నార్త్, సౌత్ విభేదాలపై నాగచైతన్య గ్రేట్ రెస్పాన్స్.. చైతూ రియాక్షన్‌పై ఫిదా కావాల్సిందే..
హాలీవుడ్ ఫారెస్ట్ గంప్ చిత్రం ఆధారంగా రూపొందిన లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. అమీర్ ఖాన్, నాగచైతన్య, కరీనా కపూర్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో లాల్ సింగ్ చడ్డా సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండటం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా యువ హీరో అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ..

సౌత్, నార్త్ విభేదాలపై నాగ చైతన్య స్పందిస్తూ.. నేను పాన్ ఇండియా సినిమాగానే నమ్ముతున్నాను. టెక్నాలజీ పెరగడం, ఓటీటీ, యూట్యూబ్ రావడం వల్ల మీకు సౌత్ సినిమాల గురించి ఎక్కువగా తెలుస్తున్నాయి. తెలుగు సినిమాలను దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడం వల్ల మరింత తెలిసింది. కానీ మేము ఎప్పటి నుంచో ఇలాంటి సినిమాలు తీస్తున్నాం. ఇండియన్ సినిమాను ప్రపంచం గుర్తిస్తున్నది. నేను తెలుగు, తమిళ సినిమాలంటే ఇష్టం. లాల్ సింగ్ చడ్డా సినిమా సక్సెస్ అయితే బాలీవుడ్‌లో సినిమాలు చేయడం గురించి ఆలోచిస్తున్నాను.
నాకు స్పెషల్ క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను స్పెషల్ క్యారెక్టర్స్ చేయలేదు. లాల్ సింగ్ చడ్డాలోనే స్పెషల్ క్యారెక్టర్ చేయడం తొలిసారి. ఇకముందు కూడా ఇలాంటి మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. అయితే అమీర్ ఖాన్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. అయన పక్కన చేసిన వారంతా కచ్చితంగా షైన్ అవుతారు. అమీర్ ఖాన్ సినిమాను గమనిస్తే ప్రతీ ఒక్క క్యారెక్టర్ కూడా హైలెట్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ తో పాటు ఆయన పక్కన ఉన్న నా క్యారెక్టర్‌కు కూడా మంచి గుర్తింపు వస్తుంది అని చైతూ తెలిపారు.


Click it and Unblock the Notifications











