అప్పుడే కళ్లలో నీళ్లు తిరిగాయి... ఆమెతో ప్రేమలో.. మహేష్‌బాబు

'శ్రీమంతుడు', 'భరత్‌ అనే నేను'లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌, పవర్‌ఫుల్‌ సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. పూజా హెగ్డే హీరోయిన్‌. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేష్‌ ఏం చెప్పారంటే..

మూడు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ చేశారు కదా! పర్సనల్‌గా మీకు నచ్చిన క్యారెక్టర్‌ ఏది?

మూడు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ చేశారు కదా! పర్సనల్‌గా మీకు నచ్చిన క్యారెక్టర్‌ ఏది?

నన్ను అడిగితే మూడు చాలా బాగా నచ్చాయి. కానీ నా ఫేవరేట్‌ అంటే కాలేజ్‌ ఎపిసోడ్‌. ఎందుకంటే నేను కథ విన్నప్పుడే చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. వంశీతో కూడా చెప్పాను. కాలేజ్‌ ఎపిసోడ్‌ చాలా ఇంపార్టెంట్‌, చాలా జాగ్రత్తగా, కాన్ఫిడెంట్‌గా తీయాలని. ఎందుకంటే కెరీర్‌ టు డికేడ్స్‌ అయిపోయింది. 25వ సినిమాకి వచ్చాము. కాలేజ్‌ ఎపిసోడ్‌ ప్రాపర్‌గా 45 మినిట్స్‌ ఉంటుంది. దాన్ని కన్విన్సింగ్‌గా తీయగలిగితే మనం అఛీవ్‌ చేసినట్లే అని చెప్పాను. అందుకని అది నా ఫేవరేట్‌ బ్లాక్‌. ఇప్పుడు ఆ బ్లాక్‌ని సినిమాలో చూస్తున్నప్పుడు చాలా గర్వంగా అన్పించింది. ఆడియన్స్‌ కూడా ఆ బ్లాక్‌కి సర్‌ప్రైజ్‌ ఫీల్‌ అవుతారు.

'మహర్షి' సినిమాలో మీకు ఇన్నోవేటివ్‌గా అనిపించిన పాయింట్‌ ఏది?

'మహర్షి' సినిమాలో మీకు ఇన్నోవేటివ్‌గా అనిపించిన పాయింట్‌ ఏది?

అది కథే అండి. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో చెప్పినట్లుగా కథ ఒక 20 నిమిషాలు విందామనుకున్నాను. కానీ ఆయన నేరేట్‌ చేసిన విధానం నన్ను నిజంగా సర్‌ప్రైజ్‌ చేసింది. అప్పుడు వంశీతో చెప్పాను. ఇప్పుడు నాకు రెండు కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. వాటి తర్వాత చేద్దాం అని. దానికి ఆయన 'నో ప్రాబ్లెమ్‌ సార్‌! వెయిట్‌ చేస్తాను. ఎందుకంటే మీరు తప్ప 'మహర్షి' ఇంకెవరూ చేయలేరు. మీరే కనిపిస్తున్నారు' అన్నారు. ఆయన కన్విక్షన్‌కి హ్యాట్సాఫ్‌.

ఈ కథ 25వ సినిమాగా చేద్దామని ముందే అనుకున్నారా?

ఈ కథ 25వ సినిమాగా చేద్దామని ముందే అనుకున్నారా?

అనుకోకుండా వచ్చింది. వంశీ కథ చెప్పడం. తర్వాత నా రెండు సినిమాలు రావడం. వంశీ వెయిట్‌ చేయడం. ఇది 25వ సినిమాగా చేద్దామని మేం ప్లాన్‌ చేయలా. అలా జరిగింది. నా ఎంటైర్‌ కెరీర్‌లో అంత డెప్త్‌గా ఉన్న క్యారెక్టర్‌ నేను వినలేదు. అంత డెప్త్‌ ఉంది 'మహర్షి'లో. కంటెంట్‌పరంగా రిచ్‌గా ఉంటూ ఈమధ్యకాలంలో ఆడియన్స్‌ కూడా చూసి ఉండరు. ఒక జెన్యూన్‌ ఫిల్మ్‌. అన్నీ ఎమోషన్స్‌, క్లాస్‌, మాస్‌, యూత్‌, ఫ్యామిలీ, ఇలా అన్నీ యాంగిల్స్‌ కవర్‌ చేస్తూ ఒక హీరో ఫ్యాన్స్‌ని ఎలా ఎగ్జయిట్‌ చెయ్యాలో.. అలా డిజైన్‌ చేశారు వంశీ.

