twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    YS Jagan బిహేవియర్‌పై మహేష్ బాబు ప్రశంసల జల్లు.. ఎవరూ ఊహించని విధంగా అలా..

    |

    ఏపీ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్య కొద్ది నెలల క్రితం వరకు ఒకరకమైన అనిశ్చితి, గ్యాప్ ఉన్నట్టు కనిపించింది. సినిమా టికెట్ రేట్లు, అదనపు షో ప్రదర్శన విషయంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కొంచెం కఠినంగా వ్యవహరించడంతో సినిమా పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి గ్యాప్ ఉందనే భావన కనిపించింది. అయితే ఆ గ్యాప్‌ను పూడ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకొని ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపడం తెలిసిందే. ఈ చర్చల కోసం ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ, రాజమౌళి తదితరులు ఏపీ రాజధానికి వెళ్లి సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. అయితే సీఎం జగన్‌తో భేటి గురించిన విషయాలపై మహేష్ బాబు స్పందిస్తూ..

    ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన తర్వాత చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఇంతకు ముందు ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. కానీ ఎప్పుడూ కలువలేదు. కానీ ఆ మధ్య కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చాలా సింపుల్. అంత సింపుల్‌గా ఉంటారా? అని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు అనిపించింది. ఎదుటి వ్యక్తులకు మంచి గౌరవం ఇస్తారు. ఆయనతో మంచి సంభాషణ జరిగింది అని మహేష్ బాబు అన్నారు.

    Mahesh Babu praises Andhra Pradesh CM YS Jagan Mohan Reddy in Sarkaru Vaari Paata promotions

    ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను సీఎం జగన్ అడిగి తెలుసుకొన్నారు. బయట ఏం జరుగుతున్నది? పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని అడిగారు. అయితే ఇలాంటి మీటింగ్ ఇక ముందు జరిగితే బాగుంటుందని నేను సలహా ఇచ్చాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన మమల్ని రిసీవ్ చేసుకొన్న విధానం నాకు బాగా నచ్చింది. ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుంది అని మహేష్ బాబు తెలిపారు.

    సూపర్ స్టార్ మహేష్ బాబు, గీత గోవిందం ఫేమ్ దర్శకుడు పరుశురామ్ కాంబినేషన్‌లో సర్కారు వారీ పాట మూవీ మే 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్ర ప్రమోషన్ సందర్భంగా మహేష్ బాబు మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

    English summary
    Superstar Mahesh Babu met AP CM YS Jagan quite sometime back in AP capital. Mahesh showers praises on AP CM.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X