For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రేమలో పడితే భరించాల్సిందే.. అది చెప్పగానే సమంత ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్.. నా తప్పు కాదు.. నాగచైతన్య

  |
  Naga Chaitanya Special Interview | ప్రేమలో పడితే భరించాల్సిందే |

  లవర్ బాయ్ ఇమేజ్‌‌తోపాటు మాస్ ఎలిమెంట్స్‌ ఉన్న పాత్రతో యువ సామ్రాట్ నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడిగా వస్తున్నాడు. ఈ చిత్రంలో ఇగో ఉన్న వ్యక్తుల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా, అల్లుడిగా, కుమారుడిగా నటించాడు. ఈ చిత్రం వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 13న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ సినిమా గురించి వెల్లడించారు. పలు రకాల వేరిషయన్స్ ఉన్న రోల్‌ తనకు నచ్చిందని చెప్పారు. ఇంకా చైతూ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

   ఎంటర్‌టైనింగ్‌గా

  ఎంటర్‌టైనింగ్‌గా

  శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నా పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటుంది. నేను గతంలో పుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ మూవీ చేయలేదు. ఓ రకంగా ఇది ఛాలెంజ్ లాంటిందే. మారుతి స్టయిల్‌లో సినిమా ఉంటుంది. నా బాడీలాంగ్వేజి, ఆయన బాడీ లాగ్వేంజ్ తగినట్టు ఉంటుంది.

  నాకు ఎలాంటి లోపాలు లేవు

  నాకు ఎలాంటి లోపాలు లేవు

  గత మారుతి సినిమాలో మాదిరిగా నాకు ఎలాంటి శారీరక లోపాలు ఉండవు. ఈ సినిమాలో ఇగో అనేది కీలకమైన పాయింట్. ఇగో ఉండటం వల్ల రిలేషన్స్ పాడువుతాయి. ఇగో లేకపోతే జీవితం ఎలా హ్యాపీగా ఉంటుంది అనే విషయాన్ని కథగా చెప్పాం.

  ఇగో ఉన్న వ్యక్తుల మధ్య

  ఇగో ఉన్న వ్యక్తుల మధ్య

  శైలజారెడ్డి చిత్రంలో నా పాత్ర ఏంటంటే.. అప్పడే చదువు అయిపోయి మా నాన్న కంపెనీలో పనిచేస్తుంటాను. నాన్నకు ఉండే ఇగోతో బాధపడుతాను. ఇలాంటి క్రమంలో అలాంటి ఇగో ఉన్న అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆమె తల్లికి ఉండే ఇగో వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాననే అంశాలతో ఉంటుంది.

   ప్రేమలో పడితే భరించాల్సిందే

  ప్రేమలో పడితే భరించాల్సిందే

  నిజ జీవితంలో ఇగో ఉన్న వ్యక్తి తారసపడితే భరించాల్సిందే. ఒకసారి ప్రేమలో పడితే అందంతా భరించాల్సి ఉంటుంది. ఓ లెవెల్ వరకు ఉంటే దానిని భరించవచ్చు. దాని వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతాయి.

   రమ్యకృష్ణతో పనిచేయడం

  రమ్యకృష్ణతో పనిచేయడం

  రమ్యకృష్ణ గారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. కానీ షూటింగ్ ఆరంభంలో ఆమె ముందు నటించాలంటే కొంత భయమేసింది. కానీ ఆమె చాలా ఎంకరేజ్ చేశారు. క్లైమాక్స్‌లో భారీ డైలాగ్స్‌తో ఇద్దరి మధ్య పోటాపోటీగా సీన్లు ఉంటాయి.

  అనుకోకుండా పోటి

  అనుకోకుండా పోటి

  సమంత నటించిన యూటర్న్ సినిమా ముందుగా, శైలజారెడ్డి అల్లుడు ఒకే రోజున రిలీజ్ కావడం కావడం చాలా ఆసక్తిని పెంచింది. వాస్తవానికి వారు రెండు నెలల ముందే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకొన్నారు. మేమే ఈ డేట్‌ను ఎంచుకొని మధ్యలో దూరాం. ఇంట్లో ఈ విషయాన్ని చెప్పినప్పుడు సమంత ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఈ పండుగకు మా ఇద్దరి సినిమాలు సక్సెస్ అందిస్తాయని అనుకొంటున్నా అని చైతూ అన్నారు.

   అందులో నా తప్పు కూడా ఉంది

  అందులో నా తప్పు కూడా ఉంది

  నా జీవితంలో చేదు అనుభవాలను మిగిల్చిన సినిమాలు దడ, బెజవాడ అని చెప్పారు. వాటికి ఎవరినీ బాధ్యుల్ని చేయను. అందులో నా తప్పుకూడా ఉంది. ఫెయిల్యూర్‌ను ఒకరికి ఆపాదించడం సరికాదు. నేను ఒప్పుకొన్నానంటే అందులో నా బాధ్యత కూడా ఉంటుంది అని నాగచైతన్య తెలిపారు.

  English summary
  Shailaja Reddy Alludu starring Naga Chaitanya, Ramya Krishnan and Anu Emmanuel, Directed by Maruthi has completed its entire Shoot (except one song) and gearing up for August 31st Release. The film is produced by Naga Vamsi S & PDV Prasad under Sithara Entertainments, Presented by S. Radha Krishna(Chinababu). In this occassion, Naga Chaitanya speak to Telugu filmibeat exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X