Mission Impossible 7లో విలన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..టామ్ క్రూజ్ ఫెర్ఫార్మెన్స్ థ్రిల్లింగ్‌గా..

మానవ జీవితంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దూసుకొస్తున్న తరుణంలో ప్రపంచమంతా ప్రస్తుతం ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఛాట్ జీపీటి (ChatGPT), మిడ్ జర్నీ లాంటి సాంకేతికత వేగంగా మానవ జీవితానికి ముప్పుగా మారుతున్నాయనే అభద్రతాభావం ప్రతీ ఒక్కరిలో పెరిగిపోతున్నది. ఈ క్రమంలో artificial intelligence (AI) బ్యాక్ డ్రాప్‌తో సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కించే ప్రయత్నం జరుగుతున్నది.

Artificial Intelligence ప్రాముఖ్యత, అంశం గురించి ముందే మేల్కొన్న హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ తాజాగా మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ (Mission: Impossible - Dead Reckoning) చిత్రంతో ముందుకొస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి దర్శకుడు క్రిస్టఫర్ మెక్‌క్వారీ పలు విషయాలను పంచుకొంటూ..

MI 7: Christopher McQuarrie reveals Artificial Intelligence is Villain in Tom Cruise Mission: Impossible Dead Reckoning

మానవాళికి ముప్పుగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించిన అంశాలను సాంకేతిక నిపుణుడు స్టీవ్ వెయింట్రాబ్‌తో చర్చించాను. ఆయన అందించిన సలహాలు, సూచనలు, సమాచారంతో
Mission: Impossible - Dead Reckoning Part 1 సినిమాను సిద్దం చేశాను. న్యూక్లియర్ ముప్పు కథాన నేపథ్యంతో మంచి యాక్షన్ మూవీ రూపొందించాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి ఎవరూ మాట్లాడకముందే మేము ఆ కథను సిద్దం చేసి మిషన్ ఇంపాజిబుల్ మూవీకి సీక్వెల్ రూపొందించాం అని దర్శకుడు క్రిస్టఫర్ మెక్‌క్వారీ తెలిపారు.

2018, 2019 గురించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా సవాల్‌గా మారనున్నదో అనే విషయాన్ని దర్శకుడు క్రిస్టఫర్ మెక్‌క్వారీ గ్రహించాం. మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ (Mission: Impossible - Dead Reckoning) చిత్రంలో ప్రధాన విలన్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండబోతుంది. ఇక న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ ముప్పు ముగిసిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్ రూపంలో ఐటీ ముప్పు మన జీవితాల్లో పొంచి ఉంది అని దర్శకుడు క్రిస్టఫర్ మెక్‌క్వారీ చెప్పారు.

MI 7: Christopher McQuarrie reveals Artificial Intelligence is Villain in Tom Cruise Mission: Impossible Dead Reckoning

ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు వాటిల్లబోతుందని మూడేళ్ల క్రితం టామ్ క్రూజ్‌కు చెప్పినప్పుడు నా ఐడియాను స్వాగతించారు. తప్పకుండా ఈ కథ ఆడియెన్స్‌ను థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది. ఈ కథలో టెర్రరిస్టులపై వార్, కోల్డ్ వార్ లాంటివి ఉండవు. మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది అని దర్శకుడు క్రిస్టఫర్ మెక్‌క్వారీ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X