ఆ అబ్బాయికి సిగ్గు ఎక్కువ.. అందుకే వెంటపడి ప్రపోజ్ చేశా.. మాళవిక నాయర్ (ఇంటర్వ్యూ)

నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. కామెడీ, ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం యువ హీరో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం మార్చి 17వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే ఈ సినిమా టీజర్లు, ప్రమోషన్ కార్యక్రమాల జోష్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాళవిక నాయర్ మీడియాతో మాట్లాడుతూ..

పాత్ర కోసం చాలా కష్టపడ్డాను..

పాత్ర కోసం చాలా కష్టపడ్డాను..

ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా కథ నా మనసుకు నచ్చిన చిత్రం. నాకు సినిమా బాగా నచ్చడంతో ట్రైలర్‌ను పదే పదే చూస్తున్నాను. ఇటీవల కాలంలో నేను ఎక్కువగా ఇష్టపడి చూసిన సినిమా ట్రైలర్ ఇదే. నటిగా నేను ఇష్టపడి చేశాను. ఈ పాత్ర కోసం ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువగానే కష్టపడ్డాను. డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ చెప్పిన ప్రకారం చేసుకొంటూ పోయాను.

అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొన్న అవసరాల శ్రీనివాస్‌తో పనిచేయడం చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. తెలుగు భాషపై ఆయనకు గట్టిపట్టు ఉన్నది. ఆయనతో పనిచేయడం వల్ల నేను తెలుగు భాషను మరింత నేర్చుకొన్నాను. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని మాళవిక చెప్పింది.

కథలో ఏడు చాప్టర్లు

కథలో ఏడు చాప్టర్లు

ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా కథ 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు సాగుతుంది. ఏదైనా ప్రేమకథలో టైమ్ ఫ్రేమ్ రెండు, మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండదు. టైమ్ ఫ్రేమ్ ఉంది కాబట్టి.. నాగశౌర్య యువకుడిగా కనిపించేందుకు చాలా కష్టపడ్డాడు. పాత్రకు అనుగుణంగా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకొన్నాడు.

ఇందులో ఏడు చాప్టర్లు ఉంటాయి. ప్రతీ చాప్టర్‌కు ఒక థీమ్ ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఈ కథా ప్రయాణంలో నా పాత్రకు పూర్తి న్యాయం చేశాననే ఫీలింగ్‌లో ఉన్నాను అని మాళవిక నాయర్ వెల్లడించింది.

నిజ జీవితంలో ప్రేమను పంచుతూ

నిజ జీవితంలో ప్రేమను పంచుతూ

ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా కథలో నా పాత్ర కంటే నాగశౌర్య రోల్‌తో చాలా కనెక్ట్ అయ్యాను. నేను ఈ సినిమాలో అనుపమ అనే పాత్రను చేశాను. నాగశౌర్య సంజయ్ అనే పాత్రలో కనిపిస్తారు. సాధారణంగా నిజ జీవితంలో నేను ప్రేమను పంచే విధంగా ఉంటాను. కానీ ఈ సినిమాలో అందర్ని హార్ట్ చేస్తుంటాను. ప్రేమ కథ సాజావుగా సాగుతూ ఉంటుంది. ఇతరులతో పడే గొడవ ప్రతీ చోట ఉండేలా ఉంటుంది అని మాళవిక చెప్పింది.

అబ్బాయి వెనుక పడి ప్రపోజ్

అబ్బాయి వెనుక పడి ప్రపోజ్

ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి రెగ్యులర్ మూవీ కాదు. ప్రతీ ఎమోషన్‌కు మనం కనెక్ట్ అవుతాం. సినిమా చూసినంత సేపు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ప్రతీ సినిమాలో అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తుంటాడు. కానీ ట్రైలర్‌ మీరు చూసే ఉంటారు. నేను అబ్బాయి వెనుక పడి ప్రపోజ్ చేస్తుంటాను. సిగ్గు పడే అబ్బాయికి ప్రపోజ్ చేస్తుంటాను. సినిమా కొత్తగా ఉంటుంది అని మాళవిక చెప్పింది.

లైఫ్ గురించి క్రాష్ కోర్సు కాదు..

లైఫ్ గురించి క్రాష్ కోర్సు కాదు..

ప్రతీ ఆడియెన్స్‌కు వినోదం పంచేలా ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి ఉంటుంది. లైఫ్‌లో ఎలా ఉండాలనే కోణంలో క్రాష్ కోర్సు ఇవ్వడం లేదు. దర్శకుడు శ్రీనివాస్ చాలా వాస్తవ పరిస్థితులను బేరిజు వేసుకొని సినిమాను వినోదంగా మలిచారు. ప్రేక్షకుడు హ్యాపీగా ఫీలైతే.. కథ వాస్తవంగా ఉందా? లేదా అనే ఆలోచించడు. ఇది కమర్షియల్ ఫిలిమా? లేదా అనే పట్టించుకోడు అని మాళవిక నాయర్ పేర్కొన్నది.

స్టార్ డమ్ రాలేదనే బాధ లేదు..

స్టార్ డమ్ రాలేదనే బాధ లేదు..

నేను సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించాను. కానీ నాకు స్టార్ డమ్ రాలేదని బాధపడను. ఎవరైనా అలా అంటే కూడా పట్టించుకోను. ఒకరి అభిప్రాయాలను కంట్రోల్ చేయలేం. ఎవరి అభిప్రాయాలు వారివే. నాకు నేను బెటర్‌గా చేయాలని.. మంచి పాత్రలు చేయాలని అనుకొంటాను. అంతేగానీ స్టార్ డమ్ ఉందా? లేదా అనేది పట్టించుకోను అని మాళవిక నాయర్ అన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X