ఒక్క సినిమాతో సూపర్‌స్టార్ అంటే ఎలా.. విజయ్ దేవరకొండను అనలేదు.. హీరో నాగశౌర్య

By Rajababu

హీరోగా భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్న నాగ శౌర్య ఇప్పుడిప్పుడే కమర్షియల్ హీరోగా ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. చలో సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆయన తాజాగా @నర్తనశాల అనే చిత్రంతో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో కశ్మీరా పరదేశి, యామిని భాస్కర్ జంటగా నటించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూల్పూరి నిర్మిస్తున్న @ నర్తనశాల చిత్రంతో కొత్త దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి పరిచయం అవుతున్నారు. ఈ నెల 30న విడుదల అవుతున్న సందర్బంగా హీరో నాగశౌర్యతో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యంగా ప్రస్తుతం సమాజంలో మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. అందుకే మహిళలు ధైర్యంగా ఉండాలి .. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా పోరాడాలి అని నా పాత్ర ద్వారా చెప్పిస్తున్నాం అని అన్నారు.

కొత్త దర్శకులతో పనిచేయడం

కొత్త దర్శకులతో పనిచేయడం

కొత్త దర్శకులను పరిచయం చేయడం చాలా యాదృచ్చికంగా జరుగుతున్నది. వారు చెప్పిన కథలు కొత్తగా ఉండటం, అవి నచ్చి వారితో సినిమాలు తీయాల్సి వచ్చింది. ఈ ఏడాది నాలుగు సినిమాలు విడుదల కావడం అలా జరిగిపోయింది. ఎందుకంటే అమ్మగారిల్లు, కణం సినిమాలు ఎప్పుడో విడుదల కావాల్సినవి .. కానీ ఈ ఏడాది వచ్చాయి .. ఆ తరువాత చలో, ఇప్పుడు నర్తనశాల అలా కుదిరాయి అని నాగశౌర్య అన్నారు.

Recommended Video

Pre Release Business of Narthanasala
నర్తనశాల చిత్ర కథ ఇదే

నర్తనశాల చిత్ర కథ ఇదే

నర్తనశాల చిత్రంలో నాది తేడా (గే) క్యారెక్టర్. అలాంటి అబ్బాయిని అనుకోకుండా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించడం .. వారి మధ్య కథ ఎలాంటి మలుపులు తిరిగింది వారి మధ్య జరిగే సంఘటనలే నర్తనశాల. చాలా కొత్తగా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. అసలు అతడు నిజంగా గే నా కదా అన్నదే అసలు సినిమా. దర్శకుడు ఈ పాత్ర గురించి చెప్పగానే కథ చాలా కొత్తగా ఉంది .. గే పాత్ర అయినా అది కథలో కీలకంగా ఉంటుంది కాబట్టి .. ఈ పాత్ర చేయడానికి ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. అందుకే చేశా. పైగా ఎవరిని కించపరిచే విధంగా ఉండదు అని నాగశౌర్య వెల్లడించారు.

వివాదం లేకుండా టైటిల్ ..

వివాదం లేకుండా టైటిల్ ..

కథ ప్రకారం నర్తనశాల అన్నది కరెక్ట్ టైటిల్ అని మీరు అంటారు .. ఇక వివాదాలాంటివి ఏమీ లేవు .. అయితే నర్తనశాల అని టైటిల్ పెట్టి తీసిన సినిమాలు ఆగిపోయాయని తెలుసుకున్నాం .. అందుకే నర్తనశాల ముందు ఎట్ అని పెట్టాం అని నాగశౌర్య తెలిపారు.

మహిళలను ధైర్యంగా

మహిళలను ధైర్యంగా

ముఖ్యంగా ప్రస్తుతం సమాజంలో మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. అందుకే మహిళలు ధైర్యంగా ఉండాలి .. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా పోరాడాలి అని నా పాత్ర ద్వారా చెప్పిస్తున్నాం. ఈ రోజుల్లో నిజంగా మహిళలపై చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అందుకే వారికి ధైర్యం అవసరం అన్న అంశం ఉంటుంది .. పైగా అది కథ మొత్తం దానిచుట్టే జరగదు .. ఓ సందర్భంలో చెప్పడం జరిగింది.

స్టార్ ఇమేజ్ అంటే ఒక్క సినిమాతో

స్టార్ ఇమేజ్ అంటే ఒక్క సినిమాతో

నిజంగా స్టార్ ఇమేజ్ అనేది అది ఒక్క రోజులో రాదు అన్ని నా ఫీలింగ్. ఎందుకంటే స్టార్ ఇమేజ్ అంటే ఎన్టీఆర్, మెగాస్టార్, లాంటి వారిని చూసాం .. వాళ్ళు ఆ ఇమేజ్ అందుకోవడానికి 30 ఏళ్ళు పట్టింది .. మనం ఒకటో రెండో సినిమాలు చేసేసి సూపర్ స్టార్స్ అనుకోవడం కరెక్ట్ కాదని నా నమ్మకం. ఉదాహరణకు పవర్ స్టార్ సినిమా ఫ్లాప్ అయినా కూడా 80 కోట్లు వసూలు చేస్తుంది. ఇమేజ్ అంటే అది .. అంతే తప్పా నేను ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఏది అనలేదు. నా వ్యాఖ్యలు విజయ దేవరకొండను ఉద్దేశించి చేసినవి కాదు అని అన్నారు.

దర్శకుడు, హీరోయిన్స్ గురించి

దర్శకుడు, హీరోయిన్స్ గురించి

దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి మంచి కథను చెప్పాడు. కథలో చాలా కొత్తదనం ఉంది .. పైగా ఆయనకు కథ మీద మంచి గ్రిప్ ఉంది. అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. అలాగే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఒకరు పూణేకు చెందిన అమ్మాయి కశ్మీరా పరదేశి .. ఇంకొకరు యామిని భాస్కర్ మన తెలుగమ్మాయి. రెంటు పాత్రలు బాగుంటాయి. ఇద్దరు బాగా చేశారు కూడా.

త్వరలోనే పెళ్లి చేసుకొంటా

త్వరలోనే పెళ్లి చేసుకొంటా

ప్రతీ ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్న వస్తుంది. త్వరలోనే ఎవరినో ఒకరిని చూసుకుని చేసుకుంటా. ప్రస్తుతం రాజా అనే కొత్త దర్శకుడితో భవ్య క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. షూటింగ్ జరుగుతున్నది. దాంతోపాటు రమణ తేజ అనే దర్శకుడితో మా సొంత బ్యానర్ లోనే మరో సినిమా ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X