సక్సెస్‌ కోసం పోరాడే క్యారెక్టర్‌ చేయడం ఎలా అన్పించింది?

సక్సెస్‌ కోసం పోరాడే క్యారెక్టర్‌ చేయడం ఎలా అన్పించింది?

బేసిగ్గా నేను 'మహర్షి' కథ విన్నప్పుడు నా ఒక్కడికే కాదు.. మనందరికీ కూడా ఎక్కడో ఓ చోట రిలేట్‌ అవుతుంది. ఒక ఎమోషనల్‌ స్క్రిప్ట్‌కి ఉన్న బ్యూటీ అది. ప్రతి ఒక్కరూ మన లైఫ్‌లో జరిగిందే అని ఫీలవుతారు. అది నేనూ ఫీలయ్యాను. ఆడియన్స్‌ కూడా ఫీలవుతారు.

మామూలుగా ప్రొడ్యూసర్స్‌ మల్టీస్టారర్‌ హీరోలతో వర్క్‌ చేయాలనుకుంటారు.

మీరు మూడు బేనర్స్‌లో, మల్టీస్టారర్‌ ప్రొడ్యూసర్స్‌తో చేయడం ఎలా అన్పించింది?

మీరు మూడు బేనర్స్‌లో, మల్టీస్టారర్‌ ప్రొడ్యూసర్స్‌తో చేయడం ఎలా అన్పించింది?

ముందుగా ప్రొడ్యూసర్స్‌కి థాంక్స్‌. 'మహర్షి' అనేది చాలా పెద్ద మ్యాగ్నిట్యూడ్‌ ఉన్న ట్రెమండస్‌ ప్రాజెక్ట్‌. ముగ్గురు ప్రొడ్యూసర్స్‌ చాలా సపోర్ట్‌ చేస్తున్నారు. మూడు కూడా ప్రెస్టీజియస్‌ బేనర్‌లే. కథ వింటున్నప్పుడు, డబ్బింగ్‌ చెప్పేటప్పుడు నాకే కళ్లలో నీళ్లు తిరిగాయి. క్లైమాక్స్‌ సినిమాకి చాలా కీలకం. క్లైమాక్స్‌ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను.

అందుకే దిల్ రాజు కూడా ప్రీరిలీజ్ ఫంక్షన్లో అది చెప్పారు.

పూజా హెగ్డే పెర్‌ఫార్మెన్స్‌ గురించి?

పూజా హెగ్డే పెర్‌ఫార్మెన్స్‌ గురించి?

పూజ వెరీ గుడ్‌ లుకింగ్‌. మా సినిమాలో చాలా అందంగా ఉంది. ఆమె క్యారెక్టర్‌ను వంశీ క్రియేట్‌ చేసిన విధానం, ప్రెజెంట్‌ చేసిన తీరు చాలా బాగుంది. ఫ్యాన్స్‌ అందరూ ఆమెతో ప్రేమలో పడతారు.

అల్లరి నరేష్‌ క్యారెక్టర్‌ గురించి?

అల్లరి నరేష్‌ క్యారెక్టర్‌ గురించి?

సినిమాలో అల్లరి నరేష్‌ క్యారెక్టర్‌ చాలా ఇంపార్టెంట్‌. కథ చెబుతున్నప్పుడు వంశీ కూడా అల్లరి నరేష్‌ అని పేరు చెప్పే కథ చెప్పారు. అలాగే ఆయన కూడా కథ వినగానే వెంటనే ఓకే చెప్పారు. ఈ సందర్భంగా నరేష్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X