లవ్ అఫైర్ అంటే శారీరక సుఖమే కాదు.. ఆ హీరోతో అఫైర్‌ను దాచలేదు.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్

భారతీయ సినిమా పరిశ్రమలో అలనాటి అందాల తార ముంతాజ్ ఎలాంటి దాపరికాలు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్. 70, 80 దశకాల్లో తన అందాచందాలు, అభినయంతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకొన్నారు. ఆ సమయంలో రాజేశ్ ఖన్నా, షమ్మీ కపూర్‌లతో కలిసి నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకొన్నారు. అలాంటి హీరోయిన్‌తో నటించాలని బాలీవుడ్ హీరోలు క్యూ కట్టే వారు. అలాంటి అలనాటి హీరోయిన్ ముంతాజ్ ఫిల్మీబీట్‌ ప్రైమ్‌ ఛానెల్‌లో ఏ సే ఆది (A Se Aadi) ముచ్చటించారు. ఆమె వెల్లడించిన మనసులోని భావాల్లోకి వెళితే..

తన అందం, ఆరోగ్యం గురించిన సీక్రెట్ వెల్లడిస్తూ.. చాలా తొందరగా నిద్రకు ఉపక్రమిస్తాను. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేసి యోగా, ఇతర శారీరక వ్యాయామం చేస్తాను. నాకు లేటుగా నిద్రపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఆరోగ్యంగాను, అందంగా కనిపిస్తాను. ప్రతీ రోజు ఉదయం నుంచే పాత సినిమాల పాటలు, నేను షమ్మీ కపూర్, రాజేశ్ ఖన్నా నటించిన సినిమాల పాటలు వింటాను. నేను ఈ తరం మహిళను కాదు. నిజం మాట్లాడుకోవాలంటే.. ఆ తరం వ్యక్తినే. మధుబాలా, అలనాటి హీరోయిన్ల పాటలు కూడా వింటాను. నా అభిమానులు, సన్నిహితులు నా పాటలు బాగుంటాయి. నా డ్యాన్సులు చక్కగా ఉంటాయని చెబుతుంటారు. ఏదైనా ఫంక్షన్లకు ఇప్పుడు వెళ్లినా నేను డ్యాన్సులు చేస్తుంటాను. పాతకాలం నాటి అందరి పాటలు వింటాను అని ముంతాజ్ తన అభిరుచుల గురించి వెల్లడించారు.

Mumtaz Exclusive Interview

నేను యంగ్‌గా ఉండి నటించే సమయంలో నాకంటూ ఓ టీమ్ ఉండేది. క్యాస్టూమర్, హెయిర్ స్టయిలిస్ట్, మేకప్ మ్యాన్ ఇలా నాకు ఒక టీమ్ ఉండేది. దేవుడి దయవల్లా నాకు కారు ఉండేది. ఉదయమే నా స్టాఫ్ వచ్చి నన్ను మేకప్ చేసి రెడీ చేసేవారు. కానీ ఇప్పటి మాదిరిగా హీరోయిన్లకు ఉన్నట్టు 20 మంది టీమ్ ఉండేది కాదు. ఇప్పటి మాదిరిగా వ్యానిటీ వ్యాన్స్, కార్ వాన్స్ ఉండేవి కాదు. బయటకు మూత్రానికి వెళ్లాలంటే పది మంది మహిళా స్టాప్‌ను వెంట తీసుకొని వెళ్లి.. చుట్టూ చీరలు, దుప్పట్లు అడ్డుగా కట్టుకొని విసర్జన చేసే వాళ్లం. జై శివ శంకర్ పాట షూటింగ్ సమయంలో చాలా కష్టపడ్డాం అని ముంతాజ్ చెప్పారు.

నా సినిమాల్లో నేను అందంగా కట్టిన చీరకట్టుకు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. నా స్టయిల్‌ను చాలా మంది అనుకరించే వారు. నేను నటించిన సినిమాల్లోని పాటల్లో నా డ్యాన్సులకు ఫెద్దగా ప్రాక్టీస్ ఉండేది కాదు. డ్యాన్స్ మాస్టర్ చెప్పే విషయాలను సెట్స్‌లోనే నేర్చుకొని అక్కడిక్కడే డ్యాన్స్ చేసే దానిని. కథక్ లాంటి చాలా రకాల డ్యాన్సులు నేర్చుకొన్నాను. వైజయంతి, హెలెన్ లాంటి హీరోయిన్లను చూసి నేర్చుకొన్నాను అని ఆమె అన్నారు.

Mumtaz Exclusive Interview

నా దృష్టిలో ప్రేమ ఏమిటంటే.. కొత్తగా ఏమి లేదు. ప్రపంచం ఫీలయ్యదే.. అందరూ ఫీలైనట్టే నేను లవ్ విషయంలో ఫీలయ్యాను. ప్రేమ అనేది ప్రేమనే. ప్రపంచంలో అందరూ ప్రేమను కోరుకొంటారు. తోడును కోరుకొంటారు. కొన్ని విషయాలను షేర్ చేసుకోవడానికి సహచర్యం కావాలని కోరుకొంటారు. అందరూ ప్రేమలో మునిగితేలాయని కోరుకొంటారు. శారీరక సుఖం ముఖ్యం కాదు. వారి మాదిరిగానే నేను నా జీవితంలో ప్రేమను ఆస్వాదించాను అని చెప్పారు.

అప్పట్లో అఫైర్ల గురించి పెద్దగా దాపరికాలు ఉండేవి కాదు. ఇప్పటి తరం హీరోయిన్లు తమ అఫైర్లు, డేటింగ్ గురించి దాచుకోవడం లేదు. వారు కూడా ఓపెన్‌గా ఉంటారు. మా టైమ్‌లో గాఢమైన ప్రేమలో ఉండే వాళ్లం. టైంపాస్ లవ్ ఉండేవి కాదు. నేను అప్పటి హీరో షమ్మీ కపూర్‌ను ప్రేమించాను. ఆ ప్రేమ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన మ్యారేజ్‌ చేసుకొన్నాను. మనల్ని ప్రేమించే వారిని, మనం ఇష్టపడేవారిని ప్రేమించాల్సిందే అని ముంతాజ్ అన్నారు.

More from Filmibeat

Read more about: mumtaz Shammi Kapoor bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X