MS Dhoni నుంచి ఆ విషయం నేర్చుకొన్నా.. ధోని అడిగితే ఆ పని ఫ్రీగా చేస్తా.. తమన్ (ఇంటర్వ్వూ)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సముద్రఖని కాంబినేషన్‌లో వస్తున్న బ్రో చిత్రం భారీ అంచనాలను క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ ఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవల మై డియర్ మార్కండేయ పాట రిలీజై మంచి రెస్పాన్స్ అందుకొంటున్న సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ..
నా మ్యూజిక్, పాటల గురించి ట్రోల్స్ చేయడం సర్వసాధారణమైంది. కొత్తగా ఎవరో వచ్చి చేయడం లేదు. రెగ్యులర్‌గా ఎవడైతే నన్ను ట్రోల్ చేస్తున్నాడే వాడే ట్రోలింగ్ చేస్తున్నాడు. కొత్తగా ఎవడో పుట్టి నాపై కామెంట్ చేయడం లేదు. వాడిని నేను గమనిస్తూనే ఉన్నాను. ట్రోలింగ్‌ను నేను నెగిటివ్‌గా తీసుకోను. తప్పు జరిగితే నేను సరిదిద్దుకొంటున్నాను. పొడిగితే తీసుకొంటాను. తిడితే భరిస్తాను. వారికి ట్విట్టర్ నుంచి అంత మాత్రనా వెళ్లిపోవాలా? అని తమన్ అన్నారు.

మ్యూజిక్ పక్కన పెట్టి క్రికెట్‌కు ప్రాధాన్యం ఇస్తారనే కామెంట్లు అవాస్తవం. నేను మందుకొట్టాను. గర్ల్ ఫ్రెండ్స్ లేరు. మరో వ్యవహారం లేదు. రాత్రి తొమ్మిది గంటలకు అందరూ పడుకొనే ముందు నేను క్రికెట్ అడుకొంటాను. అదే నాకు హాబీ. వేరే హాబీలు లేవు. మా ఫ్రెండ్స్‌తో కలిసి పోలీసులు, సాఫ్ట్‌వేర్ టీమ్స్‌తో క్రికెట్ ఆడుతాను. అది నాకు ఎక్స్‌ర్‌సైజ్, స్ట్రెస్ రిలీఫ్. నా పనులు వదిలేసి నేను వెళ్లను. రాత్రి 2 గంటల వరకు ఆడి వచ్చేసి పడుకొంటాను. ఉదయమే లేచి నేను నా పని చేసుకొంటాను అని తమన్ చెప్పారు.
నా గురించి తెలిసిన వారే నా గురించి రాస్తున్నారు. అది నాకు బాధగా ఉంది. ఇప్పటి వరకు నాపై ఒక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్ కంప్లయింట్ చేయలేదు. నేను తీసుకొనే రెమ్యునరేషన్‌కు ఎంత పనిచేస్తానో వారికి తెలుసు. నాకు క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. క్రికెట్‌లో ఎంటర్‌టైనర్ అవార్డు ఇచ్చారు. ఇప్పటికే నేను చాలా షాక్‌లో ఉన్నాను. ఆ అవార్డును ఇంట్లో పెట్టుకొన్నాను. మా అమ్మ ఎప్పడు అవార్డును చూస్తూ ఉంటుంది అని తమన్ అన్నారు.

ఎంఎస్ ధోని సినిమా రంగంలోకి అడుగుపెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ధోని సినిమాకు ఆఫర్ వస్తే.. నేను రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేస్తాను. నా స్టూడియోలో ధోని ఫోటో ఉంటుంది. ధోని వద్ద ఉన్న బ్యాట్స్ అన్నీ నా వద్ద ఉన్నాయి. ధోని అంటే నాకు చాలా ఇష్టం కంటే పిచ్చి అంటే బాగుంటుంది. ధోని అంటే నాకు ఎమోషన్ అని తమన్ అన్నారు.
ధోని ఎక్కడి నుంచో వచ్చి దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. ఎన్నో కప్పులను, విజయాలను అందించాడు. ఒక్క రోజు ధోని ఆడకపోతే.. ఆయన పని అయిపోయిందని అంటారు. నేను సరిగా ఓ పాట చేయకపోతే.. నువ్వు మ్యూజిక్ చేయడం ఆపేయ్ అంటున్నారు. ఆయన ఎలా మేనేజ్ చేస్తున్నాడనే నాకు చాలా ఇష్టమైన అంశం. ఆయన గ్రౌండ్‌లో అడుగుపెడితే ఎన్నో వేల మంది అరుస్తుంటారు. ఒత్తిడిని హ్యాండిల్ చేయడమనే విషయం నేను ధోనిని చూసి నేర్చుకొన్నాను అని తమన్ చెప్పారు.

తన ప్రొడక్షన్‌లో సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగితే వెంటనే ఒప్పుకొంటాను. మరోసారి ఆలోచించను. నా మ్యూజిక్ ఆయన చెవులకు చేరితే చాలూ అనుకొంటాను. నాకు ఆఫర్ వస్తే వెంటనే చేసేస్తాను. ధోని అంటే అలాంటి ఎమోషన్ అని తమన్ చెప్పారు. ఇదిలా ఉండగా, ఎంఎస్ ధోని నిర్మాతగా తమిళ చిత్రం ఎల్‌జీఎం రిలీజ్‌కు సిద్దమైంది. సోమవారం జూలై 10 తేదీన చెన్నైలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుగనున్నది.


Click it and Unblock the Notifications











