twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రెండు నాకు గుణపాఠం.. అమ్మ కాదు.. నాన్న పాత్రనే .. అఖిల్

    |

    అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని, తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో మిస్టర్ మజ్ను చిత్రం విడుదలకు సిద్ధమైంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. తొలిప్రేమ తర్వాత వస్తుండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మిస్టర్ మజ్ను సినిమా ప్రమోషన్‌లో భాగంగా అఖిల్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. తన కెరీర్, వ్యక్తిగత అనుభవాల గురించి పలు విషయాలు పంచుకొన్నాడు. అఖిల్ ఏమన్నాడంటే..

    నాకు అవి గుణపాఠాన్ని నేర్పాయి

    నాకు అవి గుణపాఠాన్ని నేర్పాయి

    నా తొలి సినిమా అఖిల్, రెండో సినిమా హలో పరాజయం నాకు ఓ గుణపాఠంగా మారాయి. అందుకే కొంత ఆలస్యమైనప్పటికీ మిస్టర్ మజ్ను కోసం నాకు నేనుగా చాలా మార్పులు చేసుకొన్నాను. నా బాడీ లాంగ్వేజ్, చాలా విషయాలపై దృష్టి పెట్టి కొన్ని లోపాలు సవరించుకొన్నాను. మిస్టర్ మజ్ను సినిమా చూస్తే నాలో మార్పు మీరే గమనిస్తారు.

    నాకు నేనుగా మారిపోయాను

    నాకు నేనుగా మారిపోయాను

    వ్యక్తిగతంగా కూడా నాకు నేను మారిపోయాను. నా ఆలోచన విధానంపై ఆత్మ విమర్శ చేసుకొన్నాను. ఓ స్టార్‌గా సాధారణంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాలో మార్పును మీరే గమనిస్తారు. అది నాకు సానుకూలంగా మారుతుందని నేను నూటికి నూరుశాతం నమ్ముతున్నాను.

    అఖిల్‌కు ముందే నాకు మజ్ను కథ

    అఖిల్‌కు ముందే నాకు మజ్ను కథ

    అఖిల్‌ సినిమాకు ముందే మిస్టర్ మజ్ను సినిమా కథను దర్శకుడు వెంకీ అట్లూరి నాకు చెప్పారు. అయితే అప్పటికే నేను అఖిల్ సినిమాను ఒప్పుకోవడం, ఆ తర్వాత మా సొంత బ్యానర్‌లో సినిమా చేయాలని నాన్నగారు అనుకోవడంతో మిస్టర్ మజ్ను సాధ్యపడలేదు. అయితే నా కోసం వెంకీ వేచి ఉండటం నాకు బాగా నచ్చింది.

    <strong>రాంచరణ్, ఎన్టీఆర్, అఖిల్ ఒకే చోట.. పార్టీ రచ్చ రచ్చ</strong>రాంచరణ్, ఎన్టీఆర్, అఖిల్ ఒకే చోట.. పార్టీ రచ్చ రచ్చ

    వెంకీ నా స్నేహితుడు కాదు

    వెంకీ నా స్నేహితుడు కాదు

    వెంకీ నాకు స్నేహితుడు కాదు. కానీ అక్కినేని అభిమాని. ప్రేమనగర్ చిత్రంలోని ఓ డైలాగ్‌ ఈ సినిమాకు స్ఫూర్తి. ఈ సినిమాకు ముందు మా మధ్య పెద్దగా సంబంధాలు లేవు. సినిమా ప్రారంభమైన తర్వాత వెంకీతో నాకు మంచి రిలేషన్ ఏర్పడింది. షూటింగ్ అంతా ఫన్‌గా సాగిపోయింది.

     నాన్నగారి ప్రభావమే

    నాన్నగారి ప్రభావమే

    నా సినిమా కథలు, ప్రాజెక్టులు అంగీకరించే విషయంలో నాన్నగారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. పెళ్లి తర్వాత అమ్మ సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. దాంతో ప్రస్తుతం అమ్మకు ఇప్పటి ఫిలిం మేకింగ్ మీద అంతగా పట్టులేదు. అందుకే నాన్న సలహాలు ఎక్కువగా తీసుకొంటాను. నా సినిమా విషయంలో అమ్మ కంటే నాన్నకే ప్రాధాన్యం ఇస్తాను అని అఖిల్ తెలిపారు.

    English summary
    Young Tiger NTR attended for Mr Majnu pre release event as Chief guest. This movie set to release on January 25th. As part of the Promotion, Akhil speaks to Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X