Rangabali సక్సెస్ కోసం ప్రాణాలకు తెగిస్తా.. రాజమౌళి వల్లే ఆ పరిస్థితి.. నాగశౌర్య (ఇంటర్వ్యూ)
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా పవన్ బాసమ్‌శెట్టి దర్వకత్వంలో రూపొందిన చిత్రం రంగబలి. యువ హీరో నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, బ్రహాజీ, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రం జూలై 7వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ..
ప్రతీ సినిమాకు బెస్ట్ ఇవ్వాలని కోరుకొంటాను. జనం మెప్పించడానికి నేను ఎంత వరకైనా వెళ్తాను. సినిమా పరిశ్రమలో అద్బుతమైన సినిమాలు వస్తున్నాయి. ఎక్స్‌ట్రార్డినరీగా స్క్రిప్టులు వస్తున్నాయి. హీరోలు కండలు పెంచి సిక్స్ ప్యాక్ చేస్తున్నారు. డ్యాన్సులు వేస్తున్నారు. తెలుగు సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియాలోనే టాప్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా బెస్ట్ ఇవ్వాలని కోరుకొంటాను.

అందుకే రంగబలి సినిమా కోసం కొంత రిస్క్ చేశాను. దాని వల్ల ఆరోగ్యం క్షీణించి సెట్లో కిందపడిపోయాను. పాత్ర కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. కాళ్లు చేతులు విరుగుతాయి.. ఇంట్లో కూర్చొంటా.. డైలాగ్స్ మాత్రమే చేస్తాను. సక్సెస్ నా ఇంటికి రావాలి అంటే కుదరదు అని నాగశౌర్య చెప్పారు.
నాగశౌర్య ఆ పాత్రలకే పరిమితం అవుతాడు అని ఎవరైనా నన్ను జడ్జ్ చేయడం నాకు నచ్చదు. మహేష్ బాబు, ప్రభాస్‌కు కూడా అలాంటి విమర్శలు వచ్చాయి. కానీ వాటిని ఎదురించి ఒక్కడు, పోకిరి, ఒక బాహుబలి, RRR లాంటి సినిమాలు వచ్చాయి. ఇమేజ్‌కు ఎదురెళ్లి సినిమా చేస్తే ఫలితాలు అలా ఉంటాయి. నేను బిగ్ డైరెక్టర్ నాతో సినిమా చేయాలని వెంటనే రెడీ అవుతాను అని నాగశౌర్య అన్నారు.
సొంతంగా ప్రొడక్షన్ చేయడం రిస్కే. పది సినిమాలు హిట్స్ అయినా.. ఒక్క సినిమా భారీ ఫ్లాప్ అయితే తేరుకోవడం కష్టం. అయినా మేము సినిమాలు తీస్తూనే ఉంటాం. మాకు సినిమా అంటే పిచ్చి. పిచ్చి ఎక్కువై సినిమాలు తీస్తాం. కేవలం డబ్బులు సంపాదించడానికి సినిమాలు తీయడం లేదు. మమల్ని సినిమా పిచ్చోళ్లు అన్నా నేను పట్టించుకోను అని నాగశౌర్య ఎమోషనల్ అయ్యారు.

సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల నా మార్కెట్ దెబ్బ తిన్నదనే విషయాన్ని నేను ఒప్పుకోను. ఏ హీరోకు మార్కెట్ నిలకడగా ఉండదు. రాజమౌళి కారణంగా హీరోల రేంజ్ పెరుగుతుంది. సినిమా హిట్ అయితే ఏ రేంజ్‌కు వెళ్తుందో ఊహించడం కష్టం. ఫ్లాప్ అయితే పరిస్థితి కూడా అంచనా వేయడం కష్టం. హీరోలకు కాదు.. సినిమాలకే ఫ్యాన్స్ ఉన్నారు అని నాగశౌర్య చెప్పారు.
యుక్తి తరేజా మా సినిమాలో హీరోయిన్. ఆమె మంచి డ్యాన్సర్. ఆమె హైట్, యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి. రాబోయే కాలంలో మంచి తెలుగులో మంచి హీరోయిన్ అవుతుంది. ఈ సినిమా చూస్తే ఆమె టాలెంట్ ఏమిటో మీకు అర్ధమవుతుంది అని నాగశౌర్య చెప్పారు.


Click it and Unblock the Notifications











