మిస్టర్ బచ్చన్‌తో ఆ కోరిక తీరింది.. మా నాన్న ఆ హీరో ఫ్యాన్.. హరీష్ శంకర్ (ఇంటర్వ్యూ
మాస్ మహారాజ్ రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా వారిద్దరి కాంబినేషన్‌కు మూడో చిత్రం. హిందీలో ఘన విజయం సాధించిన రైడ్ సినిమాను రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో దర్శకుడు హరీష్ మాట్లాడుతూ..
రైడ్, మిస్టర్ బచ్చన్ సినిమా కథకు పోలీకే ఉండదు. రైడ్ చిత్రంలోని మెయిన్ పాయింట్ తీసుకొని నా స్టైల్‌లో రాసుకొన్న సినిమా కథ మిస్టర్ బచ్చన్. ఈ సినిమాలో వినోదాత్మక అంశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. వినోదంగా సాగే సీరియస్ సినిమా మిస్టర్ బచ్చన్ అని హరీష్ అన్నారు.

నేను తీసే సినిమాల్లో కమర్షియల్ విలువులు పుష్కలంగా ఉండటానికి కారణం మా నాన్న. ఆయన అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. నేను ఇంటర్మీడియెట్ చదువుతున్న సమయంలో నాకు సినిమాలంటే పిచ్చి అని ఆయన గుర్తించాడు. అలాగే నాకు సినిమా, సాహిత్యం అంటే చాలా ఇష్టం. అవి నాపై, నేను తీసే సినిమాలపై ప్రభావం చూపిస్తాయి.
నాకు ఒక మంచి లవ్ స్టోరి తీయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. నాకు మాస్ డైరెక్టర్ అనే గుర్తింపు రావడం వల్ల ప్రేమ కథలు చెప్పలేకపోయాను. ఈ సినిమా అలా నాకు అవకాశం కల్పించింది. ఈ సినిమాలో ప్రేమ కథ కొత్తగా ఉంటుంది. 80వ దశకంలో ఉండే వాతావరణం అందర్నీ ఆకట్టుకొంటుంది అని హరీష్ శంకర్ అన్నారు.

నిర్మాత విశ్వ ప్రసాద్ లేకుంటే.. ఆయన సహకారం అందించకుండా ఉంటే.. మిస్టర్ బచ్చన్ సినిమా ఉండేది కాదు. అలాగే ఆయన ముందుండి ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయ్యేలా చేశాడు. అయితే సినిమా బాగా రావడానికి ఆర్థికంగా ఎలాంటి పరిమితులు విధించలేదు అని హరీష్ చెప్పారు. ఈ సినిమా విషయంలో నిర్మాతకు రుణపడి ఉంటాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











