రాంచరణ్, ఎన్టీఆర్ నేను కలిసినప్పుడు.. ఎలా ఉంటామంటే.. మహేష్‌బాబు నిజాయితీ అంటే..

By Rajababu

లవర్ బాయ్‌గా కనిపించే ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం ముఖ్యమంత్రి పాత్రలో అలరించనున్నారు. ఆయన నటించిన భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఓ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ చిత్రంలో నటించినప్పటికీ గానీ తనకు రాజకీయాలతో సంబంధం లేదని ఆయన అన్నారు. భరత్ అనే నేను సినిమా రిలీజ్‌ను పురస్కరించుకొని ఆయన తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను వెల్లడించారు.

Recommended Video

Bharat Ane Nenu Movie First Review.. It Is Blockbuster
 నాపై నాన్నగారి ప్రభావం

నాపై నాన్నగారి ప్రభావం

నటుడిగా నాపై మా నాన్న కృష్ణ ప్రభావం బాగా ఉంటుంది. ఈ సినిమాలో ఎక్కువగా కనెక్షన్ ఫీలయ్యాను. ప్రమాణ స్వీకారం (ఓత్) విన్నప్పుడు నాన్నగారి వాయిస్‌లా అని అన్నారు. ఓ వెబ్‌సైట్‌లో డిజిటిల్‌లో మార్చారా అని రాశారు. అయితే వాయిస్ మార్చడానికి కుదరదు. డబ్బింగ్ థియేటర్లలో డైలాగ్స్ చెప్పగానే నాన్నగారి వాయిస్‌లా ఉందే అని శివతో అన్నాను. పొలిటికల్ డైలాగ్స్ ఇంతకు ముందు చెప్పలేదు. ఆ నాకు అలవాటు లేదు. నా డైలాగ్స్‌ నాన్నగారు చెప్పిన మాదిరిగా అనిపిస్తే.. ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రభావం నాపై ఉండి ఉంటుంది.

అమ్మ పుట్టిన రోజున

అమ్మ పుట్టిన రోజున

భరత్ అనే నేను చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 27న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. అయితే రిలీజ్ విషయంలో నా పేరు సూర్య చిత్రానికి ఇబ్బందులు తలెత్తకూడదని విడుదల తేదీలను మార్చుకున్నాం. అప్పుడు మా సోదరి మంజుల అమ్మ పుట్టిన రోజున సినిమా విడుదల అవుతున్నది అని చెప్పింది. అది విని చాలా ఆనందించాను. నాకు తెలిసి దానికి మించిన మంచి రోజు లేదు. అదే రోజు చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు కూడా కావడం ఇంకా మంచిదైంది.

దేవీ శ్రీ ప్రసాద్‌కు థ్యాంక్స్

దేవీ శ్రీ ప్రసాద్‌కు థ్యాంక్స్

భరత్ అనే నేను సినిమాలో పనిచేసిన టెక్నిషియన్స్‌కు ధన్యవాదాలు. దేవీ శ్రీ ప్రసాద్‌కు ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా కెరీర్‌లో బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. భరత్ అనే నేను, వచ్చాడయ్యా సామీ అనే పాటలు నాకు బాగా నచ్చాయి.

సోషల్ మీడియా పాత్ర గురించి

సోషల్ మీడియా పాత్ర గురించి

సొసైటిలో సోషల్ మీడియా పాత్ర చాలా ప్రభావవంతమైనది. ఒకప్పుడు పేపర్లో వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కనిపించేవి. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చనవే పేపర్లో వస్తున్నాయి. సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది.

 2002 నుంచి డీవీవీ దానయ్య

2002 నుంచి డీవీవీ దానయ్య

డీవీవీ దానయ్య 2002 నుంచి నాతో సినిమా తీయాలని ప్రయత్నించారు. మురారి షూటింగ్‌లో ఉన్నప్పుడు దానయ్య లొకేషన్‌కు వచ్చారు. అప్పుడు 1000 రూపాయల నోటు తీసుకొచ్చారు. 1000 నోటు అప్పుడే వచ్చాయి. మీరు ఒప్పుకొంటే ఆ నోట్లతోనే అడ్వాన్స్ ఇస్తాను అని అన్నారు. కానీ ఎందుకు దానయ్యతో సినిమా చేయడం కుదర్లేదు. భరత్ అనే నేనుతో మా కాంబినేషన్ సెట్ అయింది.

చరణ్, ఎన్టీఆర్‌తో క్లోజ్‌గా

చరణ్, ఎన్టీఆర్‌తో క్లోజ్‌గా

చరణ్, ఎన్టీఆర్, నేను క్లోజ్‌గా ఉంటాను. మేము కలిసినప్పుడు సినిమాలు తప్ప అన్నీ విషయాలు మాట్లాడుకొంటాం. మేము కూడా సినిమాల గురించి మట్లాడితే ఏం మజా ఉంటుంది. ముగ్గురు ఫ్రెండ్స్ కలిస్తే ఎలా మాట్లాడుకుంటారో అలానే మాట్లాడుకొంటాం. ఫ్యాన్స్‌లో మార్పేమి కోరుకోవడం లేదు.

రీమేక్ చేయడం ఇష్టం లేదు

రీమేక్ చేయడం ఇష్టం లేదు

నాన్నగారు సినిమాలు రీమేక్ చేయడం ఇష్టం లేదు. ఆయన సినిమాలు చేసి చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆయన సినిమాలు రీమేక్ చేయను. ఇప్పటికే నేను ఈ విషయంపై చాలాసార్లు చెప్పాను.

 నేను సినిమాలు ఇవే

నేను సినిమాలు ఇవే

ప్రస్తుతం వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత సుకుమార్‌తో సినిమా ఉండవచ్చు. నాతో సుకుమార్ ఎలాంటి సినిమా తీస్తాడో ఆయనే చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఒకసారి కన్ఫర్మ్ అయ్యాక నేనే స్వయంగా వెల్లడిస్తాను.

ఎన్నికల్లో ప్రచారం చేయను

ఎన్నికల్లో ప్రచారం చేయను

2019 ఎన్నికల్లో ప్రచారం చేయను. ఆ సమయంలో నేను ఫ్యామిలీతో కలిసి సమ్మర్ హలీడేస్ కోసం ఫారిన్ వెళ్తాం. రాజకీయాలకు నేను దూరం. నా జీవితం కేవలం సినిమాకే అంకితం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X