సమంత చేతిలో ఓడిపోయా.. అంతా గందరగోళం.. నాగచైతన్య
పెళ్లి తర్వాత సమంత అక్కినేని, నాగచైతన్య హ్యాపీగా కాలం గడిపేస్తున్నారు. కానీ ఇటీవల ఓ విషయంలో పోటీపడటం మీడియాలో చర్చనీయాంశమైంది. పెళ్లి తర్వాత వారిద్దరూ నటించిన చిత్రాలు యూటర్న్, శైలజారెడ్డి అల్లుడు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. అయితే ఆ విషయంలో కొంత గందరగోళం నెలకొన్నది. ప్రస్తుతం సమంత, చైతూ ఇద్దరూ కలిసి శివ నిర్వాణ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా నవంబర్ 2న విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో చైతూ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

సమంతతో మ్యారేజ్ తర్వాత
పెళ్లి తర్వాత మంచి మనిషిగా మారాను. వ్యక్తిత్వంలో పరిపూర్ణత లభించింది. పెళ్లికి ముందు పురుషుడు అసంపూర్ణంగా ఉంటాడు. పెళ్లి పరిపూర్ణతను తెస్తుంది. అది నా విషయంలోనూ జరిగింది. లైఫ్ హ్యాపీగా ఉండటంతో బ్యాలెన్స్‌గా మారింది. షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ మేమిద్దరం కలిసి ఉండేలా ప్లాన్ చేసుకొంటాం. మా మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకొంటాం అని నాగచైతన్య చెప్పారు.

శివ నిర్వాణ డైరెక్షన్‌లో
పెళ్లి తర్వాత నేను, సమంత కలిసి దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో నటిస్తున్నాం. ఈ సినిమాలో భార్యభర్తలుగా నటిస్తున్నాం. షూటింగ్‌లో భార్య భర్తలుగా కాకుండా యాక్టర్లుగానే యాక్టింగ్ చేస్తున్నాం. ఎందుకంటే స్టోరీలో చాలా గొడవలు ఉంటాయి. నిజజీవితంలో గొడవలు లేవు కాబట్టి.. మేమిద్దరం కథ ప్రకారం నటిస్తున్నాం.

శివ నిర్వాణ గురించి చైతూ..
దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఉన్న డైరెక్టర్. చాలా మెచ్చురిటీ ఉంది. ఆయన న్యూఏజ్ డైరెక్టర్. ఆయన ఆలోచనలు, సలహాలు బాగున్నాయి. ఇప్పటికీ 18 రోజుల షూటింగ్ జరిగింది. వేసవిలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కాలేదు.

ఒకేరోజు రిలీజ్ కావడం
పెళ్లి తర్వాత సమంత నటించిన యూటర్న్, నా సినిమా శైలజారెడ్డి అల్లుడు ఒకే రోజు విడుదలయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో అంతా గందరగోళం ఉండేది. నా సినిమా షూట్ రోజున నీ సినిమా రిలీజ్ ఎందుకు చేస్తున్నావని కోపం తెచ్చుకొన్నది. ఆ తర్వాత అంతా సర్దుకున్నది.

సమంత నాపై అలా గెలిచింది..
శైలజారెడ్డి, యూటర్న్ పోటీలో ఎవరం గెలిచామని చెప్పడం చాలా కష్టం. నా సినిమాతో పొల్చుకొంటే యూటర్న్ సినిమా రివ్యూలతో విషయంలో గెలిచింది. సమంత సినిమాపై శైలజారెడ్డి అల్లుడు కలెక్షన్ల పరంగా విజయం సాధించింది అని ఓ ప్రశ్నకు నాగచైతన్య జవాబిచ్చారు.


Click it and Unblock the Notifications











