Baby ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాటను అలా పూర్తిచేశాం.. అల్లు అరవింద్ అలా ఆట పట్టిస్తున్నారు.. విజయ్ బుల్గానిన్

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత SKN నిర్మించిన చిత్రం బేబీ బ్లాక్‌బస్టర్ సినిమాకు మించిన విజయంతో దూసుకెళ్తున్నది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు సినిమాకు అత్యంత బలంగా, ఫీల్‌గుడ్‌గా మారాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని ఓ రెండు ప్రేమ మేఘాలు, ప్రేమిస్తున్నా అనే పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. జూలై 14న రిలీజైన బేబీ చిత్రం మ్యూజిక‌ల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ సాధించడంతో తన సంతోషాన్ని మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మీడియాతో పంచుకొన్నారు. ఆయన ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ...

నేను కాకినాడకు చెందిన వాడిని. కొన్ని సినిమాలకు పనిచేసిన తర్వాత ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసేందుకు సిద్దమై కాకినాడకు వెళ్లాను. కాకినాడకు వెళ్లిన సమయంలో డైరెక్టర్ సాయి రాజేష్ నాకు ఫోన్ చేశారు. మీ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. మీరు నాతో పనిచేస్తారా? కానీ నాతో పనిచేయడం చాలా కష్టం. మీకు ఒకే అనిపిస్తే కలిసి పనిచేద్దామని అన్నాడు. అలా ఆయనతో నా ప్రయాణం సాగింది. బేబీ సినిమాకు మ్యూజిక్ చేయడం మొదలుపెట్టాను అని విజయ్ బుల్గానిన్ తెలిపారు.

Music Director Vijay Bulganin Interview about Baby movie and O Rendu Prema Meghalila Song

బేబీ సినిమా కథను ముందు సాయి రాజేష్ ఫోన్‌లో కథ చెప్పారు. కథ నాకు అప్పుడే నచ్చడంతో సినిమాకు పాటలు చేసే పనిలో పడ్డాను. ముందుగా కష్టంగా ఉండే పాటలను చేయాలని ప్లాన్ చేశాం. ఆ క్రమంలో ప్రేమిస్తున్నా అనే పాటను పూర్తి చేశాం. ఆ పాటను కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేశాను. ఆ పాట దర్శకుడు సాయి రాజేశ్‌కు బాగా నచ్చింది. అయితే మిగితా పాటలకు ఎక్కువ సమయం పట్టలేదు అని విజయ్ బుల్గానిన్ చెప్పారు.

బేబీలో ఎక్కువ మందికి నచ్చిన పాట ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాటను కూడా చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేశాను. ప్రతీ పాటలో మెలోడి ఉండేలా చూసుకొన్నాం. అందుకే బ్యాక్ గ్రౌండ్‌లో కూడా ఆ పాటల ట్యూన్‌ను వాడాం. అలా వాడటం వల్ల సినిమాకు పాజిటివ్‌గా మారింది. అయితే దర్శకుడు సాయి రాజేష్‌తో పనిచేయడం చాలా సులభమనిపించింది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఒకరి మాటలో విషయం ఉంటే మరోకరం వినే వాళ్లం అని విజయ్ బుల్గానిన్ చెప్పారు.

Music Director Vijay Bulganin Interview about Baby movie and O Rendu Prema Meghalila Song

బేబీ సినిమా పాటలు విన్న తర్వాత నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపపోతాయి. అలాగే విజయ్ దేవరకొండ ప్రశంస, నాని పంపిన మెసేజ్ నాకు స్పెషల్. బేబీ సినిమా మ్యూజికల్ హిట్ కావడంతో నాకు చాలా మెసేజేస్, ప్రశంసలు రావడం చాలా హ్యాపీగా ఉంది అని విజయ్ బుల్గానిన్ తెలిపారు.

బేబీ సినిమా పాటలు రిలీజైన తర్వాత చాలా పెద్ద ఆఫర్లు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ తర్వాతే నేను చూద్దామని అనుకొన్నాను. ప్రస్తుతం సినిమా హిట్ కావడంతో భారీ ప్రొడక్షన్ హౌజ్‌ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అల్లు అరవింద్ లాంటి వాళ్లు మాకు ఛాన్స్ ఇస్తావా? అంటూ ఆటపట్టిస్తున్నారు. బేబీ నా కెరీర్ గ్రాఫ్‌ను మార్చే సినిమా అని విజయ్ బుల్గానిన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X