»   » పవన్ పాలిటిక్స్‌పై వరుణ్ తేజ్ కామెంట్.. ఆ విషయంలో బాధకరమే..

పవన్ పాలిటిక్స్‌పై వరుణ్ తేజ్ కామెంట్.. ఆ విషయంలో బాధకరమే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan To Quit Movies? : Varun Tej Comments

ఫిదా గ్రాండ్ సక్సెస్ తర్వాత తొలిప్రేమ చిత్రంతో మరో భారీ హిట్‌ను సొంతం చేసుకొన్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వరుణ్ తేజ్ ఇటీవల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశంపై వరుణ్ తేజ్ స్పందించారు. పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమను వదిలి రాజకీయాల్లోకి వెళ్లడం సబబే అని ఆయన అన్నారు. వరుణ్ తేజ్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

 థియేటర్లలో విజిల్స్ వేసే..

థియేటర్లలో విజిల్స్ వేసే..

బాబాయ్ పవన్ కల్యాణ్ సినిమాలు చేసి పెరిగాం. ఆయన నటించిన చిత్రాలు మొదటి రోజు ఫస్ట్ షో చూడటం అంటే మాకు చాలా ఇష్టం. పవన్ కల్యాణ్ సినిమా చూసి థియేటర్లలో విజిల్స్ వేసి ఎంజాయ్ చేసే వాళ్లం.

 పేదవారికి మంచి జరుగాలి

పేదవారికి మంచి జరుగాలి

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం మంచిదే. పేదవారికి మేలు చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఆయన అనుకొన్నది సాధించడానికి మేమంత సహకారం అందిస్తాం.

 పవన్ కల్యాణ్ రాకకు స్వాగతం

పవన్ కల్యాణ్ రాకకు స్వాగతం

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం ద్వారా ఎంతో మందికి న్యాయం చేకూరుతుందనే నమ్మకం ఉంది. బడుగు వర్గాలు ఆయన రాకను స్వాగతిస్తున్నాయి. ప్రజలకు మంచి చేయడం కోసం తన కెరీర్ వదులుకోవడం పవన్ కల్యాణ్ నిజాయితీ సాక్ష్యం.

సినీ పరిశ్రమకు దూరం కావడం

సినీ పరిశ్రమకు దూరం కావడం

పవన్ కల్యాణ్ సినిమాలను ఇష్టపడే వ్యక్తిగా ఆయన సినిమాలు లేకపోవడం అనేది బాధకరమే. అభిమానులకు కూడా నిరాశే. సినిమా పరిశ్రమకు దూరం కావడం అనేది పవన్ కల్యాణ్ వ్యక్తిగత నిర్ణయం. ఆ విషయంలో మేము జోక్యం చేసుకోలేం. ఆయనకు మంచి జరుగాలని కోరుకొంటున్నాను అని వరుణ్ తేజ్ అన్నారు.

English summary
South superstar Varun Tej and actress Raashi Khanna's latest outing 'Tholi Prema released on February 9, 2018 in overseas. The romantic comedy has received a positive response from fans on Twitter. This film is getting ready to release in telugu on Feb 10th. Before release Varun Tej had spoke to Telugu filmibeat exclusively.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu