ఆ ముగ్గురి మధ్య నలిగిపోయా.. జరిగిన ఆ తప్పులను సరిదిద్దుకొంటాను.. నాగ చైతన్య (ఇంటర్వ్యూ)
యువ సామ్రాట్ నాగచైతన్య, గ్లామరస్ హీరోయిన్ కృతిశెట్టి నటించిన తాజా చిత్రం కస్టడీ. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. పోలీస్ కథా నేపథ్యంతో అండర్ డాగ్ క్యారెక్టర్‌లో నాగచైతన్య నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే మంచి అంచనాలు పెంచుకొన్నది. ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పించారు. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరో నాగచైతన్య తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
నా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర: కస్టడీ సినిమా చూశాను. వెంకట్ ప్రభు ఏదైతే కథ చెప్పాడో. అతడు చెప్పినట్టే సినిమాను తీశాడు. నాకు బాగా నచ్చింది. కానీ ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వెయిట్ చేయాలి. ప్రతీ సినిమా ఒక అనుభూతి. కస్టడీ సినిమా డిఫరెంట్ కథ. నా కెరీర్‌లో గుర్తుంచుకునే క్యారెక్టర్. కథ వరకే పరిమితమయ్యాం. కమర్షియల్ అంశాల కోసం మేము ప్రయత్నించలేదు. నిజాయితీగా కథ చెప్పడానికి ప్రయత్నించాను అని నాగచైతన్య చెప్పారు.

ఆయన స్క్రీన్ ప్లే అలాంటి కిక్: దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. మనాడు సినిమా చూస్తే ఆయన రాసే స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో మీకే అర్ధమవుతుంది. క్యారెక్టర్ రైజ్ చాలా బాగుంటుంది. సినిమా ముగిసే సమయానికి తెలుగు ఆడియెన్స్ పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఒక కన్‌ఫ్యూజ్ ఉండే పాయింట్‌ను చాలా ఈజీగా రాశారు అని నాగచైతన్య చెప్పారు.

అరవింద్ స్వామితో నటించడం గురించి: కస్టడీ మూవీలో అరవింద్ స్వామితో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతి. ఆయన నుంచి చాలా నేర్చుకొన్నాను. స్క్రిప్టును ఒప్పుకొంటే ఆయన పాత్రను ఈజీగా చేయరు. ప్రతీ నిమిషం తన క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వంట చేస్తూ తన క్యారెక్టర్, సినిమా గురించి ఆలోచిస్తుంటారు అని నాగచైతన్య అన్నారు.

లవ్ స్టోరీలు చేసుకొంటూ వెళితే: ఒక సినిమా చేస్తే నాకు వర్కవుట్ అవుతుందా? లేదా అనేది ఆలోచించను. ఒక తరహా సినిమాలు చేయడానికి నేను ఇష్టపడను. లవ్ స్టోరిలు వర్కవుట్ అయ్యాయి. కానీ కంటిన్యూగా నేను లవ్ స్టోరీలు చేస్తే రొటీన్ అయిపోతుంది. కాబట్టి నేను డిఫరెంట్ క్యారెక్టర్లను, కథలు ఎంచుకొంటున్నాను. నా కంటూ ఇమేజ్ ఉండదు. శివ క్యారెక్టర్ అలా పెరిగిపోతుంటుంది. శివ క్యారెక్టర్ స్టార్టింగ్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఫీల్ ఉంటుంది. కానీ శివ క్యారెక్టర్‌ను చూస్తే సెకండాఫ్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ఫైర్ కనిపిస్తుంది అని నాగచైతన్య చెప్పారు.

తమిళంలో డబ్బింగ్ చెప్పాలని: సాధారణంగా తెలుగు సినిమాలకు డబ్బింగ్ చెప్పడానికి వారం నుంచి 10 రోజులు తీసుకొంటాను. కానీ కస్టడీ సినిమా రెండు భాషల్లో తీయడం వల్ల తమిళంలో కూడా నేను డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాను. అయితే తమిళం నాకు వచ్చు కాబట్టి.. ఈ సినిమా కోసం దాదాపు 1 నెలపాటు డబ్బింగ్ చెప్పాను. ఒక యాక్టర్ సొంత గొంతు వింటే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతారు. తమిళ డబ్బింగ్ విషయంలో కొన్ని తప్పులు ఉంటాయి. ఇది తొలి సినిమా కాబట్టి ముందు ముందు తప్పులను సరిద్దిద్దుకొంటాను అని నాగచైతన్య చెప్పారు.

ఆ ముగ్గురి మధ్య నలిగాను: కస్టడీ సినిమాలో శరత్ కుమార్, అరవింద్ స్వామి, ప్రియమణి క్యారెక్టర్ల మధ్య నలిగిపోయే సాధారణ కానిస్టేబుల్ కథ. ముగ్గురు పవర్‌ఫుల్ క్యారెక్టర్ల మధ్య నలిగిపోయే పాత్ర కోసం బరువు తగ్గాను. లుక్ వైజ్ జాగ్రత్తలు తీసుకొన్నాను. కథ చెప్పేటప్పుడే వెంకట్ ప్రభు గారు.. మూడు పాత్రల మధ్య నలిగిపోయే క్యారెక్టర్ అని చెప్పారని నాగచైతన్య తెలిపారు.
కస్టడీ చిత్రం తెలుగు, తమిళంలో వస్తుండటంతో రెండు భాషల్లో ప్రమోషన్స్‌తో కొంత అలసటగా అనిపిస్తుంది. పాన్ ఇండియా సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొన్నాను. అమీర్ ఖాన్‌తో లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. ఆ ప్రమోషన్ గేమ్ వేరేలా ఉంటుంది.

ప్రతీ సినిమాకు నేను వర్క్ షాప్ చేస్తాను. స్క్రిప్టు రీడింగ్ చేస్తుంటాను. కస్టడీ సినిమాకు చాలా మంది పోలీస్ ఆఫీసర్లను కలిసి చాలా విషయాలు తెలుసుకొన్నాను. వెంకట్ ప్రభు కూడా వర్క్‌షాప్‌కు రెడీగా ఉండటంతో క్యారెక్టర్ మూడ్ తగినట్టుగా మారిపోవడం సులభం అయింది. పోలీసులను కలిసిన తర్వాత వారి కష్టాలను విని చాలా మొటివేట్ అయ్యాను. నాకు తమిళంలో కాక కాక, నాన్న గారి శివమణి చిత్రాలు నాకు ఇష్టం అని నాగచైతన్య తెలిపారు.
మనాడు సినిమా రిలీజ్‌కు ఆరు నెలల ముందు వెంకట్ ప్రభును కలిశాను. అప్పుడే స్క్రిప్టు ఒకే అయ్యింది. అయితే కొందరు నిర్మాతలు మనాడు రీమేక్‌లో నటించమని అడిగారు. కానీ కస్టడీ సినిమా చేయాల్సి ఉండటంతో ఆ సినిమా గురించి ఆలోచించకపోయాను.


Click it and Unblock the Notifications











