‘ఆ సూపర్‌స్టార్ తలుచుకొంటే కోటి మంది గర్ల్‌ ఫ్రెండ్స్.. వేల మంది అమ్మాయిలు ఆయన ఇంటి ముందు’

బాలీవుడ్‌ను దాదాపు రెండు దశాబ్దాలపాటు తన అందం, అభినయంతో ఏలిన అలనాటి నటి ముంతాజ్. రాజేశ్ ఖన్నా, షమ్మీ కపూర్, ధర్మేంద్ర, శశికపూర్, సునీల్ దత్, ఫిరోజ్ ఖాన్ లాంటి అగ్ర నటులతో నటించారు. కెరీర్ ఉన్నత పథంలో కొనసాగుతుండగానే.. మయూర్ మధ్వానీ అనే బిజినెస్‌ మ్యాన్‌ను 1974 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. 1976లో ఆమె నటించిన చివరి చిత్రం నాగిన్. ఆ తర్వాత 1990లో ఓ ఆంధియాన్ అనే సినిమాలో కనిపించారు. అప్పటి నుంచి నటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఫిల్మీబీట్ ఛానెల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఏ సే ఆది (A Se Aadi) తో మాట్లాడుతూ...

తన అందం, ఆరోగ్యం గురించిన సీక్రెట్ వెల్లడిస్తూ.. చాలా తొందరగా నిద్రకు ఉపక్రమిస్తాను. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేసి యోగా, ఇతర శారీరక వ్యాయామం చేస్తాను. నాకు లేటుగా నిద్రపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఆరోగ్యంగాను, అందంగా కనిపిస్తాను. ప్రతీ రోజు ఉదయం నుంచే పాత సినిమాల పాటలు, నేను షమ్మీ కపూర్, రాజేశ్ ఖన్నా నటించిన సినిమాల పాటలు వింటాను. నేను ఈ తరం మహిళను కాదు. నిజం మాట్లాడుకోవాలంటే.. ఆ తరం వ్యక్తినే. మధుబాలా, అలనాటి హీరోయిన్ల పాటలు కూడా వింటాను అని ముంతాజ్ తన అభిరుచుల గురించి వెల్లడించారు. నా అభిమానులు, సన్నిహితులు నా పాటలు బాగుంటాయి. నా డ్యాన్సులు చక్కగా ఉంటాయని చెబుతుంటారు. ఏదైనా ఫంక్షన్లకు ఇప్పుడు వెళ్లినా నేను డ్యాన్సులు చేస్తుంటాను. పాతకాలం నాటి అందరి పాటలు వింటాను అని అని ముంతాజ్ తన అభిరుచుల గురించి వెల్లడించారు.

Heroine Mumtaz

రాజేశ్ ఖన్నాతో చాలా సినిమాలు చేశాను. దాదాపు ప్రతీ రోజు అతడితో సినిమాలు, షూటింగ్ చేసేంతగా మేము కలిసి సినిమాలు చేశాం. మేము నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఒక్క సినిమా ఫ్లాప్ కాలేదు. ముంతాజ్, రాజేశ్ ఖన్నా జోడి అంటే నిర్మాతలు, దర్శకులు, డిస్టిబ్యూటర్లు, ప్రేక్షకులు పడి చచ్చే వారు. ఒకవేళ మేము నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే వద్దని అనే వారేమో.. దేవుడి దయ వల్ల మా సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అందుకే వరసగా సినిమాలు చేశాం అని ముంతాజ్ తెలిపారు.

రాజేశ్ ఖన్నా ఇండియాలో ఫస్ట్ సూపర్ స్టార్. ఆయనకు అమ్మాయిల్లో ఉండే క్రేజ్ మాటల్లో చెప్పలేను. ఆయన ఆటోగ్రాఫ్ కోసం, ఫోటో దిగడానికి స్టూడియో, షూటింగ్ వద్ద వేల మంది పిచ్చిగా వెయిట్ చేసే వారు. ఆయన పక్కన నేను నటిస్తుంటే.. సెట్‌లో నన్ను చూసి విచిత్రంగా ఆయన ఫ్యాన్స్ వెక్కిరించే వాళ్లు. ఆయనను అభిమానించే అమ్మాయిలు జెలసీగా ఫీలయ్యేవారు. ఆయనను సొంత ఆస్తిలా భావించే వాళ్లు అని ముంతాజ్ తెలిపారు.

