ఛాన్స్ వస్తే నా ఆత్మతో ఆ దేహంలోకి వెళ్తా.. చిరంజీవి అంటే ఇష్టం.. మాళవిక
టాలీవుడ్‌లో ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో మాళవిక నాయర్ కెరీర్‌ను ప్రారంభించి.. కల్యాణ వైభోగమే, మహానటి, విజేత లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకొన్నది. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రంలో కథకు బలంగా మారే పాత్రలో కనిపించింది. టాక్సీవాలా రిలీజ్ అనంతరం మాళవిక పోషించిన పాత్రకు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో దూసుకెళ్తున్న నేపథ్యంలో మాళవిక తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

రెండేళ్లుగా వెయిటింగ్ చేస్తున్నా
టాక్సీవాలా విజయం కోసం రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ కథ చెప్పినప్పుడే కొత్తగా ఉందనిపించింది. సెంటిమెంట్, కథలో కొత్తదనం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకొన్నాను. నా పాత్ర చిన్నదైనప్పటికీ శిశిర పాత్రలో ఇంటెన్సిటీ ఉంది. అందుకే టాక్సీవాలా చేశాను.

ఆత్మ మరో ఆత్మతో మాట్లాడటం
ఓ ఆత్మ మరో ఆత్మతో మాట్లాడటం (ఆస్ట్రాల్ ప్రొజెక్షన్) అనేది మాట్లాడుకోవడానికి నమ్మశక్యంగా లేకపోయినా చాలా సంఘటనలు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. కానీ సినిమాపరంగా అయితే ఇప్పటి వరకు తెర మీద ఇలాంటి కథ రాలేదు. అందుకే ప్రజలు ఆదరిస్తున్నారు.

ఇందిరాగాంధీ దేహంలోకి
ఒకవేళ నా ఆత్మ మరో దేహంలో ప్రవేశించడానికి అవకాశం లభిస్తే మరణించిన ఇందిరాగాంధీ బాడీలోకి ప్రవేశిస్తాను. ఆమె క్యారెక్టర్, ఆమె ఆలోచన తీరును తెలుసుకోవాలనే కోరిక ఉంది. అందుకే ఇందిరా గాంధీ దేహాన్ని ఎంపిక చేసుకొంటాను.

లవ్ ప్రపోజల్స్ పెద్దగా రాలేదు
నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి నాకు పెద్దగా లవ్ ప్రపోజల్స్ రాలేదు. ఎందుకంటే హీరోయిన్ కాబట్టి చెప్పడానికి భయపడుతుంటారు. సోషల్ మీడియాలో ఎలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. కానీ నేను పెద్దగా పట్టించుకోను. ప్రస్తుతం నాకు చదువు, కెరీర్ ముఖ్యం.

మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు
నా సహచర నటుల్లో విజయ్ దేవరకొండ ఇష్టం. అతడిని పక్కన పెడితే నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్‌లు, పాటలు చాలా చాలా ఇష్టం. ఒక్క డ్యాన్సులే కాకుండా యాక్టింగ్, స్టయిల్ కూడా నచ్చుతుంది. విజేత సినిమాలో నటించేటప్పుడు కలిసే అవకాశం వచ్చింది. మెగాస్టార్‌ను కలినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను.


Click it and Unblock the Notifications











