twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు హిట్లు పడని.. అప్పుడు చేస్తా.. అందుకే సవ్యసాచికి రిపేర్లు చేశాం.. నాగచైతన్య

    |

    శైలజారెడ్డి అల్లుడు సినిమా సక్సెస్ తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్య జోష్ పెరిగింది. ఈ సినిమా తర్వాత తాజాగా వస్తున్న సినిమా సవ్యసాచి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు మాధవన్ ఈ చిత్రంలో విలన్‌గా కనిపిస్తున్నాడు. భూమిక కూడా ప్రత్యేకమైన పాత్రలో నటించింది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న సవ్యసాచి సినిమా నవంబర్ 2 తెర ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో నాగచైతన్య తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఆయన ఏమి చెప్పారంటే..

    సవ్యసాచి కొత్త టీజర్: సుభద్ర పరిణయం.. బలరాముడు అంటే రాముడికి చుట్టమా!సవ్యసాచి కొత్త టీజర్: సుభద్ర పరిణయం.. బలరాముడు అంటే రాముడికి చుట్టమా!

     ప్రేమమ్ మూవీ షూటింగ్‌లో

    ప్రేమమ్ మూవీ షూటింగ్‌లో

    ప్రేమమ్ సినిమా షూట్ నార్వేలో జరిగినప్పుడు సవ్యసాచి సినిమా కథ చెప్పారు. పాయింట్ కొత్తగా ఉండటంతో నచ్చింది కానీ.. పూర్తి సినిమాగా రావాలంటే చాలా విషయాలు జొప్పించాల్సి వచ్చింది. ప్రేమమ్ సినిమా రిలీజ్ తర్వాత పూర్తి కథ చెప్పాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాను ఆసక్తికరంగా స్క్రిప్టు పూర్తి చేశాడు.

     శైలజారెడ్డి అల్లుడు కలెక్షన్లు

    శైలజారెడ్డి అల్లుడు కలెక్షన్లు

    శైలజారెడ్డి అల్లుడు చిత్రం కారణంగా సవ్యసాచి రిలీజ్ వాయిదాపడటం నాకు కొంత బాధ కలిగింది. మరికొంత ఆనందం కలిగింది. ఎందుకంటే.. శైలజారెడ్డి చిత్రం నా కెరీర్‌లోనే ముందెన్నడూ లేని విధంగా కలెక్షన్లు తెచ్చిపెట్టడం ఆనందం కలిగింది. సవ్యసాచి సినిమా ప్రేక్షకులకు కాస్తా ఆలస్యం చేరడం కొంత బాధ కలిగింది.

    బాడీ లాగ్వేంజ్‌కి తగినట్టుగా

    బాడీ లాగ్వేంజ్‌కి తగినట్టుగా

    శైలజారెడ్డి తర్వాత డ్యాన్సులు బాగున్నాయనే మాట వినిపించడం ఆనందంగా ఉంది. నేను సరిగా డ్యాన్స్ చేయలేను. కానీ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ నా బాడీ లాంగ్వేజ్ పట్టుకొని మంచిగా రిథమిక్‌గా డ్యాన్స్‌లు కంపోజ్ చేశారు. నా డ్యాన్సులు బాగున్నాయంటే అందుకు శేఖర్ మాస్టర్‌కు థ్యాంక్స్ చెప్పాలి.

    పౌరాణిక చిత్రాల్లో నటించాలని

    పౌరాణిక చిత్రాల్లో నటించాలని

    మా తాతగారు మాయాబజార్ అర్జునుడు గతంలో పాత్ర వేశారు. భవిష్యత్‌లో పౌరాణిక చిత్రాల్లో నటించాలని ఉంది. కానీ రెండు, మూడు హిట్లు పడిన తర్వాత పౌరాణిక చిత్రాలు చేసే ఆలోచన చేస్తాను. నాకు విభిన్నమైన చిత్రాల్లో కనిపించాలన్నదే నా కోరిక.

     అందుకే సవ్యసాచికి రిపేర్లు చేశాం

    అందుకే సవ్యసాచికి రిపేర్లు చేశాం

    సవ్యసాచి సినిమా చూసిన తర్వాత నాన్న (నాగార్జున) కొన్ని సలహాలు ఇచ్చారు. సెకండాఫ్‌లో క్వాలిటీ పెంచడానికి రీ షూట్ చేశాం. రీషూట్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే కొన్నిసార్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని చోట్ల రిపేర్లు చేస్తే బాగుండేదనిపిస్తుంది. అందుకే ముందుగానే జాగ్రత్తపడి కొన్ని సీన్లు షూట్ చేశాం. స్టార్ హీరోల సినిమాలు కూడా సాధారణంగా రీషూట్ అవుతాయి.

    అన్నిరకాల ఎమోషన్స్‌తో సవ్యసాచి

    అన్నిరకాల ఎమోషన్స్‌తో సవ్యసాచి

    సవ్యసాచి చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. నాన్న నటించిన అల్లరి అల్లుడు చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు పాట ఆలోచన దర్శకుడు చందు మొండేటిదే. ఆ పాటను ముందు రీమిక్స్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు కొంత భయమేసింది. క్లాసిక్ సాంగ్‌ను పాడుచేయడం లేదు కాదా అనిపించింది. కీరవాణి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. సెకండాఫ్‌లో వినోదం బాగుంటుంది. మాధవన్‌తో మైండ్ గేమ్ తెరపైన బాగుంటుంది.

     మైత్రీ మూవీ మేకర్ రాకతో

    మైత్రీ మూవీ మేకర్ రాకతో

    సవ్యసాచి సినిమా మొదలుపెట్టినప్పుడు భూమిక, మాధవన్, కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి ఆలోచించలేదు. మైత్రీ మూవీస్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టిన తర్వాత చాలా విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమా కథకు అవసరమైన కమర్షియల్ అంశాలను జొప్పించారు. దాంతో సవ్యసాచి సినిమా భారీగా బడ్జెట్ సినిమాగా మారింది.

    English summary
    Savyasachi an action film directed by Chandoo Mondeti & produced by Naveen Yerneni, C.V. Mohan, Y. Ravi Shankar under the banner Of Mythri Movie Makers. The film features Naga Chaitanya, R Madhavan and Nidhhi Agerwal in lead roles. This film is set to release on November 2nd. In this occassion, Naga Chaitanya spoke to Telugu filmibeat..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X