హీరోయిన్లు తల్లిగా నటిస్తే తప్పేంటి? సీతా పాత్ర నన్ను అలా వెతుక్కొంటూ .. మృణాల్ థాకూర్ (Interview)
బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ థాకూర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తైనా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులు. హిందీలో ప్రసారమైన కుంకుమ భాగ్య సీరియల్‌తో మృణాల్ కెరీర్ ఆరంభించింది. తెలుగులో కుంకుమ భాగ్య సిరియల్ ద్వారా అమ్ము పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. హిందీలో లవ్ సోనియా సినిమాతో కెరీర్ ఆరంభించిన ఆమె.. సూపర్ 30, బాట్లా హౌస్, తూఫాన్, ధమాకా, జెర్సీ చిత్రాల్లో నటించింది.
తాజాగా దుల్కర్ సల్మాన్‌తో కలిసి సీతారామం సినిమాలో మృణాల్ నటించింది. అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో మృణాల్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

హీరోయిన్లు తల్లి పాత్రను పోషిస్తే..
జర్నీ సినిమాలో నాది నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్ర. తల్లిగా నటించాల్సి వచ్చింది. హీరోయిన్లు తల్లి పాత్రలు పోషించవద్దు అనేది ఒక అపోహ. నా తల్లి చిన్న వయస్సులో ఓ బిడ్డకు తల్లి అయింది. ఎలాంటి పాత్ర అయినా ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేయాలనేది నటిగా నా కోరిక. కథ, కంటెంట్ నా పాత్ర చుట్టు ఉంటే.. నేను ఎలాంటి పాత్రనైనా చేయడానికి ఓ ఛాలెంజ్‌గా తీసుకొంటాను. హీరోయిన్ తల్లి పాత్ర పోషిస్తే తప్పేంటి? అని మృణాల్ థాకూర్ అన్నారు.

జెర్సీ ఎందుకు ఆడలేదంటే?
జెర్సీ థియేట్రికల్‌గా, కమర్షియల్‌గా ఆడలేకపోయింది. అందుకు కారణం కరోనావైరస్ పరిస్థితులు. జెర్సీ సినిమా రిలీజ్‌ను చాలాసార్లు వాయిదా వేశారు. జెర్సీ థియేటర్‌లో ఆడకపోయినా.. ఓటీటీలో మంచి రెస్సాన్స్ తెచ్చుకొన్నది. తెలుగు నుంచి రీమేక్ అయిన జెర్సీ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. జెర్సీ సినిమాను ఏ భాషలో నిర్మించినా.. ఆ పాత్రను చేయడానికి నేను సిద్దంగా ఉంటానని దర్శకుడు గౌతమ్‌కు చెప్పాను. వాస్తవానికి జెర్సీలో హీరోయిన్ పాత్రను చేసి శ్రద్దా చాలా సాహసం చేసింది. అందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అని మృణాల్ థాకూర్ చెప్పారు.

సీత పాత్ర అలా వెతుక్కొంటూ వచ్చింది..
జెర్సీ, సూపర్ 30 సినిమాలో నా పాత్రలు చాలా డార్క్. అయితే తొలిసారి సీతా రామం సినిమాలో నేను సంప్రదాయమైన భారతీయ యువతిగా కనిపిస్తాను. దర్శకుడు ఆ పాత్ర రాసిన తీరు అద్బుతం. ఇలాంటి పాత్రలు అప్పుడు అద్భుతంగా హీరోయిన్ల కోసం వస్తాయి. అలా నన్ను వెతుక్కొంటూ వచ్చిన పాత్రనే సీత. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత కరణ్ జోహర్ మెసేజ్ చేశారు. చాలా మంది బాలీవుడ్ యాకర్లు బాగుందని చెప్పారు. విజయ్ దేవరకొండ, మమ్ముట్టి లాంటి వాళ్లు సినిమాకు అండగా నిలిచారు అని మృణాల్ థాకూర్ వెల్లడించారు.

కీర్తీ సురేష్‌ను జెలసీగా ఫీలయ్యా
ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో నేను మీ అందరికి కంటే ముందే మహానటి చూశాను. అప్పుడే నేను కీర్తీ సురేష్‌ను కలిసి జాతీయ అవార్డు వస్తుందని చెప్పాను. సావిత్రి పాత్ర అద్భతంగా ఉంది. అంతే రేంజ్‌లో కీర్తి సురేష్ నటించింది. కీర్తీ సురేష్‌ను చూసి జెలసీగా ఫీలయ్యాను. ఇలాంటి పాత్రను పోషించాలని కోరుకొన్నాను. నేను కోరుకొన్నట్టే వైజయంతీ మూవీస్‌లో సీత లాంటి మంచి పాత్ర లభించింది అని అన్నారు.

మృణాల్ థాకూర్ సినీ కెరీర్ ఇలా
1970లో జరిగిన ఇండియా, బంగ్లాదేశ్ యుద్ధం నేపథ్యంగా పీపా, ఆదిత్య రాయ్ కపూర్‌తో గుమ్రా, పూజా మేరీ జాన్ సినిమాలు చేస్తున్నాను. గుమ్రాలో నేను పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలపై క్లారిటీ వస్తుంది అని మృణాల్ థాకూర్ చెప్పారు.


Click it and Unblock the Notifications











