అందుకే ఫెయిల్యూర్స్... సక్సెస్‌తో చుట్టూ మందలా జనం.. సాయి ధరమ్ తేజ్
వరుస అపజయాల బారిన పడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో ఆయనకు అందాల తారలు కల్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ జంటగా నటించారు. ఈ చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమలశెట్టి కూడా సక్సెస్ కోసం వెంపర్లాడుతున్నారు. ఇలా అందరూ సక్సెస్ కోసం ఎదురుచూస్తూ చిత్రలహరిపై ఆశలు పెంచుకొన్నారు. ఈ సందర్బంగా ఫెయిల్యూర్స్ వెంటాడిన సందర్భంగా ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే విషయాన్ని సాయిధరమ్ తేజ్ పంచుకొన్నారు. ఆయన ఏమన్నారంటే

సక్సెస్ ఉంటే చుట్టు మందలా జనం
సక్సెస్ ఉన్నప్పుడు చుట్టూ గుంపు గుంపుగా, మంద ఉంటారు. ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు ఒక్కరో ఇద్దరో మాత్రమే కనిపిస్తారు. అపజయాలతో సంబంధం లేకుండా ఆ ఇద్దరు ముగ్గురు ఎప్పుడూ ఉంటారు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌కు సంబంధం లేకుండా హ్యాపీగా ఉంటాను. డబ్బు ఉన్నా లేకపోయినా సంతోషంగా గడపడమే నాకు అత్యంత ఇష్టం అని సాయి ధరమ్ తేజ్ అన్నారు.

మెగా హీరో కావడంతోనే
మెగా హీరో కావడం వల్లే ఆరు ఫెయిల్యూర్ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయంటే ఒప్పుకోను. మెగా హీరో అని అనుకొంటే ఒకటో, రెండో అవకాశాలు ఇచ్చి చూస్తారు. కానీ ఇన్ని అవకాశాలు ఇవ్వరు. నాలో ప్రతిభ ఉంది కాబట్టే సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు ఇచ్చారని నమ్ముతాను.

ఫెయిల్యూర్స్ కారణం నేనే
నా సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత నాతో పనిచేసిన వాళ్లు నా వల్లనే తప్పు అంటే నేను ఒప్పుకొను. నేను ఒప్పుకొంటేనే ఆ సినిమా ముందుకెళ్తుంది. ఏ సినిమా ఫెయిల్ కారణం నేను అని ఒప్పుకొంటాను. క్రికెట్ జట్టులో కెప్టెన్ బాధ్యత ఎలా ఉంటుందో నేను కూడా అలానే ఫీలువుతాను అని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు.

విజయం సమిష్టి బాధ్యతనే
సినిమా అనేది టీమ్ వర్క్. విజయంలో సమిష్టి బాధ్యత ఉంటుంది. ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే దాని బాధ్యత తీసుకొంటాను. నేను ఒప్పుకోకపోతే ఆ సినిమా తెరపైకి రాదు. దానిని నేను నమ్మితే అదీ సినిమాగా వచ్చిందనే నిజం. అందుకే నేను బాధ్యత వహిస్తాను అని సాయి అన్నారు.

మాటిస్తే నిలబడుతాను
నేను ఒక్కసారి మాట ఇస్తే వెనుకకు పోను. మాట ఇస్తే తిరిగి తీసుకొను. అందుకే మాట ఇచ్చినందుకే కొన్ని సినిమాలు నచ్చకపోయినా చేశాను. ఆ సమయంలో నాకు ఛాయిస్ లేకపోయింది. కేవలం కమిట్‌మెంట్‌కు కట్టుబడి ఉండటం వల్ల నాకు ఈ పరిస్థితి ఎదురైందని నమ్ముతాను అని సాయి ధరమ్ తేజ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











