నటిగా సితార, నా చేతుల్లో లేదన్న మహేష్.. అందుకే దూరంగా గౌతమ్?
మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధమైంది. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా అనేక వాయిదాలు పడి ఎట్టకేలకు మే 12న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. తాజాగా మహేష్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాక తన పిల్లల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి
..

మహేష్ బాబు హీరోగా
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా అన్న రమేష్ బాబు తరువాత మహేష్ బాబు చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ఇద్దరూ కూడా నటనలో, వ్యక్తిత్వంలో తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు. రమేష్ బాబు ఇటీవలే కాలం చేయగా మహేష్ బాబు హీరోగా సత్తా చాటుతున్నాడు. ఇక మహేష్ కు గౌతమ్ అనే కుమారుడు, సితార అనే కుమార్తె ఉన్నారు. ఇక 'వన్ నేనొక్కడినే' సినిమాలో మహేష్ చిన్నప్పటి పాత్రలో గౌతమ్ నటించారు.

యాక్టర్ అవుతా
ఇక తాజా 'సర్కారు వారి పాట' సినిమా 'పెన్నీ...' ప్రమోషనల్ సాంగ్‌లో సితార కూడా మెరిసింది. ఇక ఈ క్రమంలోనే ఆమె కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో భాగంగా ఆమెను నీ డ్రీమ్ గురించి చెప్పమంటే ఆమె నేను డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని నేను అనుకోవడం లేదు. యాక్టర్ అవుతా. అది నా డ్రీమ్ అని సితార చెప్పింది.

సితారను దగ్గర నుంచి చూశా
అయితే మహేష్ ను ఇదే విషయం మీద ప్రశ్నిస్తూ మీరు, నమ్రత ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? అని అగిడితే నిజాయితీగా చెప్పాలంటే... మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది మా నిర్ణయం కాదు. సితార పాప స్వయంగా ఆ డెసిషన్ తీసుకుంది. ఈతరం పిల్లలు తమ నిర్ణయాలు తామే తీసుకుంటున్నారని మహేష్ వెల్లడించారు. కరోనా కారణంగా రెండు మూడేళ్ళుగా పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నానన్నా ఆయన సితారను దగ్గర నుంచి చూశానని అన్నారు.

సితారకు ఆ పనులు ఇష్టం
పిల్లలు చాలా త్వరగా పెరుగుతున్నారన్న మహేష్ తాను యాక్టర్ కావాలని అనుకుంది. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ హర్. తనను చూస్తే గర్వంగా ఉందని అన్నారు. ఇక సోషల్ మీడియాలో సితార కనిపించిన అంతగా గౌతమ్ ఎందుకు కనిపించడు? అని మహేష్ ను ప్రశ్నిస్తే కొంత మందికి కొన్ని నచ్చవని అన్నారు. గౌతమ్ వేరే, సితార వేరే, గౌతమ్ కూడా సితారతో ఎప్పుడూ 'నీకు వేరే పని లేదా? ఎప్పుడూ యూట్యూబ్, యూట్యూబ్ అంటావ్' అని అంటాడని, కానీ సితారకు ఆ పనులు ఇష్టం. గౌతమ్ కు వేరే యాక్టివిటీస్ ఇష్టమని అన్నారు.

కథ కుదరాలి కదా
మరి మీ మీ వారసుడిగా వస్తాడు కదా అంటే అది మీరు గౌతమ్ ను అడగాలని దాట వేశారు. ఏ కెరీర్ ఎంపిక చేసుకోవాలనేది గౌతమ్ ఇష్టమన్న ఆయన అది నా చేతుల్లో లేదని అన్నారు. మరి 'వన్ నేనొక్కడినే'లో అబ్బాయితో, 'సర్కారు వారి పాట'లో 'పెన్నీ' పాటలో అమ్మాయితో నటించారు కదా, మరి ఇద్దరితో కలిసి నటించేది ఎప్పుడు? అని ప్రశ్నిస్తే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అసలు కథ కుదరాలి కదా అని అన్నారు.


Click it and Unblock the Notifications











