ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరిక.. పాయల్ రాజ్‌పుత్ షాకింగ్ కామెంట్స్

RX 100 మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నారు. తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. రంగం ఫేమ్ అజ్మల్ అమీర్, నందిత శ్వేత, శ్రవణ్ రెడ్డి తదితరులు నటించారు. అజయ్ భూపతి సొంత బ్యానర్ ఏ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఎం సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ..

అజయ్ భూపతి వెంటపడ్డా
RX100 సినిమా ద్వారా నన్ను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. నా టాలెంట్, నా ఫెర్ఫార్మెన్స్ గురించి ఆయనకు నా కంటే బాగా తెలుసు. RX100 సినిమా తర్వాత నా కెరీర్ అంతగా పుంజుకోలేదు. అందుకే నాకు మరో అవకాశం ఇవ్వమని మళ్లీ ఆయన వెంటపడ్డాను. దాంతో జనవరిలో అజయ్ భూపతి సార్ నాకు కాల్ చేసి కథ చెప్పారు. దాంతో మంగళవారం రూపంలో ఓ మ్యాజిక్ జరగడానికి కారణమైంది అని పాయల్ రాజ్‌పుత్ తెలిపింది. ‎

 Mangalavaaram Heroine Payal Rajput revealed Her Crush on Kareena Kapoor Khan

నా కెరీర్ మలుపు తిప్పే సినిమా
టాలీవుడ్‌కు పరిచయమై 5 ఏళ్లు పూర్తయ్యాయి. కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాపులు వచ్చాయి. కానీ మంళవారం నాకు మంచి బ్రేక్, నా కెరీర్‌ను మలుపుతిప్పే సినిమా అవుతుంది. ఓ డిఫరెంట్ పాయింట్‌తో సినిమా చేశాం. అందరికి నచ్చుతుందని బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమాలో నాది నెగిటివ్ పాత్ర కాదు. ఎవరూ ఊహించని పాత్రతో కథ సాగుతుంది అని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది.

 Mangalavaaram Heroine Payal Rajput revealed Her Crush on Kareena Kapoor Khan

అజయ్ భూపతి కథ చెప్పగానే
అజయ్ భూపతి కథ చెప్పగానే.. ఇది నిజ జీవితంలోని పాత్రనా అని అడిగాను. ఇప్పటి వరకు అనుకోకుండా అతిథి అనే సినిమా డార్క్ ఎమోషన్స్ సినిమా చేశాను. మంగళవారం అంతకుమించిన సినిమా. ఈ కథ వినగానే మా అమ్మకు కాల్ చేసి అజయ్ భూపతితో సినిమా చేస్తున్నానని చెప్పాను. దాంతో మా అమ్మకు కూడా మంచి సినిమా చేయబోతున్నామనే అభిప్రాయం కలిగింది అని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది

 Mangalavaaram Heroine Payal Rajput revealed Her Crush on Kareena Kapoor Khan

బోల్డ్ అనేది మనం చూసే కోణంతో
మంగళవారం సినిమాలో బోల్డుగా కనిపించానా అంటే.. బోల్డు అనేది మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఈ సినిమాలో వెనుక భాగం చూపించాలని, అలాగే గోళెంలో న్యూడ్‌గా కనిపించే సీన్లు చేయాలని చెప్పగానే.. ఈ సినిమా డిఫరెంట్ అనిపించడమే కాకుండా ఛాలెంజింగ్‌గా అనిపించింది. మీరు సినిమా చూస్తే బోల్డ్‌గా ఉందా? లేదా అనేది మీరే చెబుతారు. ఇప్పటి వరకు 15 సినిమాలు చేశాను. కానీ ఇంత కష్టపడి చేసిన సినిమా ఇప్పటి వరకు లేదు. యాక్షన్ చెప్పగానే పాత్రలో లీనమై పోతాను.. కట్ చెప్పగానే బయటకు వస్తాను. అంతే గానీ నేను ఏం చేస్తున్నాననే విషయాన్ని మనసులో పెట్టుకొను అని పాయల్ చెప్పింది.

నాకు ఈ సినిమా గేమ్ ఛేంజర్
మంగళవారం సినిమా నిజంగా నా జీవితాన్ని మార్చే గేమ్ ఛేంజర్ సినిమా. టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత నాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ బట్టి చూస్తే నిజంగా గేమ్ ఛేంజర్ సినిమానే అవుతుంది. ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకొన్నాను. సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని పాయల్ చెప్పింది.

 Mangalavaaram Heroine Payal Rajput revealed Her Crush on Kareena Kapoor Khan

కరీనా కపూర్‌ అంటే..
నాకు ఇష్టమైన హీరోయిన్ కరీనా కపూర్. ఆమె అంటే నాకు ఓ రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఆమెతో సెల్ఫీ దిగడానికి నేను ఎంతగానో కష్టపడ్డాను. కరీనా అంటే ఇంత ఇష్టమంటే.. ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా కలిగేంత అని పాయల్ రాజ్‌పుత్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X