హిట్టైనా.. ఫ్లాపైనా ఇక్కడే ఉంటా.. లైట్ బాయ్‌గానైనా పనిచేస్తా.. రంగబలి గురించి నాగశౌర్య ఎమోషనల్

దసరా, విరాటపర్వం లాంటి చిత్రాలను నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా పవన్ బాసమ్‌శెట్టి దర్వకత్వంలో రూపొందిన చిత్రం రంగబలి. యువ హీరో నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, బ్రహాజీ, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రం ఇప్పటికే అన్ని వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఈ సినిమా జూలై 7వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ..

సాధారణంగా నా సినిమాలు రిలీజ్ అవుతుంటే కాన్ఫిడెన్స్‌గా ఉంటాను. కానీ రంగబలి సినిమా రిలీజ్‌కు ముందు చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. కానీ కారణం ఏమిటో నాకు తెలియదు. ఒక మంచి జరుగుతుంటే మనం ఆనందంగా ఉంటాం. ఈ సినిమా చూసిన తర్వాతే నేను ప్రమోషన్స్‌లో పాల్గొంటానని చెప్పాను. నేను రంగబలి సినిమా చూశాను. చాలా హ్యాపీగా ఉంది. ఆ ఆనందం నా ముఖంలో కనిపిస్తున్నది. నా కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది అని నాగశౌర్య తెలిపారు.

Naga Shaurya Interview about Rangabali

కొన్ని సినిమాలు చూడకుండానే ప్రమోషన్స్ చేశాను. రిలీజ్ డేట్ వరకు సినిమా పూర్తి కాదు. ఎడిటింగ్, సీజీ లాంటి వర్క్స్ జరుగుతుంటాయి. కాబట్టి పూర్తి సినిమా చూడటానికి కుదరదు. లక్కీగా ఈ సినిమా చూసే అవకాశం లభించింది. అందుకే నేను చాలా కన్ఫిడెన్స్‌గా ఉన్నాను అని నాగశౌర్య చెప్పారు.

ప్రతీ ఊరిలో ఎవరికి వారే తోపు అనుకొంటాడు. ఆ ఊరికి ఓ పెద్ద ఉంటాడు. గ్రామ పెద్ద తెలిసిన వాడు తోపుగా ఫీలవుతాడు. ఓ గ్రామంలో తోపులా ఫీలయ్యే యువకుడు కథ. మంచి నేటివిటి ఉన్న సినిమా. ఇది వంగవీటి రంగా జీవితం ఆధారంగా చేసిన కథ కాదు. ఈ కథ వేరేది. సినిమా చూస్తే రంగబలి టైటిల్ ఎంత యాప్ట్‌ మీకు అర్ధమవుతుంది అని నాగశౌర్య తెలిపారు.

దర్శకుడు పవన్ నాకు ఏదైతే కథ చెప్పాడో.. అదే కథను కచ్చితంగా తీసి చూపించాడు. చెప్పింది చెప్పినట్టే తీశాడని చెబుతున్నాను. గతంలో నాకు చెప్పిన కథ ఒకటి.. అవుట్‌పుట్ వేరేలా ఉండేది. ఇక్కడ ఎవరినీ తప్పు పట్టలేం. కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాలి. ప్రతీ సినిమాకు ఇలానే జరుగాలనే నేను కోరుకొంటాను. నా సినిమాల విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. ఎక్కడ జరిగాయో నాకు తెలుసు అని నాగశౌర్య చెప్పారు.

Naga Shaurya Interview about Rangabali

డైరెక్టర్ పవన్‌తో రంగబలి సినిమాకు పనిచేసినప్పుడు చాలా ప్రశాంతంగా పని చేశాను. పవన్‌తో ఒక్క మాట చెప్పాను. మీకు ఏదైనా ప్రాబ్లెం ఉంటే నాకు ఏ సమయంలోనే కాల్ చేసి చెప్పండి. కానీ ఆ ప్రాబ్లెంతో మీరు సినిమా విషయంలో టెన్షన్ పడకండి. నాకు అనుభవం ఉంది. ఎక్కడ తప్పు జరుగుతుందో నాకు తెలుస్తుంది. కాబట్టి నేను మీకు సలహా ఇచ్చేందుకు తోడ్పడుతానని చెప్పాను. అలా మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడి మంచి సినిమాను మీ ముందుకు తెస్తున్నాం అని నాగశౌర్య చెప్పారు.

నా కెరీర్‌లో 23 సినిమాలు చేస్తే.. 18 మంది కొత్త డైరెక్లర్లతో పనిచేశాను. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఫాప్ అయితే.. నా నిర్ణయం తప్పని భావించను. హిట్ అయితే నా నిర్ణయం కరెక్ట్ అని అనుకోను. సినిమా హిట్, ఫ్లాప్‌ అనేది టైమ్‌ను బట్టి డిసైడ్ అవుతుంది. హిట్ అయినా.. ఫ్లాప్ అయినా నేను ఇక్కడే ఉంటాను. చివరకు లైట్ బాయ్‌గా కూడా పనిచేస్తూ ఇక్కడే ఉంటాను అని నాగశౌర్య అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X