Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రయోగాల జోలికి వెళ్లను.. అలా చేస్తే అమ్మా, నాన్న ఇంటికి వచ్చి కొట్టడం ఖాయం.. మహేష్‌బాబు
శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేష్‌బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రంలో తొలిసారి మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్లు, ట్రైలర్లకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఎక్కువ స్క్రీన్లు, థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో భరత్ అనే నేను గురించి ప్రిన్స్ మహేష్‌బాబు తెలుగు ఫిలింబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. మహేష్ వెల్లడించిన విషయాలు మీ కోసం..
ది బెస్ట్ ప్రీరిలీజ్ మూమెంట్
భరత్ అనే నేను సినిమాకు ముందు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు వెళ్లి వచ్చాను. సాధారణంగా సినిమా రిలీజ్ తర్వాత విదేశాలకు వెళ్తుంటాను. కానీ ఈసారి రిలీజ్ ముందే వెళ్లాను. నా కెరీర్లో ది బెస్ట్ ప్రీ రిలీజ్ మూమెంట్. ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను. నాతోపాటు సినిమా యూనిట్ మొత్తం బ్లాక్‌బస్టర్ వైబ్రేషన్లో ఉన్నది. ప్రీ రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ ఎక్సార్డినరీగా ఉన్నాయి. మేమంత చాలా హ్యాపీగా ఉన్నాం.
రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు
పాలిటిక్స్ అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు. ఈ సినిమా కోసం పెద్దగా ఎక్సర్సైజ్ చేయలేదు. కొరటాల శివ అంతా చూసుకొన్నారు. ఆయన కథ చెప్పినప్పుడే సీఎం పాత్ర అన్నారు. దాంతో నాకు రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పాను. అలాంటి క్యారెక్టర్ చేయడం పెద్ద బాధ్యత, గౌరవం కూడా. ఈ జర్నీలో చాలా నేర్చుకొన్నాను. రాజకీయాలపై ఓ అవగాహన వచ్చింది. ఈ సినిమా చేయడం అరుదైన అవకాశం.
పొలిటికల్ సినిమా తీయడం మామూలు విషయం కాదు
భరత్ అనే నేను లాంటి పొలిటికల్ సినిమాకు డైలాగ్స్ రాయడం మామూలు విషయం కాదు. లాజిక్కులు పక్కాగా ఉండాలి. వాటిని కొరటాల శివ ఎక్సార్డినరీగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో భారీగా డైలాగ్స్ ఉంటాయి. పేజీలు, పేజీలుగా డైలాగ్స్ వెళ్తుంటాయి. అంతకుమించి నేను ప్రత్యేకంగా ఎక్సర్సైజులు చేయలేదు. మా బావ గల్లా జయదేవ పార్లమెంట్లో ప్రసంగించిన వీడియోలు చూశాను.
నిజాయితీతో కూడిన పొలిటికల్ డ్రామా
భరత్ అనే నేను చిత్రంలో ప్రస్తుత రాజకీయాలపై విమర్శలు ఉండవు. చాలా నిజాయితీతో కూడిన పొలిటికల్ డ్రామా. సీఎం అంటే వయస్సు మీరిన వ్యక్తి అనే భావన ఉంటుంది. కానీ ఈ చిత్రంలో సీఎం యంగ్‌గా కనిపిస్తారు. రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్‌గా ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యాను. అందుకే ఆ పాత్ర నుంచి బయటపడటానికి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు వెళ్లి వచ్చాను.
పౌరుడికి ఉండాల్సిన బాధ్యత
భరత్ అనే నేను చిత్రంలో పౌరుడికి ఉండాల్సిన బాధ్యతను చెప్పాం. మంచి సందేశం ఉంది. పౌరులకు, నేతలకు మంచి సందేశం ఉంటుంది. ఒక నిజాయితీతో కూడినా, రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నది. ఈ సినిమాతో ఆ లోటు తీరుతుంది. ప్రజలను మార్చడానికో ఈ సినిమా తీయలేదు. కానీ ఈ సినిమాతో ఏదైనా మార్పు కనిపిస్తే మా లక్ష్యం నెరవేరినట్టే.
కమర్షియల్‌గా అన్నీ ఉంటాయి
భరత్ అనే నేను రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అయినప్పటికే కొరటాల శివ సినిమాలో ఉండే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ఇలాంటి చిత్రంలో హీరోయిన్‌తో పాటలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరమైన విషయం. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత సీఎం పాత్ర ఎంట్రీ ఉంటుంది. చివరి వరకు ఆ పాత్ర కొనసాగుతుంది.
హిట్టు కొట్టాలనే ఉద్దేశంతోనే
ప్రతీ సినిమాకు హిట్టు కొట్టాలనే ఒత్తిడి ఉంటుంది. గత సినిమాలు నిరాశపరిచినా ఆ సినిమా హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో పనిచేస్తాం. నేను నటించే ప్రతీ సినిమా సూపర్‌హిట్ కొట్టాలని పనిచేస్తాం. శివ దాదాపు 5 గంటలు కథ చెప్పారు. ఒకరోజు రెండున్నర గంటలు, మరో రోజు రెండున్నర గంటలు కథ చెప్పారు. ఆయన చెప్పిన విధానం చాలా ఆకట్టుకొన్నది. ప్రతీ సీన్ అద్భుతంగా ఉంది.
కియారా అద్వానీ గురించి
భరత్ అనే నేను సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కావడంతో కొత్త అమ్మాయిని తీసుకోవాలని అనుకొన్నాం. ఎంఎస్ ధోని సినిమాలో కియారా అద్వానీ చూశాం. వెంటనే ఆమెను తీసుకొన్నాం. ఆమె కూడా చాలా బాగా చేసింది. టీజర్లు, ట్రైలర్లలో ఆమెకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.
ఎన్టీఆర్‌కు థ్యాంక్స్
భరత్ బహిరంగ సభకు ఎన్టీఆర్‌ను ఆహ్వానించాలనేది కొరటాల శివ, నిర్మాత దానయ్య, అందరం కలిసి తీసుకొన్న నిర్ణయం. ఇక నుంచి అన్ని ఫంక్షన్లకు పెద్ద హీరోలు వెళుతారు. ఇక ట్రెండ్ మారుతుంది. మా ఫంక్షన్‌కు వచ్చిన ఎన్టీఆర్‌కు థ్యాంక్స్.
ప్రయోగాల జోలికి వెళ్లను...
నాన్నగారి సినిమాలు ప్రతీది చూస్తాను. అల్లూరి సీతారామరాజు, ఈనాడు సినిమాలు చూశాను. ఈనాడు సినిమా అయితే నేను 10 సార్లు చూశాను. నాన్నగారి సినిమాలు నాపై ప్రభావం ఉంటాయి. ఇక నుంచి నేను ప్రయోగాల జోలికి వెళ్లను. ఓపిక లేదు. అలానే ప్రయోగాలు చేస్తే అమ్మా, నాన్న ఇంటికి వచ్చి కొట్టేలా ఉన్నారు. ఇక ముందు కమర్షియల్ సినిమాలే చేస్తాను.