For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకు లవర్ లేడు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం ఎదురుచూస్తున్నా.. సీతారామం హీరోయిన్ మృణాల్ థాకూర్

  |

  మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం సీతా రామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మృణాల్ థాకూర్ మీడియాతో మాట్లాడుతూ..

  పదేళ్ల క్రితం నా కెరీర్ మొదలైంది..

  పదేళ్ల క్రితం నా కెరీర్ మొదలైంది..


  పదేళ్ల క్రితం నేను కుంకుమ భాగ్య సీరియల్‌తో నా కెరీర్ ప్రారంభించాను. నేను నటించిన సీరియల్ తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో డబ్ అయింది. అమ్ము పాత్రతో నేను తెలుగు దక్షిణాది వారికి నేను పరిచయం అయ్యాను. అలా మొదలైన కెరీర్ ఇప్పటి వరకు సాగి వైజయంతీ మూవీస్, స్వప్న మూవీస్‌లో సినిమా చేసే వరకు రావడం చాలా హ్యాపీగా ఉంది. దుల్కర్ సల్మాన్, ఇతర ప్రతిభావంతులైన నటులతో నటించడం గొప్ప అనుభూతి. అలెప్పీలో నేను మూడేళ్లు ఉన్నాను. ఆ సమయంలో నేను సినిమా థియేటర్‌కు వెళ్లి మూవీస్ చూసేదాన్ని. అప్పుడు నేను నటిని అవుతానని అనుకోలేదు. ఈ సినిమా ప్రమోషన్ కోసం కొచ్చికి వెళ్లి వచ్చాను. అక్కడి ప్రజలు చూపించిన ఆదరణ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ పదేళ్ల జర్నీకి సీత పాత్ర అద్భుతమైన ఆరంభం మాత్రమే అని మృణాల్ థాకూర్ అన్నారు.

  ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో నాగ్ అశ్విన్‌ను కలిశా

  ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో నాగ్ అశ్విన్‌ను కలిశా


  ఒక ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్‌లో నేను నటించిన లవ్ సోనియా సినిమాతోపాటు నాగ్ అశ్విన్ సినిమా మహానటిని కూడా ప్రదర్శించారు. ఆ సమయంలో నేను నాగ్ అశ్విన్‌ను కలుసుకొన్నాను. ఆ తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్‌లో రూపొందే సినిమాలో నన్ను తీసుకొవాలని అనుకొన్నారు. అయితే అశ్వినీదత్ మాత్రం నన్ను సీత పాత్రకు ఎంపిక చేశారు.

  హను రాఘవపూడి కథ చెప్పగానే..

  హను రాఘవపూడి కథ చెప్పగానే..


  జెర్సీ సినిమా షూట్ చండీగఢ్‌లో జరుగుతుంటే.. హను రాఘవపూడి నన్ను కలిసేందుకు వచ్చారని చెప్పారు. అయితే హను పేరు వినగానే పెద్ద డైరెక్టర్.. అద్బుతమైన విజువల్స్‌తో సినిమా తీసే మాస్టర్ డైరెక్టర్. ఆయన ఎందుకు వచ్చాడని ఆశ్చర్య పోయాను. అయితే ఓ కాఫీ షాప్‌లో కలిశాం. కథ చెప్పాలని హను సార్ చెప్పినప్పుడు.. ఆఫీస్‌కు వెళ్లి అక్కడ కథ గురించి చర్చించుకొందాం అని చెప్పాను. అలా ఆఫీస్‌లోకి వెళ్లిన తర్వాత ఆయన చాలా ఉద్వేగంగా కథ చెప్పారు. కథ ముగించిన కొద్ది సెకన్లలోనే నేను ఒకే చెప్పాను అని మృణాల్ థాకూర్ అన్నారు.

   రొమాంటిక్ సినిమాలో నా పాత్ర ఎలా అంటే..

  రొమాంటిక్ సినిమాలో నా పాత్ర ఎలా అంటే..


  ఇటీవల కాలంలో రొమాంటిక్ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. యాక్షన్ సినిమాల గొడవ ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో భావోద్వేగాలు నిండిన సీతారామం వస్తున్నది. రామ్ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ సినిమాలోని రొమాంటిక్ సన్నివేశాలు 70 శాతం మంది ప్రేక్షకులను ఆకట్టుకొంటాయి. సీత, రుక్మిణి, సత్యభామ పాత్రలన్ని కలిస్తే నా జీవితంలో నేను అలా ఉంటాను.

  30వ పుట్టిన రోజుకు ముందు అద్బుతం

  30వ పుట్టిన రోజుకు ముందు అద్బుతం


  లవ్ సినిమా తర్వాత చాలా రోజులు ఎలాంటి ఆఫర్లు లేకుండా ఖాళీగా ఉన్నాను. ఇంట్లో బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు తోముకోవడంతో జీవితం సరిపోయింది. అలాంటి టెన్షన్ మూమెంట్స్ చాలా అనుభవించాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాను. ఆ పని చేసినందుకు నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. కానీ నాలో ఆశలు సన్నగిల్లలేదు. ఏదో రోజు ఒక అద్భుతం జరుగబోతుందని నా అమ్మకు చెప్పాను. ఎనిమిదేళ్ల తర్వాత నా 30వ పుట్టిన రోజుకు ముందు సీతా మహాలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. సీత పాత్ర చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. ఈ పాత్ర చేసిన తర్వాత నేను నా లక్ష్యాన్ని చేరుకొన్నానని అనిపించింది.

  చాలా లవ్ లెటర్స్ వస్తున్నాయి

  చాలా లవ్ లెటర్స్ వస్తున్నాయి


  సీత పాత్ర చేసిన తర్వాత నాకు చాలా మంది ఉత్తరాలు రాస్తున్నారు. స్వయంగా నా స్నేహితులు కూడా లెటర్స్ రాస్తున్నారు. నా ఫ్యాన్స్ నుంచి వచ్చే లెటర్స్‌ను భద్రపరుచుకొంటాను. అయితే నాకు చాలా లవ్ లెటర్స్ వస్తున్నాయి. అయితే ఎలిజిబుల్ బ్యాచలర్స్ నాకు లెటర్స్ రాయండి. నేను సింగిల్. నాకు లవ్ లెటర్స్ వస్తన్నాయి. కానీ ప్రపొజల్స్‌ను స్వీకరించే సమయం నా వద్ద లేదు. నా ఫోకస్ అంతా సినిమాలు, కెరీర్‌పైనే ఉంది. అయితే నన్ను అర్ధం చేసుకొనే ఇండస్ట్రీకి సంబంధించిన వారైతే బాగుంటుందని అనిపిస్తున్నది.

  జెర్సీ సినిమా నాకు బాగా ఉపయోగపడింది

  జెర్సీ సినిమా నాకు బాగా ఉపయోగపడింది


  సీతారామం సినిమాలో తెలుగు అమ్మాయి పాత్ర పోషించడానికి జెర్సీ సినిమా నాకు బాగా ఉపయోగపడింది. నేను జెర్సీలో తెలుగు అమ్మాయిగా నటించాను. ఆ సమయంలో ఈ సినిమా నీకు టీజర్ లాంటిది అని గౌతమ్ తిన్ననూరి నాతో అన్నాడు. అప్పటి నుంచే గౌతమ్‌‌తో తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ సినిమా షూటింగ్‌తోనే నేను సీత పాత్రకు ప్రిపేర్ అయ్యాను.

  English summary
  Bollywood actress Mrunal Thakur is introducing to Telugu Audience with Sita Ramam movie which is releasing on August 5th. Here is the exclusive interview of Mrunal Thakur.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X