twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    GodFather ఆఫర్‌కు కారణం ఆ నిర్మాతే.. అందుకే టాలీవుడ్‌కు దూరంగా.. మోహన్ రాజా (ఇంటర్వ్యూ)

    |

    మలయాళంలో భారీ విజయం అందుకొన్న లూసిఫర్ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా గాడ్‌ఫాదర్‌గా తెరకెక్కించారు. 21 ఏళ్ల క్రితం హనుమాన్ జంక్షన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజాను ఈ సినిమాకు డైరెక్టర్‌గా తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా.. గాడ్ ఫాదర్ సినిమా గురించి చెప్పిన ఆసక్తికరమైన అంశాలు మీ కోసం..

    21 ఏళ్ల తర్వాత చిరంజీవితో సినిమా

    21 ఏళ్ల తర్వాత చిరంజీవితో సినిమా

    నా సక్సెస్‌ఫుల్ జర్నీ మీకు షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంలో మాటలు రావడం లేదు. నేను పుట్టింది తమిళనాడులో కానీ.. నాకు డైరెక్టర్‌గా జన్మనిచ్చింది తెలుగు సినీ పరిశ్రమ. అలాంటి ప్లేస్‌లో 21 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో చిరంజీవి సినిమాకు డైరెక్ట్ చేయడం కంటే గొప్ప ఏముంటుంది. మా నాన్న ఎడిటర్ మోహన్ వేసిన బాటలోనే ఎదిగాం. 90వ దశకంలో 10 ఏళ్లలో 9 బ్లాక్‌బస్టర్లు ఇచ్చి టాలీవుడ్‌లో ఒక కింగ్‌డమ్‌ను ఏర్పాటు చేసుకొన్నారు. హనుమాన్ జంక్షన్ లాంటి విజయం తర్వాత మా నాన్న గారు కేవలం మా తమ్ముడు జయం రవిని హీరోగా లాంచ్ చేయడానికి టాలీవుడ్‌ను వదిలేసి తమిళ పరిశ్రమకు వెళ్లారు అని మోహన్ రాజా తెలిపారు.

    టాలీవుడ్‌ను వదిలేసింది అందుకే..

    టాలీవుడ్‌ను వదిలేసింది అందుకే..

    తెలుగు సినీ పరిశ్రమలో మా నాన్న మంచి కింగ్‌డమ్ ఏర్పాటు చేసుకొన్నారు. కేవలం మా సోదరుడిని లాంచ్ చేయాలనే కోరికతో తమిళంలోకి వెళ్లాం. అయితే ఆయన చేసిన త్యాగానికి ఫలితం ఇప్పుడు కనిపిస్తున్నది. పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాలో టైటిల్ క్యారెక్టర్‌ను జయం రవి చేయడం.. ఆయనకు మంచి పేరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా తమ్ముడికి వచ్చే పేరు మాములుది కాదు. మా నాన్న తీసుకొన్న నిర్ణయం చాలా గొప్పది. ఒకే వారంలో మా కుటుంబానికి పొన్నియన్ సెల్వన్, గాడ్ ఫాదర్ లాంటి రావడం చాలా సంతోషంగా ఉంది అని మోహన్ రాజా తెలిపారు.

    తెలుగు సినిమాలను రీమేక్ చేస్తూ..

    తెలుగు సినిమాలను రీమేక్ చేస్తూ..


    తమిళ సినీ పరిశ్రమను వదిలేసినా.. 21 ఏళ్లు దూరంగా ఉన్నా.. ఏడు తెలుగు సినిమాలను తమిళంలో రీమేక్ చేశాను. జయం, అమ్మా, నాన్న, తమిళ అమ్మాయి, బొమ్మరిల్లు, ఆజాద్ లాంటి తెలుగు సినిమాలను తమిళంలో రీమేక్ చేశాను. తెలుగు పరిశ్రమలో లేకపోయినా తెలుగు సినిమాలతోనే దాదాపు కాపురం చేశాను. అయితే తమిళంలో నేను డైరెక్ట్ చేసిన తనీ ఒరువన్ సినిమాను ధృవగా ఇక్కడ రీమేక్ చేయడం చాలా గర్వంగా ఉంటుంది. తెలుగు సినిమాను రీమేక్ చేసిన ప్రతీసారి ఇక్కడి నుంచి చాలా నేర్చుకొన్నాను అని డైరెక్టర్ మోహన్ రాజా చెప్పారు.

    రాంచరణ్‌తో ధృవ సీక్వెల్

    రాంచరణ్‌తో ధృవ సీక్వెల్


    ధృవ సినిమా సీక్వెల్ గురించి రాంచరణ్‌తో చర్చలు జరుగుతున్నాయి. గతంలో ధృవ సినిమా రీమేక్ చేయడానికి కుదర్లేదు. కానీ ధృవ 2 సినిమా చేయాలని ప్లాన్ చేశాం. ఆ సమయంలోనే గాడ్ ఫాదర్ సినిమాను రీమేక్ ప్రాసెస్ జరుగుతుంది. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. నాకు గాడ్ ఫాదర్ సినిమా అవకాశం రావడానికి ఎన్వీ ప్రసాద్ కారణం. నన్ను టాలీవుడ్‌కు తీసుకు రావడానికి ఆయనే ఒత్తిడి చేశారు. గాడ్‌ఫాదర్ సినిమా రీమేక్‌కు డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందని అనుకొన్నప్పుడు ఎన్వీ ప్రసాద్ నా పేరు చెప్పారు. అప్పుడు రాంచరణ్ బాబు వండర్‌ఫుల్ ఛాయిస్ అని నాకు కాల్ చేశారు అని మోహన్ రాజా చెప్పారు.

    నా పాయింట్ చిరంజీవిని థ్రిల్ చేసిందంటూ

    నా పాయింట్ చిరంజీవిని థ్రిల్ చేసిందంటూ

    గాడ్‌ఫాదర్ సినిమా ఆఫర్ గురించి చెప్పగానే నేను లూసిఫర్ సినిమా చూశాను. ఆ సినిమాను కొత్త కోణంలో తెరకెక్కించాలనే ఒక పాయింట్‌తో నేను చిరంజీవిని కలిశాను. నేను చెప్పిన ఓ పాయింట్ అందర్నీ ఆకట్టుకొన్నది. ఈ యాంగిల్ ఎవరూ చెప్పలేదని చిరంజీవి అన్నారు. రీమేక్ చేయడంలో నాకు చాలా అనుభవం ఉంది. నన్ను రీమేక్ రాజా అంటుంటారు. రీమేక్ చేయడమనే ఓ ఛాలెంజ్. అందుకే నా వెర్షన్‌లో లూసిఫర్ కథను చెప్పాను. అందరికి నచ్చడంతో గాడ్‌ఫాదర్ సినిమా జర్నీ మొదలైంది.

    English summary
    Director Mohan Raja is directing Chiranjeevi for GodFather form Lucifer Remake. This movie is releasing on October 5th. Here is the Mohan Raja exclusive interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X