twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pooja Bhalekhar గ్లామర్ పాత్రలో అలా ఒదిగిపోయా.. ఆ విషయం వర్మ చెప్పలేదు, అందుకే..!

    |

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో పూణేకు చెందిన పూజా భలేకర్ హీరోయిన్‌గా నటించిన లడ్కీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.ఈ సినిమాను తెలుగులో అమ్మాయి టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 60 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా పూజా భలేకర్ మీడియాతో మాట్లాడుతూ..

    చైనా నుంచి మంచి స్పందన

    చైనా నుంచి మంచి స్పందన


    మార్షల్ ఆర్ట్స్‌లో ప్రధానంగా తైక్వాండోలో యువతులకు స్పూర్తిగా నేను నిలువాలని కోరుకొన్నాను. ఊహించని విధంగా నాకు సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా ప్రారంభించే ముందు చాలా ట్రయల్ షూట్స్ చేశాం. వాటిని కొందరికి చూపించడంతో చైనాకు సంబంధించిన డిస్టిబ్యూటర్లు, నిర్మాతలు ఈ సినిమాను రూపొందించేందుకు ముందుకొచ్చారు. దాంతో ఈ సినిమాకు ఇంటర్నేషనల్ అప్పీల్ వచ్చింది. ప్రస్తుతం పలు భాషల్లో రిలీజ్ అవుతున్నది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు చోటుచేసుకొన్నాయి అని పూజా భలేకర్ తెలిపింది.

    మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వెనుక

    మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వెనుక


    నా చిన్నతనంలో నేను స్పోర్ట్స్‌లో రాణించాలని అనుకొన్నాను. ఆ తర్వాత పరుగు పందాలవైపు దృష్టిపెట్టాను. అలాంటి సమయంలో కొందరు చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చూశాను. అప్పుడు నేను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని తల్లిదండ్రులకు చెప్పాను. వారు సరే అనడంతో నేను మార్షల్ నేర్చుకొన్నాను. ఆ తర్వాత మెడల్, గుర్తింపు రావడంతో నేను మరింత ముందుకు పోయాను. మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని పూజా భలేకర్ చెప్పింది.

    గ్లామర్ పాత్రలోకి అలా ఒదిగాపోయా..

    గ్లామర్ పాత్రలోకి అలా ఒదిగాపోయా..


    రాంగోపాల్ వర్మను కలిసినప్పుడు నేను టామ్ బాయ్‌లా ఉండేదానిని. అయితే ఈ సినిమాలో నా క్యారెక్టర్ గ్లామర్‌ను పండించాలనే విషయాన్ని చెప్పలేదు. కాకపోతే పాత్రను అర్దం చేసుకొన్న తర్వాత నేను రోల్‌కు అవసరమని గ్రహించాను. నా యాక్షన్ స్కిల్స్‌తోపాటు గ్లామర్, యాక్టింగ్‌ బ్యాలెన్స్ చేసి తెరపైన అందంగా ఆకట్టుకొనేందుకు ప్రయత్నించాను అని పూజా భలేకర్ తెలిపింది.

     సినిమాల్లో నటించే విషయంలో స్వేచ్ఛగా

    సినిమాల్లో నటించే విషయంలో స్వేచ్ఛగా


    సినిమాల్లోకి వస్తున్న సమయంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. నీకు ఏది మంచిగా అనిపిస్తే అది చేయమని మొదటి నుంచి చెప్పేవాళ్లు. నేను ఎప్పుడూ ఇంట్లో ఉండేదానిని కాదు. మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్స్ కోసం దేశం మొత్తం తిరిగే దానిని. నెలలకొద్ది ఇంటికి రాకుండా ఉండేదానిని. ఇంట్లో నాకు స్వేచ్ఛ ఇచ్చేవాళ్లు. సినిమాల్లోకి వెళ్తానంటే అభ్యంతరం రాలేదు అని పూజా భలేకర్ తెలిపింది.

     రాంగోపాల్ వర్మ సినిమాలంటే...

    రాంగోపాల్ వర్మ సినిమాలంటే...


    లడ్కీ సినిమాకు ముందు నేను వర్మ తీసిన రంగీలా, సత్య, సర్కార్ సినిమాలు చూశాను. ఇక ముందు కూడా మార్షల్ ఆర్ట్స్ కొనసాగిస్తాను. మంచి పాత్రలు, మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా కథలు, పాత్రలు వస్తే నేను నటించడానికి రెడీగా ఉంటాను. లడ్కీ సినిమా రిలీజ్ తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అవి నా అంచనాలకు దిగువన ఉన్నాయి. అందుచేత నేను ఒప్పుకోలేదు. ఇక ముందు మంచి పాత్రలు వస్తే నేను నటించడానికి సిద్దంగా ఉంటాను అని పూజా భలేకర్ వెల్లడించింది

    English summary
    Martial Art Champion turns Actor Pooja Bhalekar's Ladki movie is release on July 15th. Here is the Interview of Pooja Bhalekar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X