టాలీవుడ్‌లో ఆ హీరో సూపర్ హీరో కాడు.. కానీ నాకు చాలా ఇష్టం.. ముత్తయ్య మురళీధరన్ (ఇంటర్వ్యూ)

క్రికెట్ రంగంలో తన బౌలింగ్ ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 800. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్. ఆ రికార్డును గుర్తు చేసేలా టైటిల్ పెట్టారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీ పిక్చర్స్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న సినిమా విడుదల అవుతున్నది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ..

వెంకట్ ప్రభు, నా భార్య కలిసి:తమిళ దర్శకుడు వెంకట్ ప్రభును 2008లో ఒకసారి కలిశాను. శ్రీలంకలో తమిళ ప్రజలకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు మేమిద్దరం కలిశాం. అప్పుడు ఆయనతోపాటు అప్పుడు ఆయన అసిస్టెంట్ శ్రీపతి, ఇంకో ఇద్దరు ఉన్నారు. నా వైఫ్ మదిమలర్, వెంకట్ ప్రభు చిన్ననాటి స్నేహితులు. వారు నా బయోపిక్ తీద్దామని ప్రతిపాదన తెచ్చారు. అయితే నేను నా బయోపిక్ తీయడం ఇష్టం లేదని చెప్పాను. అయితే నేను నిర్వహించే స్వచ్చంద సంస్థ కోసం ఏదైనా చేయవచ్చని నా మేనేజర్ బలవంతం చేశారు. దాంతో నా బయోపిక్ తీయడానికి అంగీకరించాను అని ముత్తయ్య మురళీధరన్ తెలిపారు.

విజయ్ సేతుపతి హీరోగా:నా జీవిత కథను రాయమని అప్పుడు శ్రీపతికి వెంకట్ ప్రభు చెప్పారు. కొన్ని కారణాల వల్ల వెంకట్ ప్రభుతో ఓ నిర్మాత సినిమా చేయడానికి కుదర్లేదు. అయితే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీపతిని కలిసి ముందు స్క్రిప్ట్ పూర్తి చేయమని చెప్పా. తర్వాత విజయ్ సేతుపతి హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ సినిమా చేయాలని ప్లానింగ్ జరిగింది. ఆ సినిమా సెట్స్‌పైకి రాకుండా ఆగిపోయింది. ఆ తర్వాత నాతోపాటు శ్రీపతి చాలా రోజులు ట్రావెల్ చేశారు. నా గురించి బాగా తెలిసిన, స్క్రిప్ట్ రాసిన శ్రీపతిని డైరెక్ట్ చేయమని చెప్పా. తర్వాత మధుర్ మిట్టల్ వచ్చారు అని ముత్తయ్య మురళీధరన్ చెప్పారు.

Muttiah Muralitharan interview about Natural Star Nani and Telugu Film Industry growth and 800 Movie

అక్టోబర్ 6 తేదీన:800 మూవీకి చాలా అడ్డంకులు వచ్చాయి. కరోనా లాక్ డౌన్ వల్ల కొంత ఆలస్యమైంది. సినిమా పూర్తైన తర్వాత శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ముందుకు వచ్చారు. నా జీవితంలో ఎత్తుపల్లాలు ఎలా అయితే ఉన్నాయో... ఈ సినిమాను అక్టోబర్ 6 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించడం వెనుక అదే విధంగా ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ, సింహళీ భాషల్లో విడుదల చేస్తున్నాం. శ్రీలంకలో సింహళీ వెర్షన్‌ విడుదల చేస్తున్నాం అని ముత్తయ్య మురళీధరన్ తెలిపారు.

Muttiah Muralitharan interview about Natural Star Nani and Telugu Film Industry growth and 800 Movie

టాలీవుడ్ టాప్ రేంజ్‌లో:నేను సినిమాలను ఎక్కువగా, పిచ్చిగా చూస్తాను. శ్రీలంకలో తెలుగులో రూపొందిన డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతాయి. బాహుబలి, RRR, పుష్ప సినిమాలు చేశాను. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు బాగా ఆదరణ ఉండేది. ఆ తర్వాత తమిళ, తెలుగు సినిమాలకు క్రేజ్ ఉండేది. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఎక్కువగా క్రేజ్ ఉంది. ఆ తర్వాత తమిళం, ఇప్పుడు హిందీ పెద్దగా ఆదరణ లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా టాప్ పొజిషన్‌కు చేరుకొన్నది అని ముత్తయ్య మురళీధరన్ చెప్పారు.

Muttiah Muralitharan interview about Natural Star Nani and Telugu Film Industry growth and 800 Movie

నాకు నాని అంటే చాలా ఇష్టం..:తెలుగులో చాలా మంది సూపర్ హీరోలు ఉన్నారు. అయితే నాకు అత్యంత ఇష్టమైన నటుడు నేచురల్ స్టార్ నాని. ఆయన నటించిన జెర్సీ, శ్యామ్ సింగరాయ్, ఈగ మూవీతో పాటు చాలా సినిమాలు చూశాను. డబ్బింగ్ సినిమాలు కాబట్టి ఆ సినిమాల టైటిల్స్ గుర్తు లేదు. ఆయన నటన సహజంగా ఉంటుంది. అందుకే నేచురల్ స్టార్ అయ్యారు. ఆయన యాక్షన్ హీరో కాదు.. డ్రామా, ఎమోషన్స్ ఉంటాయి అని ముత్తయ్య మురళీధరన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X