Manchu Vishnu: పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటనపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్
Manchu Vishnu: కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మంచు విష్ణు. ప్రస్తుతం ఆయన 'మా' అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. అలాగే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో (Kannappa)తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా Filmibeat Telugu కు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తి పరమైన పలు ఆసక్తికర విషయాలను చర్చించారు.
ఇటీవల ఇండస్ట్రీలో నెపోటిజం గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై హీరో మంచు విష్ణు తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. గత కొన్ని సంవత్సరాలుగా 'నెపోటిజం' అనే పదం వినిపిస్తుందని, ఈ విషయంపై తాను కూడా పలుమార్లు క్లారిటీ ఇచ్చానన్నారు. ఇండస్ట్రీలో 'నెపోటిజం' అనేది వర్కౌట్ కాదని, దాని వల్ల అవకాశాలు వస్తాయనడంలో వాస్తవం లేదన్నారు. కొత్తగా వచ్చే నటుల తండ్రి లేదా తల్లి హీరోనో.. హీరోయిన్ నో..లేదా ప్రొడ్యూసర్ అయితే.. ఫస్ట్ మూవీ ఆఫర్ సులభంగా రావచ్చు.

ఇండస్ట్రీలో అడుగుపెట్టినంత మాత్రాన ప్రేక్షకులు ఆదరిస్తారా.. లేదా.. అనేది ఆ నటుడి టాలెంట్ పై ఆధారపడి ఉంటుందన్నారు. 'నేను ఎంత పెద్ద హీరో కొడుకునైనా.. ప్రేక్షకులను మెప్పించే టాలెంట్ నా దగ్గర లేకపోతే నా సినిమాలను ఎవరు చూస్తారు. నా సినిమాల కోసం థియేటర్లకి ఎందుకు వస్తారు అంటూ హీరో ప్రశ్నించారు. ఇటీవల నెపోటిజం పై పలు కథనాలు కూడా చదివాననీ, ఏదిఏమైనా ఇండస్ట్రీలో ఉండాలంటే.. ఖచ్చితంగా టాలెంట్ ఉండాలని అన్నారు హీరో మంచు విష్ణు.
అలాగే నేడు తెలుగు సినిమా స్థాయి పెరిగిందని, సౌత్.. నార్త్.. అనే తేడా లేకుండా ఇండియన్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, హార్ట్ టచ్చింగ్ గా ఉండే కంటెంట్ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూస్తారన్నారు. అందుకు యూత్ చాలా మంది కొరియన్ సినిమాలు ఉన్నారు. ఆ భాష తెలియకపోయినా.. ఆ ఫీలింగ్స్ .. ఆ సబ్ టైటిల్స్ చూస్తూ ఆ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ రోజులలో సౌత్ నార్త్ అని తేడాలు లేవని, బాలీవుడ్, టాలీవుడ్ అనే బారియర్స్ లేవన్నారు. తెలుగు నటులు ఇతర భాషలలో నటిస్తున్నారని, అలాగే ఇతర భాషల కు చెందిన నటులు మన సినిమాలలో నటిస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటనపై హీరో మంచు విష్ణు స్పందించారు. ఇలాంటి ఘటనలు విచారకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సెలబ్రిటీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వాస్తవానికి ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. బన్నీ అరెస్ట్ కావడం, బెయిల్ మీద రావడం వంటి పరిణామాలతో కేవలం బన్నీ ఫ్యామిలీ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం ఎఫెక్ట్ అయ్యిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ఘటన భవిష్యత్తులో మరేదో హీరో కైనా జరగవచ్చు. ఇలాంటి పరిణామాలతో నటులు సినిమా ధియేటర్లోకీ వెళ్లి సినిమాలు చూసే అవకాశం ఉండకపోవచ్చు అన్నారు.
'ఏ హీరో కైనా తన అభిమానుల మధ్యలో కూర్చోని.. తాను నటించిన సినిమా చూడాలని కోరిక ఉంటుంది. తాను సిల్వర్ స్క్రీన్ పై కనిపించినప్పుడు ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారనేది డైరెక్టుగా చూడాలని కోరిక ఉంటుంది. ఆ సమయంలో కలిగే సంతోషం మరే విషయంలో రాదనీ, ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు సెలబ్రిటీలు కూడా కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
అలాగే పుష్ప సినిమా కంటెంట్ స్టోరీపై వస్తున్న కామెంట్స్ పై స్పందిస్తూ..సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. దాన్ని ఎంటర్టైన్మెంట్ గాని చూడాలి. ఏ విషయమైనా దూరం నుండి చూస్తే అంతా బాగానే ఉంటుంది. కానీ ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసినప్పుడే లోపాలు కనిపిస్తాయి. ఈమధ్య కాలంలో సెలబ్రిటీలపై విమర్శకల కంటే.. వ్యక్తిగత దాడులు తీవ్రమయ్యాయి. లైమ్ లైట్లు ఉన్నవారిని పర్సనల్ అటాక్ చేయడం ప్యాషన్ గా మారిందంటూ మరో షాకింగ్ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











