twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్నకోరిక తీరింది, ఆయన బతికి ఉన్నప్పుడు.. స్వర్గీయ శ్రీహరిని తలుచుకొని హీరో మేఘాంశ్ ఎమోషనల్

    |

    ప్రముఖ నటుడు, స్వర్గీయ శ్రీహరి, ప్రముఖ నటి శ్రీహరి శాంతి చిన్నకొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం రాజ్ దూత్. అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు దర్శకుల సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సత్తిబాబు నిర్మిస్తున్నారు. మేఘాంశ్ సరసన నక్షత్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ మీడియాతో మాట్లాడుతూ..

     నాన్న కోరిక అలా తీరింది

    నాన్న కోరిక అలా తీరింది

    హీరోగా రాజ్‌దూత్ నా మొదటి సినిమా, ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మండుటెండల్లో షూటింగ్ చేశాం. కేవలం ఒత్తిడి తగ్గించడానికే సినిమా షూటింగ్ ఎలాంటి ప్రచారం లేకుండా రహస్యంగా చిత్రీకరించడం జరిగింది. చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబంలో పుట్టి పెరిగినవాడిగా, సినిమాపై మక్కువ ఉంది. అలాగే నాన్న కూడా ఓ సందర్భంలో చిన్నవాడిని యాక్టర్ని,పెద్దవాడిని డైరెక్టర్‌ను చేస్తానని అన్నారు. దానితో ఆయన కోరిక మేరకు కూడా హీరో అయ్యాను అని హీరో మేఘాంశ్ తెలిపారు.

     అమ్మ చాలా హ్యాపీగా ఫీలైంది

    అమ్మ చాలా హ్యాపీగా ఫీలైంది

    నన్ను హీరోగా చూసి అమ్మ (శాంతి శ్రీహరి) చాలా సంతోషించారు, అలాగే సినిమా ఎలా వస్తుందో అని కొంచెం కంగారు కూడా పడ్డారు. అయితే నేను సినిమాను అమ్మకు చూపించాను. ఆమెకు చాలా బాగా నచ్చింది. నాలో నాన్న చూసుకొన్నారు. ఆయన నటనలో ప్రతి కోణం నాకు నచ్చుతుంది, ఎమోషనల్ అయినా, ఉద్రేక పూరిత సన్నివేశాలలోనైనా ఆయన నటన చాలా బాగుంటుంది. నాన్న నటించిన భద్రాచలం, ఢీ, నువ్వులేక నేను లేను సినిమాలంటే చాలా ఇష్టం అని హీరో మేఘాంశ్ పేర్కొన్నారు.

     థ్రిల్లర్ మూవీ కాదు కానే కాదు

    థ్రిల్లర్ మూవీ కాదు కానే కాదు

    రాజ్ దూత్ టైటిల్ గురించి చాలా మంది అడుగుతున్న ప్రశ్నఇది. ఈ మూవీలో హీరో తనకిష్టమైన రాజ్ దూత్ బైక్ కోసం, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై అన్వేషిస్తూ ఉంటాడు. సినిమాలో కొంత భాగం రోడ్ జర్నీలో సాగుతుంది, ఐతే ఇది థ్రిల్లర్ మూవీ కాదు, రెండు మూడు,విభిన్న జోనర్స్ లో సాగే ఓ వైవిధ్యమైన కమర్షియల్ చిత్రం అని చెప్పవచ్చు అని మేఘాంశ్ చెప్పారు.

     నటనలో శిక్షణ తీసుకొన్నాను

    నటనలో శిక్షణ తీసుకొన్నాను

    హీరోగా అవ్వాలనుకొన్న సమయంలో సినిమాకి ముందు కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నాను. అలాగే స్కూల్ ఏజ్ నుంచి థియేటర్ డ్రామాలలో నటించిన అనుభవం కూడా ఉంది. కెమెరా ముందు మొదట్లో కొంత కంగారుపడ్డాను. ఆ తర్వాత మెల్లగా అలవాటు పడ్డాను. ఇండస్ట్రీ మాపై చాలా అభిమానం, ప్రేమా చూపించింది. సాయి ధరమ్ తేజ్ అన్న, అలాగే మంచు మనోజ్ అన్న కాల్ చేసి మరి అభినందించారు అని మేఘాంశ్ అన్నారు.

    డైరెక్టర్ల మధ్య విభేదాలు వస్తాయోమోనని

    డైరెక్టర్ల మధ్య విభేదాలు వస్తాయోమోనని

    రాజ్‌ధూత్ డైరెక్టర్లు అర్జున్, కార్తీక్ డైరెక్టర్ సుధీర్ వర్మ దగ్గర పనిచేశారు. వీళ్లద్దరి మధ్య వర్క్ కో ఆర్డినేషన్ బాగుంటుంది. వీళ్ళ మధ్య విబేధాలు వచ్చి సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేసింది. అలా ఏం కాకుండా ఇద్దరు చిత్రాన్ని పూర్తి చేశారు.(నవ్వుతూ) ఈ చిత్రంలో కామెడీ,ఎమోషన్స్ లవ్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. జర్నీ కేవలం చిత్రంలో ఒక భాగం మాత్రమే అని హీరో మేఘాంశ్ తెలిపారు.

    English summary
    Late actor Srihari's son Megansh Srihari is introducing as hero with Rajdoot movie. Directed by Arjun and Karthik. This movie set to release on July 12th. In this occassion, Megansh Srihari speak to media exclusively about Rajdoot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X