంత పని చేశారు. బాలీవుడ్ పరిశ్రమ నన్ను భరించడం కష్టం అని చెప్పడంపై జాతీయ మీడియా భగ్గుమంటున్నది.

బాలీవుడ్ ఎంట్రీకి నో..
అయితే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుతం తెలుగులో చాలా కంఫర్టబుల్ పోజిషన్‌లో నేను ఉన్నాను. నాకు సినిమా అంటే చాలా ప్రేమ. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. తెలుగులో చేస్తున్న సినిమాలు మంచి ఫలితాలను, విజయాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం వేరే భాష గురించి ఆలోచించడం లేదు అని మహేష్ బాబు అన్నారు.

అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా
గత కొద్దికాలంగా తెలుగు సినిమాతోపాటు దక్షిణాది సినిమా కూడా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ప్రతీ ఒక్కరు తెలుగు సినిమా ప్రతిష్ట గురించి మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. రాజమౌళితో సినిమా చేస్తున్నానంటే.. అది ప్యాన్ ఇండియా సినిమా అవుతుంది. దాంతో నేను ప్యాన్ ఇండియా సినిమాల్లో నటించాలనే కోరిక నా అభిమానులకు తీరుతుంది అని మహేష్ బాబు అన్నారు.

రాజమౌళితో ఒక్క మూవీ చేస్తే..
ఇక రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండు, మూడు ఏళ్లు సమయం పడుతుంది కదా అనే ప్రశ్నకు మహేష్ బాబు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. రాజమౌళితో సినిమా చేస్తే 25 సినిమాలు చేసినంత అనుభూతి, అనుభవం కలుగుతుంది. మేకింగ్ విషయంలో ఎక్కువ సమయం తీసుకొన్నప్పటికీ.. ఆయన సినిమా ద్వారా అభిమానులు చాలా సంతోషానికి గురవుతారు. నాకు నా ఫ్యాన్స్ ఆనందమే ముఖ్యం అని మహేష్ బాబు తెలిపారు.

సర్కారు వారీ పాటలో 45 నిమిషాలు రచ్చ
అలాగే సర్కారు వారీ పాట సినిమా గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో 45 నిమిషాలపాటు సాగే లవ్ ట్రాక్ థియేటర్‌ను షేక్ చేస్తుంది. కీర్తి సురేష్‌తో నా లవ్ ట్రాక్ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది. నా పాత్రను దర్శకుడు పరుశురాం అద్బుతంగా డిజైన్ చేశాడు. గత ఏడేళ్లలో ఎన్నడూ చేయని విధంగా సీన్లు ఈ సినిమాలో ఉంటాయి అని మహేష్ బాబు చెబుతూ సినిమా రేంజ్‌ను పెంచే ప్రయత్నం చేశారు.


Click it and Unblock the Notifications











