twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే కొత్తవాళ్లతో.. మాటిచ్చాననే ఆ సినిమా చేశాను.. నాగశౌర్య కామెంట్స్

    |

    యంగ్ హీరో నాగశౌర్య ఛలో సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఆపై చేసిన కణం, నర్తనశాల వంటి చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ట్రాక్ మార్చి మాస్ అండ్ యాక్షన్ హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లుక్, బాడీ లాంగ్వేజ్ అన్ని మార్చేసి అశ్వథ్థామ అనే థ్రిల్లర్ మూవీని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. సినిమా విడుదలకు దగ్గరపడుతుండటంతో నాగ శౌర్య మీడియాతో ముచ్చటిస్తూ.. అనేక విషయాలను వెల్లడించాడు.

    అన్నింటిపై అవగాహన..

    అన్నింటిపై అవగాహన..

    అశ్వథ్థామ స్క్రిప్ట్‌ రాస్తున్నప్పుడే తనకు అన్నింటిపై అవగాహన వచ్చిందని అన్నాడు. సమాజం ఎలా ఉంటుంది? కొడుకు ఎలా ఉండాలి? మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? ఇలా ప్రతీ విషయంలో అవగాహన వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఫలితం ఎలా ఉన్నా సరే ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు. అందుకే ఈ సినిమా పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నానని తెలిపాడు.

     అన్ని పాత్రలకు ప్రాముఖ్యం..

    అన్ని పాత్రలకు ప్రాముఖ్యం..

    హీరో పాత్ర ఒక్కటే బాగుంటే సినిమా ఆడుతుందని తాను అనుకోనని తెలిపాడు. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉండాలని, ముఖ్యంగా విలన్ పాత్ర ఎంత బాగుంటే.. హీరోయిజం అంత ఎలివేట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందని, ఏ పాత్ర కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదన్నాడు.

     అందుకే కొత్తవాళ్లతో..

    అందుకే కొత్తవాళ్లతో..

    అశ్వథ్థామకు పని చేసిన వారందరూ కొత్తవాళ్లేనని అన్నాడు. అందరికీ ముప్పైలోపే ఉంటుందని, తాను కూడా కొత్తగా ఉన్నప్పుడు అవసరాల శ్రీనివాస్ అవకాశమిచ్చాడని గుర్తు చేసుకున్నాడు. తాను కూడా చేయగలిగిన స్థాయిలో ఉన్నప్పుడే చేయకపోతే ఎలా అని అన్నాడు. అందుకే టాలెంట్ ఉన్న వారికి అవకాశమిచ్చే ప్రయత్నం చేశానని తెలిపాడు.

    Recommended Video

    Naga Shaurya Emotional On Stage | Aswathama Trailer | Aswathama Pre Release Event
    మాటిచ్చాననే నర్తనశాల..

    మాటిచ్చాననే నర్తనశాల..

    మాటిచ్చాననే నర్తనశాల సినిమాను చేశానని చెప్పుకొచ్చాడు. ఆ దర్శకుడు 2010లో కథ చెప్పాడని, అప్పుడు ఆ సినిమా చేస్తానని మాటిచ్చానని చెప్పుకొచ్చాడు. తాను ప్రొడక్షన్ హౌస్ పెట్టాక 2017లో వచ్చి అడిగాడు.. అందుకే చేశానని పేర్కొన్నాడు. సినిమాపై తనకు కూడా నమ్మకం లేదని, అయినా సరే మాటిచ్చాను కాబట్టి చేశానన్నాడు.

    English summary
    Naga Shaurya In Aswathama Promotions. He Reveals Secret Behind Narthanasala Movie. Asawathama Is Going To Be Released On 31st January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X