twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Laal Singh Chaddha కొత్త మార్కెట్‌లోకి ఎంట్రీ, అందుకే ఆ టెన్షన్: బాలరాజుపై నాగచైతన్య క్లారిటీ

    |

    వయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీనటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లాల్ సింగ్ చడ్డా. అమీర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా నిర్మించారు. హాలీవుడ్‌ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో నాగచైతన్య మాట్లాడుతూ..

     కల అలా నిజమైందనిపించింది

    కల అలా నిజమైందనిపించింది

    ఒకరోజు లాల్ సింగ్ చడ్డా సినిమా కాస్ట్ టీమ్ నుంచి ఫోన్ వచ్చింది. అయితే నేను నమ్మలేదు. సాయంత్రం అమీర్ ఖాన్ వీడియో కాల్ చేశారు. నాతో అరగంట పాటు మాట్లాడాను. ఆ రాత్రి దర్శకుడు అద్వైత్ చందన్ ఫోన్ చేసి పూర్తి స్క్రిప్టును నేరేట్ చేశారు. అప్పుడు నాకు కల నిజమైందనే ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత వారం రోజుల అనంతరం అమీర్ ఖాన్ కలిశాను. అప్పుడు నాకు సీనిమా చేస్తున్నాననే ఫీలింగ్ కలిగింది అని నాగచైతన్య తెలిపారు

     కార్గిల్‌లో, రాజమండ్రిలో షూట్

    కార్గిల్‌లో, రాజమండ్రిలో షూట్


    నాకు అమీర్ ఖాన్ ఫోన్ చేసినప్పుడు.. ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదని చెప్పారు. క్యారెక్టర్‌ 30 నిమిషాలు నిడివి ఉంటుంది. స్క్రిప్టు చదివి మీరు నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. అయితే స్క్రిప్టు చదివిన తర్వాత బాల రాజు క్యారెక్టర్ సినిమాను మొత్తం నడిపించే క్యారెక్టర్. తెలుగు వాళ్లను దృష్టిలో పెట్టుకొని నా క్యారెక్టర్‌కు బాలరాజు అని పేరు పెట్టారు. చాలా వరకు కార్గిల్‌లో సినిమాను షూట్ చేశారు. కొంత మేరకు రాజమండ్రికి వచ్చి అమీర్ ఖాన్ షూట్ చేశారు అని నాగచైతన్య చెప్పారు.

     అమీర్ ఖాన్ కష్టపడి డబ్బింగ్ చెప్పించారు

    అమీర్ ఖాన్ కష్టపడి డబ్బింగ్ చెప్పించారు


    లాల్ సింగ్ చడ్డాను స్పెషల్‌గా మెగాస్టార్ చిరంజీవి ప్రమోట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అమీర్ ఖాన్‌ కోరగానే.. వెంటనే ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఇండియన్ హిస్టరీలో జరిగిన సంఘటనలను ఈ సినిమా కథలో చేర్చారు. ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు. తెలుగు వెర్షన్ కోసం స్వయంగా అమీర్ ఖాన్ కష్టపడి డబ్బింగ్ చెప్పించారు. లాల్ సింగ్ చడ్డా చిత్రం 1970 నుంచి ప్రీ పాండమిక్ వరకు కథ సాగుతుంది. నా ఫస్ట్ సినిమా అయితే ఎలా ఉంటుందో అలాంటి టెన్షన్ ఉంది. నేను కొత్త మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాను. మీరంతా వచ్చి థియేటర్‌లో సినిమా చూడాలని కోరుతున్నాను అని నాగచైతన్య అన్నారు.

    లాల్ పాత్ర గురించి నాగచైతన్య

    లాల్ పాత్ర గురించి నాగచైతన్య


    బాలీవుడ్‌లోకి ప్రవేశించడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. కొత్త మార్కెట్‌లో ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకొంటారనే కొంత నర్వెస్ కూడా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం కొత్తగా ఉంది. ప్రత్యేకమైన గెటప్ ఉంటుంది. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నేను కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చేసేటప్పుడు నేను యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లినట్టు అనిపించింది. లాల్ క్యారెక్టర్ ఎన్ని కష్టాలు వచ్చినా బయటకు వ్యక్తం చేశారు. లాల్ క్యారెక్టర్ ప్రతీ ఒక్కరిని టచ్ చేస్తుంది అని నాగచైతన్య చెప్పారు.

    బాలరాజు పాత్ర పేరు గురించి

    బాలరాజు పాత్ర పేరు గురించి


    మా తాత గారి సినిమా పేరు బాలరాజు. ఆ పేరుతో నేను క్యారెక్టర్‌తో సినిమా చేయడం చాలా స్పెషల్‌గా, మ్యాజిక్‌గా అనిపించింది. సినిమా ప్రారంభానికి ముందు రకరకాల పేర్లను ఆలోచించారు. చివరకు అమీర్ ఖాన్, అద్వైత్ చందన్ బాలరాజు పేరును ఫిక్స్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు తాతగారి సినిమా టైటిల్ అని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమాకు తాతగారి ఆశీర్వాదం కూడా ఉండటం హ్యాపీగా ఉంది అని నాగచైతన్య అన్నారు.

    English summary
    Bollywood Super Star Aamir Khan's Laal Singh Chaddha releasing on August 11th. Here is the media interaction highlights of Naga Chaitanya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X