twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్ జగన్ డబ్బు పెడితే పరిస్థితి ఇలా ఉంటుందా?.. ఓట్లు వేయరు.. యాత్ర డైరెక్టర్ మహీ రాఘవ

    |

    దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని కొన్ని కీలక సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రం యాత్ర. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి స్వర్గీయ వైఎస్ఆర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా దర్శకుడు మహీ వీ రాఘవ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర అంశాన్ని ప్రధానంగా చేసుకొని తెరకెక్కించామన్నారు. యాత్ర సినిమా గురించి చెప్పిన మరికొన్ని విషయాలు..

     మమ్ముట్టినే ఎందుకు ఎంపిక చేశానంటే

    మమ్ముట్టినే ఎందుకు ఎంపిక చేశానంటే

    యాత్ర చిత్రానికి మమ్ముట్టిని ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఆయన స్క్రీన్ ప్లజెన్స్ ఒకటి. ఇక ఈ సినిమా కథను ఆయనకు చెప్పినప్పుడు నేను ఎందుకు చేయాలని అడిగారు. అందుకు జవాబుగా దళపతి చిత్రంలో ఆయన చేసిన కొన్ని సీన్ల గురించి చెప్పడం బాగా నచ్చింది. అంతేకాకుండా కథలో ఉండే ఎమోషన్స్‌ మమ్ముట్టిని కట్టిపడేశాయి.

    విజయమ్మ, రాజారెడ్డి పాత్రల గురించి

    విజయమ్మ, రాజారెడ్డి పాత్రల గురించి

    ఇక యాత్ర మూవీలో విజయమ్మ పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు ఉంటాయి. వైఎస్ జగన్‌కు సంబంధించిన కొన్ని సీన్లు కనిపిస్తాయి. అలాగే వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్ర చాలా కీలకమైంది. ఈ పాత్ర లేకుంటే వైఎస్ఆర్ గురించి ఇంట్రెస్టింగ్ ఏమీ చెప్పలేం. ఈ పాత్రలో జగపతిబాబు నటించారు. చాలా చిన్న పాత్ర ఆయనది. కాకపోతే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సినిమాకు అదనపు ఆకర్షణగా మారుతుంది అని చెప్పారు.

    మీ నాయకుడు మీ ఇష్టం

    మీ నాయకుడు మీ ఇష్టం

    యాత్ర సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు వైఎస్ జగన్‌ను కలిసి చెప్పాను. ఆ సమయంలో మీ నాయకుడి కథను మీరు తీస్తున్నారు. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే రాజశేఖరరెడ్డి చేసిన పనులను పక్కాగా చెప్పండి. చేయని విషయాలను చెప్పి ఆయనను కించపరుచవద్దని సలహా ఇచ్చారు అని మహీ వీ రాఘవ పేర్కొన్నారు.

    వైఎస్ జగన్ పెట్టుబడి పెడితే

    వైఎస్ జగన్ పెట్టుబడి పెడితే

    యాత్ర సినిమాకు వైఎస్ జగన్ ఫండింగ్ చేశారనే విషయం అవాస్తవం. ఒకవేళ వైఎస్ జగన్ కనుక తన తండ్రి జీవిత కథను తెరకెక్కించాలనుకొంటే నన్ను డైరెక్టర్‌గా పెట్టుకొనే వాడా? అలాంటి సినిమాకు చిన్న చిన్న టెక్నిషియన్స్ పనిచేస్తారా? ఒకవేళ ఆయనే డబ్బు పెడితే సినిమాలో పెద్ద పెద్ద నటులు, భారీ స్థాయిలో హై రేంజ్ టెక్నిషియన్స్ పనిచేసేవారు. యాత్రకు జగన్ పెట్టుపడి పెట్టారనే వాదనలో ఎలాంటి నిజం లేదు అని దర్శకుడు మహీ రాఘవ స్పష్టం చేశారు.

    సినిమా చూసి ఓటర్లు ఓట్లేస్తారా?

    సినిమా చూసి ఓటర్లు ఓట్లేస్తారా?

    యాత్ర చిత్రం వైఎస్ జగన్‌కు గానీ, వచ్చే ఎన్నికలపై గానీ ఎలాంటి ప్రభావం చూపదు. ఈ రోజుల్లో ఓటర్లు చాలా తెలివైన వారు. వారు లెక్కలేసుకొని ఎవరికి ఓట్లు వేయాలో వారికే వేస్తారు. సినిమాలు చూసి ఓట్లు వేసే రోజులు పోయాయి. అలాగే ప్రస్తుతం జగన్ కోసం పోలయ్యే ఓట్ల కంటే ఒక్క ఓటు కూడా సినిమా వల్ల పడదు. ప్రేక్షకులు సినిమా చూసి జగన్‌కు ఓటు వేస్తారని అనుకోను అని మహీ రాఘవ అభిప్రాయపడ్డారు.

    English summary
    YSR Biopic Yatra Movie is set to release in February 8th. Mammotty is acting as Late YSR. This movie is directed by Mahi V Raghava. Jagapathi Babu is playing YSR father Rajareddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X