Heroine Mumtaz with A Se Aadi

రాజేశ్ ఖన్నా ఇంటికి పక్కనే మా ఇల్లు ఉండేది. నేను మా ఇంట్లో నుంచి తొంగి చూస్తే... ఆయన ఇంటి ముందు సుమారు 10 వేల మంది ఉండేవాళ్లు. కానీ ఆయన ఏనాడు హద్దు మీరి ప్రవర్తించలేదు. ఆయన తలుచుకొంటే కోటి మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. ఆయన నడిచి వస్తుంటనే అమ్మాయి పడిపోయేవాళ్లు. కానీ అమ్మాయిల్లో ఆ క్రేజ్‌ను ఆయన పెద్దగా పట్టించుకొనే వారు కాదు. కానీ వారి ప్రేమను, అభిమానాన్ని గౌరవించే వారు. ఇప్పటికీ మేము ఏదైనా మాల్స్ వెళితే.. చాలా మంది చుట్టూ మూగుతారు. నాతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తారు అని ముంతాజ్ వెల్లడించారు.

Heroine Mumtaz with Rajesh Khanna

అప్పటి రోజుల్లో కూడా హీరోయిన్ల మధ్య విభేదాలు ఉండేవి. నాకు షర్మిలా టాగోర్‌కు పడేది కాదని రూమర్ వచ్చింది. కానీ నేను ఎన్నడూ షర్మిలా టాగోర్‌ను కలువలేదు. ఆ తర్వాత ఏదైనా ఫంక్షన్‌లో కలిసినా పలకరించుకొంటాం. ఆ వార్త ఎలా పుట్టిందో నాకు అర్ధం కాదు. మా మధ్య విభేదాలకు ఒక్క కారణం చూపగలరా? నాకు ఎవరితోను విభేదాలు లేవు. అందరి హీరోయిన్లతోను, ఇతర నటీనటులతో ఫ్రెండ్లీగా ఉండేదానిని అని ముంతాజ్ తెలిపారు.

నేను అప్పటికీ, ఇప్పటికీ మధుబాలా ఫ్యాన్. ఆమెకు ఉన్న అందం ఇప్పటి వరకు ఎవరిలో కనిపించలేదు. ఆమె నుంచి నేను చాలా నేర్చుకొన్నాను. ఆమె నాతో ఏం చెప్పారంటే.. జీవితంలో అత్యంత చెడ్డ విషయం ఒకరిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించడం. లైఫ్‌లో ఎవర్నీ అంతగా ప్రేమించొద్దు. ఒకవేళ ప్రేమించావే అనుకో..అది విఫలమైతే దాని గురించి ఎప్పుడూ బాధపడకూడదు. ఆ వ్యక్తిని మరిచిపోయేందుకు కష్టపడకూడదు అని చెప్పారు. ఆమె నుంచి నేను నా జీవితంలో నేర్చుకొన్న విలువైన పాఠం అంది అని ఆమె చెప్పారు.

నా వయసు 26 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను యాక్టింగ్ వదిలేశాను. పెళ్లైన రెండు సంవత్సరాల తర్వాత నా షూటింగులన్నీ కంప్లీట్ చేసుకొని నటించడం ఆపేశాను. పెళ్లి తర్వాత చాలా సినిమాలు వదులుకొన్నాను. హాథీ మేరీ సాథీ లాంటి సినిమాలను వదిలేశాను. నా పెళ్లి ద్వారా ఎవరూ నష్టపోకూడదని అనుకొన్నాను. అలాగే ఎవరూ కష్టపడకుండా చర్యలు తీసుకొన్నాను. నా భర్త నాకు ఏ లోటు రాకుండా సర్వసంపదలు ఇచ్చారు. నాకు ఇక జీవితంలో ఎలాంటి లోటు లేకపోయింది. మనిషి అన్నాక జీవితంలో శాంతి, సుఖాలు ఎన్నడూ ఉండవు. ఎప్పుడు మనసులో ఏవో కోరికలు పుడుతూనే ఉంటాయి. కానీ నాకు అలాంటి కోరికలు రాకుండా నా భర్త సర్వం కల్పించారు.

హీరోయిన్ ముంతాజ్ కెరీర్ విషయానికి వస్తే.. 1958 సంవత్సరంలో ఆమె బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. సోనే కి చుడియా, తలాక్, స్త్రీ, షేరా, హెర్క్కూలస్, టార్జాన్ కమ్స్ టు ఢిల్లీ, మేరే సనమ్, బాక్సర్, బహు బేటీ, యే రాత్ ఫిర్ నా ఆయేగి, ప్యార్ కియే జా, డాకు మంగళ్ సింగ్, హమ్ రాజ్, సీఐడీ 9090, చందన్ కా పాల్ా, గౌరీ, బ్రహ్మాచారి, దో రాస్తే, బంధన్, పర్ దేశీ, హిమ్మత్, రూప్ తేరా మస్తానా, లోఫర్, ఆయ్‌నా, రోటి, లఫంగే, నాగిన్, ఆంధియాన్ సినిమాలో నటించారు. ఇప్పటికీ మంచి పాత్రలు వస్తే నటించడానికి సిద్దంగా ఉన్నాను అని అన్నారు.

More from Filmibeat

Read more about: mumtaz rajesh khanna bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X