మోహన్ బాబు ఆస్తిలో పైసా వద్దు.. నా జోలికొస్తే.. మంచు మనోజ్ అల్టీమేటం

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మనోజ్. డిఫరెంట్ కథలు, సినిమాలతో యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు మనోజ్. తాజాగా నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లతో కలిసి ఆయన నటించిన భైరవం సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వెబ్ పోర్టల్ గేట్ ఆంధ్రకు మంచు మనోజ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సినిమాలు, తండ్రి మోహన్ బాబు, అన్నయ్య విష్ణుతో వివాదంపై పెదవి విప్పారు. ఈ వివరాల్లోకి వెళితే.

వర్కవుట్లు, డ్యాన్స్ వదిలేశా

'వర్కవుట్లకు గ్యాప్ వచ్చిన మాట నిజమే. తర్వాత బాడీపై ఫోకస్ పెట్టడం లేదు, సినిమా అమ్మకు ద్రోహం చేయకు అని రిలీజై వర్కవుట్లపై దృష్టి పెట్టా. మా తాతగారి జీన్స్ కారణంగా చిన్నప్పటి నుంచి బొద్దుగానే ఉండేవాడిని. డ్యాన్స్‌ చేయడం ఎంతో మిస్ అయ్యా.. సినిమాలే కాకుండా మా ఇంట్లో ఏదైనా పార్టీ జరిగినా, ఫంక్షన్ జరిగినా డ్యాన్స్ చేస్తూ జోష్ తీసుకొచ్చేవాడిని.. సినిమాలకు బ్రేక్ తీసుకున్నాక, డ్యాన్స్‌ మీద ఇంట్రెస్ట్ పోయింది. బైరవంతో మళ్లీ జోష్, ఉత్సాహం వచ్చి డ్యాన్స్ చేశా. డ్యాన్స్, డ్రైవింగ్, స్విమ్మింగ్ ఒకసారి నేర్చుకుంటే అది బాడీలోనే ఉంటుంది కాబట్టి మరిచిపోయే ప్రసక్తే లేదు' అని మంచు మనోజ్ తేల్చిచెప్పారు.

Manchu Manoj Opens About The war with Manchu Vishnu in Greatandhra Murthy Interview

జీవితం మీద ఆశ కలిగింది

'జీవితంలో టెన్షన్లు ఎప్పుడూ ఉంటూనే వచ్చాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశా, 19 ఏళ్లకే హీరో అయ్యా .. గ్యాప్ వచ్చినప్పుడల్లా నెక్ట్స్ ఏం సినిమాలు చేద్దామా, ప్రొడక్షన్ వాటిపైనే దృష్టి ఉండేది. విడాకులు తీసుకున్న రెండేళ్లు నా జీవితంలో చీకటి రోజులు. నన్ను మార్చడానికి అమ్మ బాగా గుడులు తిప్పింది, రిషికేష్‌లో వారం రోజులు గడిపి రిఫ్రెష్ అయ్యా. ఇంటి ముందు బ్రాహ్మణులు వచ్చి గొడవ చేసినప్పుడు నేను లేనని, నేను ఎక్కడున్నా గొడవ ఆపడానికే చూస్తాను తప్పించి పెంచను. మా ఎన్నికల సమయంలోనూ గొడవలు జరగకుండానే చూశా, తిప్పి తిప్పి కొడితే 1000 మంది మెంబర్స్ లేరు అని అందరినీ కూల్ చేశా. రిషికేష్‌ నుంచి వచ్చిన తర్వాత సినిమాలు చేయాలని అనిపించడం, మౌనిక కలవడం, మళ్లీ జీవితం మీద ఆశ కలిగింది' అని మనోజ్ గుర్తుచేసుకున్నారు.

ప్రభుదేవా నన్ను తొక్కేశాడు

నాకు కొంచెం డ్యాన్స్ వచ్చిందంటే ధర్మరాజు మాస్టర్ వల్లే, నేను నెంబర్ వన్ డ్యాన్సర్ కాలేదంటే దానికి కారణం ప్రభుదేవానే. ప్రభు, రాజు సుందరంలు చెన్నైలో ప్రాక్టీస్ చేసేవాళ్లు. ధర్మరాజు మాస్టర్ మా ముగ్గురికి డ్యాన్స్ నేర్పించేవాళ్లు. ముగ్గురిలో నేను చిన్నోడిని కావడంతో ప్రభు, సుందరంలు నన్ను ముద్దు చేసేవాళ్లు. డ్యాన్స్ క్లాస్‌కి ముందు, తర్వాత ధర్మరాజు మాస్టర్ కొన్ని శ్లోకాలు చెప్పించడంతో అవి నాకు కంఠత వచ్చేవి.

