అల్లు అర్జున్, రాంచరణ్ నాకు క్లోజ్ ఫ్రెండ్స్.. బన్నీకి మంగళవారం కథ నచ్చడంతో.. నిర్మాతలు స్వాతి, సురేష్

ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతిరెడ్డి గునుపాటి నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం మంగళవారం. RX100 డైరెక్టర్ అజయ్ భూపతికి చెందిన ఏ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై సురేష్ వర్మతో కలిసి చిత్రాన్ని నిర్మించారు. పాయల్ రాజ్‌ పుత్, రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి నటించారు. నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు స్వాతి, సురేష్ వర్మ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

నేను పదేళ్లకుపైగా ఎంటర్‌‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. అయితే సురేష్ వర్మ వద్ద నేను పనిచేస్తున్నప్పుడు మేమిద్దరం కలిసి సినిమా చేయాలని అనుకొన్నాం. అలా మా ట్రావెల్‌లో మమ్మల్ని మంగళవారం సినిమా చాలా ఎక్సైట్ చేసింది. అజయ్ భూపతి కూడా ప్రొడ్యూస్ చేస్తానని చెప్ పడంతో మీమిద్దరం కలిసి ఈ ప్రాజెక్టులో భాగమయ్యాం అని స్వాతి, సురేష్ చెప్పారు.

Mangalavaaram Producer Swathi Gunupati, Suresh Varma says Allu Arjun made us more Confident

నాకు రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల నా స్నేహితులు. అయినా నేను అడిగితే వారు సినిమాలు చేయడానికి నో అనరు. కానీ నిర్మాతగా నేను నా ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని ఒత్తిడికి గురి కావొద్దని అనుకొన్నాను. అందుకే చిన్న సినిమాతో నిర్మాతగా నా ప్రయాణాన్ని కొనసాగించాలని, టీమ్ వర్క్‌గా పనిచేయాలని అనుకొన్నాం అని స్వాతి చెప్పారు.

మంగళవారం సినిమా మొదలైనప్పటి నుంచి అంతా మంచే జరిగింది. చిరంజీవి గారు మా ట్రైలర్‌ను రిలీజ్ చేసి మాకు పెద్ద బజ్ క్రియేట్ చేశారు. నా గురించి ఆయన మంచిగా చెప్పడంతో నేను నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు అని తెలిసింది. చిరంజీవి గారు చేసిన మేలును ఎన్నటికీ మరిచిపోలేను. పెళ్లి తర్వాత నా భర్త ఇంటి పేరు పెట్టుకొన్నాను. దాని వల్ల నన్ను ఎవరో అనుకొని గుర్తు పెట్టుకోలేదు. చిరంజీవి ట్వీట్ వల్లే నేనెవరో తెలిసింది. అందుకు థ్యాంక్స్ అని స్వాతి చెప్పారు. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఆయనను చూస్తే చాలూ అనుకొనే వాడిని. అలాంటిది మా సినిమా ట్రైలర్‌ను ఆయన షేర్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది అని సురేష్ వర్మ చెప్పారు.

Mangalavaaram Producer Swathi Gunupati, Suresh Varma says Allu Arjun made us more Confident

అల్జు అర్జున్‌కు అజయ్ భూపతి కథ చెప్పారు. అప్పుడు బన్నీకి బాగా నచ్చిందని చెప్పడంతో మాకు ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్ కలిగింది. ఈ సినిమా నిర్మించాలనే ధైర్యం కూడా కలిగింది. అల్లు అర్జున్ అందించిన ప్రోత్సాహం వల్లే ఈ సినిమాను సురేష్ వర్మ, నేను కలిసి చేశాం అని స్వాతి చెప్పారు.

Mangalavaaram Producer Swathi Gunupati, Suresh Varma says Allu Arjun made us more Confident

అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి వారు నాకు మంచి ఫ్రెండ్స్. వారితో సినిమాలు నిర్మించాలనే ప్లాన్ ప్రస్తుతం లేదు. వారు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. స్నేహాన్ని, వ్యాపారాన్ని ముడిపెట్టను. వాళ్లు నాకు మంచి ఫ్రెండ్స్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు సపోర్టు ఇస్తారు. నన్ను నేను ప్రూవ్ చేసుకొన్న తర్వాత.. నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్లను అడుగుతాను. ఇప్పుడు అడిగినా నా కోసం వారు చేస్తారు. అలాగని నేను అడగలేను అని స్వాతి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X