ఆ స్టార్ విలన్ ఎదురుగా నిలబడి డిమాండ్.. తప్పనిసరిగా ఆయన బూటు నాకాను.. మోహన్ లాల్

టాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన చిత్రం కన్నప్ప. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ, స్క్రీన్ అందించగా, ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు. మహ భారతం సీరియల్‌కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫిల్మీబీట్ ఎడిటర్ రాజబాబు అనుములతో మోహన్ లాల్ మాట్లాడుతూ..

కన్నప్ప కథను విష్ణు మంచు నా వద్దకు తీసుకు రాకముందే.. ఈ పరమ భక్తుడి కథ నాకు తెలుసు. గొప్ప భక్తి ప్రధానమైన కథ. కన్నప్ప నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారిన తీరు. శివుడి కోసం ఆయన చేసిన త్యాగం గొప్పది. ఆయన గొప్ప భక్తుడే కాకుండా ఆయన కథలో మంచి సందేశం కూడా ఉంది. విష్ణు ఈ సినిమా గురించి చెప్పగానే.. నేను కాదని చెప్పలేకపోయాను అని మోహన్ లాల్ తెలిపారు.

Mohanlal about Kannappa

నాకు మల్టీ స్టారర్ సినిమాలు చేయడం నాకు కొత్త కాదు. కాలపానీ సినిమాలో మరో స్టార్‌తో కలిసి నటించాను. అలాగే తెలుగులో బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించాను. అలాగే ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ సినిమాలో కూడా నటించాను. కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్, ప్రభాస్ లాంటి నటులు ఉన్నారు. కానీ వారితో నాకు సన్నివేశాలు లేవు. కేవలం మంచు విష్ణుతోనే సీన్లు ఉన్నాయి. కానీ నాది స్పెషల్ క్యారెక్టర్. దానిని స్క్రీన్ మీద చూస్తేనే థ్రిల్ ఉంటుంది అని మోహన్ లాల్ చెప్పారు.

కాలపానీ మూవీ సమయంలో మీరు స్టార్ హీరో.. అలాంటి సీన్ ఎలా చేశావని విష్ణు మంచు అడిగితే.. కాలపానీ సినిమాలో విలన్ బూట్ నాకే సీన్ చెప్పగానే చేసేశాను. అప్పుడు నేను సూపర్ స్టార్ అని చూడలేదు. స్టార్ హీరోను అనే విషయమే నాకు తట్టలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేసింది. నా క్యారెక్టర్ ఏం చేయాలో అది చేసేశాను. నాకు మరో ఛాన్స్ లేకపోయింది. అమ్రీష్ పురి నా ఎదుట నిలబడి.. కమాన్.. నా బూటు నాకు అంటుంటే.. చేయకుండా ఉంటామా? అని మోహన్ లాల్ ఆనాటి సీన్‌ను గుర్తు చేసుకొన్నారు.

నేను ఆ రోజు అలా చేశాను కాబట్టే.. మీరు ఇంకా గుర్తుంచుకొని నన్ను అడుగుతున్నారు. ఆ సీన్ గొప్పతనం అదే అని మోహన్ లాల్ అన్నారు. ఆ క్యారెక్టర్ క్రియేషన్ గొప్పతనం అలా బయటపడింది. ఓ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు.. మరో క్యారెక్టర్ చేయాల్సిందే అని మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. అందుకే ఆ సీన్ ఇప్పటికీ చాలా మంది హృదయాల్లో నిలిచిపోయింది అని విష్ణు అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న టాప్ యాక్టర్లందరూ కలిసి నటిస్తే.. మల్టీ స్టారర్ గానే కాకుండా.. జాతీయ సమైక్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇలా కలిసి నటిస్తే.. థియేటర్ల గేట్స్ క్రాష్ అయ్యేలా ప్రేక్షకులు వస్తారు. వివిధ భాషల్లోని స్టార్స్ అందరూ నటిస్తే.. చాలా బాగుంటుంది. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను నటించడానికే ఆసక్తిని చూపుతాను అని మోహన్ లాల్ మల్టీ స్టారర్ సినిమాల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

More from Filmibeat

Read more about: mohanlal kannappa Kaalapani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X