Manchu Manoj Opens About The war with Manchu Vishnu in Greatandhra Murthy Interview

యుద్ధం చేయాల్సిందే

'ఇన్నేళ్ల కెరీర్‌లో మనోజ్ ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. అలాంటిది మనోజ్ బరస్ట్ అవుతున్నాడంటే? ఎందుకు అలా అవుతున్నాడని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఏదైనా తెలియని వ్యక్తితో అపాయం ఉందని తెలిస్తే యుద్ధానికి వెళ్లిపోవడం ఒక్క నిమిషం పని. నన్ను నేను కాపాడుకోవడానికి మీడియా గుర్తొచ్చి, నా వాయిస్ రైజ్ కావడం వల్లే నాకు జరగాల్సింది ఆగిపోయింది. ఒక ఊరికి వెళ్లినప్పుడు నా చిన్నప్పుడు జ్ఞాపకాలు పోయినా పర్లేదని సరిపెట్టుకున్నా, మా ఆవిడ వాళ్ల అమ్మనాన్న బట్టలు గుర్తుగా దాచుకుంది అవి ఎలా తీసుకురాను. వాళ్లింట్లో పనిచేసేవాళ్లతో కూడా కేసులు వేయించినా సరే, మేం తిరిగి ఒక కేసు వేయలేదు. నాకు ప్రేమించడమే తెలుసు కానీ, కోప్పడటం రాదు. మేం అందరం కలిసి ఒకే టేబుల్ మీద కూర్చోబెట్టి హ్యాపీగా మాట్లాడే రోజు రావాలి' అని మనోజ్ కోరుకున్నారు.

శివయ్య అనడం తప్పే

'కన్నప్ప సినిమా యూనిట్‌కు చెందిన వారిని ఏమైనా అని ఉంటే క్షమించండి. సినిమా ఒక్కడిది కాదు, అందరిదీ ఇకపై ఆ తరహా కామెంట్స్ చేయను, కన్నప్ప కూడా గొప్ప విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. మా నాన్నని ఎప్పుడూ ఏమీ అనలేదు, ఇది కేవలం అన్నతమ్ముడి మధ్య మాత్రమే జరిగింది. అది నాన్నకి- నాకు మధ్య జరిగినట్లుగా మారిపోయింది. మా నాన్న క్రియేట్ చేసిన లెగసినీ, ఆయన ఆస్తిని కానీ నేను అడగను అందుకే తొలి నుంచి కొత్త డైరెక్టర్లు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకుని నా మార్క్ చూపించాలని అనుకున్నా. ఆయన నేర్పింది, ఆయనని చూసి నేర్చుకున్న నీతి ప్రకారమే నడుచుకుంటున్నా' అని మోహన్ బాబుపై అభిమానం చాటుకున్నారు.

Manchu Manoj Opens About The war with Manchu Vishnu in Greatandhra Murthy Interview

ఒక్క రూపాయి కూడా వద్దు

కలెక్టర్ ఆఫీస్‌ను నేను ఆశ్రయించలేదు. నాకు నోటీస్ వచ్చింది, నన్ను కలెక్టర్ ఆఫీస్‌కు పిలిపించారు. నా మీద, నా వైఫ్ మీద వేసిన దానిని ఎదుర్కొంటూ వస్తున్నా, తప్పుడు కేసులు వేస్తే ఎవరూ ఊరుకోరు. గొడవ జరిగి, మా మీద పోలీస్ కంప్లయంట్ వేసిన తర్వాత మా పాటికి మేం అదే ఇంట్లో ఉన్నాం. మనుషులొచ్చి బెదిరించి, ఏ తప్పు చేయనప్పుడు సైలెంట్‌గా ఉండటానికి నేను మహాత్మా గాంధీని కాదు. మా ఇంట్లో నేను ఎలాగో, మౌనిక కూడా ఇంట్లో నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా మా కష్టం మేం పడుతున్నాం. పెద్దల నుంచి నేర్చుకున్న సిద్ధాంతాలు, విలువలు, కష్టపడేతత్వంతో మా ప్రపంచం మేం క్రియేట్ చేసుకోగలం. నేను కానీ, నా వైఫ్ కానీ మా పెద్దవాళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించం. నేను సినిమాల్లో కంటిన్యూ అవుతా, మౌనిక వీడియో గేమ్స్, టాయ్స్ బిజినెస్ చేస్తోంది' అని మనోజ్ వెల్లడించారు.

Take a Poll

ఇండస్ట్రీకి కులం రంగు పులమొద్దు

'ఆర్ధిక సమస్యలు అందరికీ వస్తాయి. చరణ్, ఎన్టీఆర్, బన్నీలు పాన్ ఇండియా హీరోలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్లంతా మాకు గేట్స్ ఓపెన్ చేశారు, పాన్ ఇండియా కల్చర్‌ను సెట్ చేసింది మా బ్రదర్సే కావడం చాలా గర్వంగా ఉంది. ఎన్టీఆర్, చరణ్‌ల సినిమాలలో విలన్ రోల్ వస్తే ఖచ్చితంగా చేస్తా. భైరవం డైరెక్టర్ విజయ్ కుమార్.. పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. వ్యక్తిగతంగా, సినీ రంగానికి చెందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్‌ను నేను ఇష్టపడతా. టాప్ పొజిషన్‌లో ఉండి, కెరీర్‌ను వదులుకుని ప్రజల కోసం నిలబడ్డారు. 2025లోనూ క్యాస్ట్‌ల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ప్రశాంత్ నీల్‌, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి వారిని ఏ కులమని మనమంతా ఆరాధిస్తున్నాం. సినిమా హాల్‌లో మన పక్కన ఉన్నది ఎవరని మనం ఆలోచిస్తామా? అక్కడ ఎంజాయ్ చేయడమే. క్రికెట్ ఎలా అయితే దేశాన్ని ఒక్కటి చేస్తుందో.. సినిమా కూడా అందరినీ కలుపుతుంది. సినిమాకు కులం రంగు పులమొద్దు, ఇక్కడ క్రియేటివిటి, కంటెంట్ మాత్రమే ముఖ్యం' అని మనోజ్ స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X