Martin Luther King ఆ పాత్ర కోసమే సంపూ పుట్టాడేమో.. రాజకీయాల్లో మార్పు కోసమే మార్టిన్ లూథర్ కింగ్!

తమిళంలో సంచలన విజయం సాధించడమే కాకుండా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్న చిత్రం మండేలా. మండేలా చిత్రంలో యోగిబాబు నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. అలాంటి సినిమాను రీమేక్ చేస్తూ వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King). ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు టైటిల్ రోల్ పోషిస్తుండగా.. వీకే నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు దర్శకుడు వెంకటేష్ మహా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడమే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా మారడం విశేషంగా మారింది. ఈ సినిమా ద్వారా పూజా కొల్లూరు దర్శకురాలిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అక్టోబర్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

Martin Luther King Director Pooja Kollur Interview: Sampoo Born for the Character

నా మొదటి సినిమాను రీమేక్‌గా ఎంచుకోవడానికి కారణం ఈ కథను చెప్పాల్సిన అవసరం ఉంది. అరుదుగా వచ్చే ఇలాంటి కథ ద్వారా ప్రజలను చైతన్య చేయాలి. నేను ఎన్నో కథలు రాసుకొన్నాను. కానీ నిర్మాతలకు చెబితే.. ఈ కథలు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి. ఐదేళ్ల తర్వాత చెప్పాలని చెబుతూ దాటవేస్తూ వచ్చారు. కొందరైతే రొమాంటిక్ కామెడీ కథలున్నాయా? ఫ్యామిలీ డ్రామాలు ఉన్నాయా? అని ఆరా తీశారు. అయితే మండేలాను రీమేక్ చేయడమేనేది ఇప్పటి పరిస్థితుల్లో చాలా అవసరం అని పూజా కొల్లూరు అన్నారు.

నేను డైరెక్టర్‌ కావాలనే కోరికతో ప్రయత్నిస్తుండగా వెంకటేష్ మహాతో పరిచయం జరిగింది. కేరాఫ్ కంచెరపాలెం సినిమా లాంటి గొప్ప సినిమా తీసిన అతను పడుతున్న కష్టం చూసి.. నేను కూడా అంతకంటే కష్టపడాలని అనుకొన్నాను. ఆయనతో కలిసి పనిచేస్తున్న క్రమంలో వైనాట్ స్టూడియోలో వారు మండేలా రీమేక్ ప్రపోజల్‌ను వెంకటేష్ మహా ముందు పెడితే.. ఆయన రీమేక్ చేయనని చెప్పారు. అయితే ఆ సమయంలో నేను రీమేక్ చేస్తానని చెప్పడంతో ఆయన వారితో మాట్లాడారు. మీకు ఫీమేల్ డైరెక్టర్ ఒకేనా అని అంటే.. మా బ్యానర్‌లో సుధా కొంగర, పుష్కర్ గాయత్రి లాంటి డైరెక్టర్లను పరిచయం చేసింది మేమే. మాకు జెండర్ విషయంలో ఎలాంటి పట్టింపులు లేవని అనడంతో నేను డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యాను అని పూజా కొల్లూరు చెప్పారు.

Martin Luther King Director Pooja Kollur Interview: Sampoo Born for the Character

మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో ప్రధాన పాత్ర కోసం సంపూర్ణేష్ బాబును తీసుకోవాలన్నది వెంకటేష్ మహా నిర్ణయం. కచ్చితంగా సంపూ మాత్రమే చేయగల పాత్ర. ఆయన కోసమే ఈ పాత్ర పుట్టినట్టు ఉంటుంది. ఆయన గతంలో నటించిన సినిమాలు వేరు. ఈ సినిమాలో సంపూ డిఫరెంట్‌గా కనిపిస్తారు. ఒక కామన్ మ్యాన్ పాత్ర అది. సంపూర్ణేష్ బాబు కాకముందు నరసింహాచారిగా ఎలా ఉన్నారో అలాంటి పాత్ర అని పూజా కొల్లూరు అన్నారు.

మండేలా సినిమాకు రీమేక్ కావడంతో పోలీకలు వస్తాయని తెలుసు. అందుకే నేను ఆ సినిమా చూడలేదు. ఆ సినిమా చూసి తీయలేదు. మహా రాసిన స్క్రిప్టును చూసి సినిమా తీశాను. ఒరిజినల్ సినిమాకు మా సినిమాకు పోలీకే ఉండదు. కేవలం మెయిన్ స్టోరి తీసుకొని తెలుగు నేటివిటికి దగ్గరగా ఉంటుంది. ప్రతీ విషయంలోను చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం అని పూజా కొల్లూరు చెప్పారు.

Martin Luther King Director Pooja Kollur Interview: Sampoo Born for the Character

మార్టిన్ లూథర్ కింగ్ సినిమాకు దర్శకుడు వెంకటేష్ మహా చాలా రకాలుగా తన చొరవను చూపించారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ఓ నటుడికి కోసం ప్రయత్నించాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయడానికి వీలు కాలేదు. ఆ సమయంలో ఆ క్యారెక్టర్‌ను మహా చేస్తే బాగుంటుందని అనుకొన్నాడు. ఆయన అద్బుతంగా నటించాడు. ఆయనలో అద్బుతమైన నటుడు కూడా ఉన్నాడు అని ఆమె తెలిపారు.

మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఓటు విలువ చెప్పే మూవీ. పౌర హక్కుల కోసం పోరాటం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ పేరును ఈ సినిమాకు పెట్టాం. టీమ్ మొత్తం ఈ టైటిల్‌కు ఓటు వేసింది. ఓటరు కింగ్ అని చెప్పాలనే ప్రయత్నం. సామాజికంగా ఎన్నికల సమయంలో ఓటరులో మార్పు తీసుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాం అని పూజా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X