For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహానటిపై మెగాస్టార్‌కు సందేహాలు.. నాగ అశ్విన్‌ను ఇంటర్వ్యూ చేసిన చిరంజీవి

  By Rajababu
  |
  'మహానటి' చిత్రం చూసిన చిరంజీవి ఏమన్నడో తెలుసా???

  తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగార్జున అక్కినేని, ఎన్టీఆర్, ఇతర సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. శుక్రవారం (మే 11) ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.

  వెంటనే అద్బుతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు నాగ అశ్విన్, నిర్మాతలు అశ్వినీదత్, ప్రియాంక, స్వప్న దత్‌లను తన నివాసంలో ప్రత్యేకంగా అభినందించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో కొన్ని సందేహాలను నాగ అశ్విన్‌ను చిరంజీవిని అడిగి తెలుసుకొన్నారు.

  సావిత్రి బయోపిక్

  సావిత్రి బయోపిక్

  చిరంజీవి: మహానటి సావిత్రి బయోపిక్ చేయడానికి ఏ మేరకు రీసెర్చ్ ఎలా చేశారు?

  నాగ అశ్విన్: ఆలోచన వచ్చినప్పటి నుంచి సావిత్రి బయోపిక్‌ను చాలా నిజాయితీగా తీయాలని అనుకొన్నాను. జీవితంలో ఒకేసారి తీయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి చిత్రానికి నేను దర్శకుడిని కావడం గర్వంగా ఉంది.

  బయోపిక్స్ రాలేదు

  బయోపిక్స్ రాలేదు

  చిరంజీవి: తెలుగులో బయోపిక్స్ రాలేదు. మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది?

  నాగ అశ్విన్: బయోపిక్ అని ముందుగా ఆలోచించలేదు. కానీ ఎప్పటి నుంచో సావిత్రిగారి మీద సినిమా తీయాలని ఉండేది. అస్టిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి ఐడియా ఉంది. నా చిన్నతనం నుంచి ఆమె చిత్రాలు, పాటలు వింటూ పెరిగాను. మహానటి అని పేరున్న ఆమె కేవీరెడ్డి, ఎల్వీ ప్రసాద్‌ లాంటి దిగ్గజ దర్శకులతో, ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ లాంటి ప్రముఖ నటులతో పనిచేశారు. అలాంటి వ్యక్తిపై సినిమా తీస్తే చారిత్రాత్మక చిత్రాలకు మరోసారి గుర్తుచేసినట్టు అవుతుందని అనుకొన్నాను. కథ రాయడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో విషయాలు తెలిసాయి. అలాంటి చిత్రాలను, మహానటిని, దిగ్గజ దర్శకులు, నటులను కొత్త తరం మరిచిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేశాను.

  ఎలా ప్రారంభమైంది

  ఎలా ప్రారంభమైంది

  చిరంజీవి: మహానటి చిత్రం ఎలా ప్రారంభమైంది?

  నాగ అశ్విన్: మహోన్నత నటి సావిత్రి జీవితంపై సినిమా తీయాలనే నిర్ణయం తీసుకొన్నప్పుడు మొదట ఆమె కూతురు విజయ చాముండేశ్వరిని కలుసుకొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సావిత్రి ఆశీస్సులు లేకపోతే ఈ చిత్రం పూర్తికాదు. ఆమె దీవెనలు కారణంగా ఈ సినిమా ఎలాంటి అడ్డుంకులు లేకుండా పూర్తయిందని ప్రగాఢంగా నమ్ముతాను.

  చాముండేశ్వరి

  చాముండేశ్వరి

  చిరంజీవి: జీవిత చరమాంకంలో సావిత్రి వ్యసనాలకు లోనయ్యారు? అలాంటి సంఘటనలను సినిమాలో చూపడంపై చాముండేశ్వరి అభ్యంతరం చెప్పలేదా?

  నాగ అశ్విన్: సావిత్రి జీవితంలోని కొన్ని సంఘటనలను చెప్పడానికి విజయ చాముండేశ్వరి అభ్యంతరం చెప్పలేదు. ఆమె జీవితంలోని కొన్ని సంఘటనలు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. బయోపిక్‌లో ఆమె వ్యసనాలు ప్రధానం కాదు. ఎన్నో ఏళ్లుగా మీడియాలో సావిత్రిగారిపై సానుభూతి వ్యక్తమయ్యే విధంగానే కథనాలు వచ్చాయి. విపరీతంగా తాగడం వల్లనే ఆమె జీవితం పతనమైంది. ఆ నేపథ్యంలోనే సావిత్రి జీవితాన్ని ఓ సెలబ్రేషన్‌గా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాం. ఆ విధంగానే చాముండేశ్వరిని ఒప్పించాం.

  ఎలాంటి సంతృప్తి లభించింది

  ఎలాంటి సంతృప్తి లభించింది

  చిరంజీవి: మహానటి విజయం ఎలాంటి సంతృప్తి లభించింది?

  నాగ అశ్విన్: సావిత్రి జీవితాన్ని విషాద కథగా చెప్పదలచుకోలేదు. ఆమె జీవితం ద్వారా అందరికీ స్ఫూర్తి కలిగించాలన్న ఉద్దేశంతో పనిచేశాం. మా ఉద్దేశాన్ని ప్రేక్షకులు నిజాయితాగా ఆదరించారు. అందుకే మంచి విజయాన్ని అందించారు. మంచి చిత్రాన్ని తీశామనే సంతృప్తి లభించింది అని నాగ అశ్విన్ తెలిపారు.

  English summary
  Savithri biopic Mahanati Teaser released. Actress Keerthy suresh is steps into Savithri's role. Samantha prabhu, Vijay Deverakonda, Director Krish are played key roles in this movie. This movie is slated to release on May 9th. This movie is minting good numbers all over the world. In this occassion, Mega Star Chiranjeevi falicitated film Unit along with Ashwini Dutt, Priyanka dutt, Swapna Dutt.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X