పవన్ పిలిస్తే ఆలోచిస్తా.. ఆ విషయంలో బాధ్యులం కాదు.. నాగబాబు

By Rajababu

మెగా బ్రదర్‌గా నాగబాబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. నటుడిగా, నిర్మాతగా, యాంకర్‌గా అనేక హోదాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చాలా సున్నిత మనస్కుడైన నాగబాబు.. అవసరమైతే ఉగ్రరూపం దాల్చగలడు అని కొన్ని సందర్బాల్లో రుజువైంది. ఆరెంజ్ సినిమా తర్వాత సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో మళ్లీ నిర్మాతగా మారారు. బన్నీవాసు, లగడపాటి శ్రీధర్‌తో కలిసి ఈ సినిమాలో భాగస్వామిగా మారారు. నా పేరు సూర్య మే4న రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో నాగబాబు తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. నాగబాబు చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

Recommended Video

Varun Tej, Sankalp Reddy New Movie Opening Video
జోక్యం చేసుకోవడం

జోక్యం చేసుకోవడం

ఇండస్ట్రీ మీద టెలివిజన్ ఛానెల్ వ్యాఖ్యలు చేసినప్పుడు మెగా హీరోలు స్పందించలేదనేది సరికాదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించినపుడు వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడం మంచిది కాదు అనే భావనతో ఉన్నాం. ఏకంగా మాపై వ్యక్తిగతంగా దాడి చేయడమనేది ఇండస్ట్రీలో కొందరు జీర్ణించుకోలేకపోయారు. అందుకే మా కుటుంబంలోని వ్యక్తులు ప్రధానం నేను, అల్లు అరవింద్ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది.

ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడం

ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడం

ఏదైనా వివాదం చేటుచేసుకొన్నప్పుడు ఫ్యాన్స్‌ను కట్టడి చేయడమంటే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. మా పరిధిలో ఉన్న అభిమానులను నియంత్రించడానికి వీలు ఉంటుంది. లక్షల మంది అభిమానుల్లో ఎవరో ఒక్కరు ఏదో కామెంట్ చేస్తే మమ్మల్ని బాధ్యుల్ని చేయడం సరికాదు. ప్రతీ ఒక్కరి వద్ద మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఎవరు ఎలా స్పందిస్తారో మాకేం తెలుస్తుంది.

జనసేన తరఫున పోటీ

జనసేన తరఫున పోటీ

పవన్ కల్యాణ్ ఆహ్వానిస్తే జనసేన తరుఫున పోటీ చేస్తానా లేదా అని విషయాన్ని ఇప్పుడే చెప్పడం సరికాదు. ప్రస్తుతం ఇది సరైన వేదిక కాదు. పవన్ పార్టీ తరుఫున ప్రచారం కూడా చేస్తానా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పుడే దానిపై స్పందించడం తొందరపాటు చర్య అవుతుంది.

జబర్దస్త్ క్లీన్ కామెడీ

జబర్దస్త్ క్లీన్ కామెడీ

ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంపై వస్తున్న విమర్శలపై నాగబాబు స్పందించారు. ఆ కార్యక్రమం క్లీన్ కామెడీ షో అని అన్నారు. ఆ కార్యక్రమానికి వస్తున్న ఆదరణ చూడలేక కొందరు అసూయతో చేస్తున్న విమర్శలు మాత్రమే.

వేల మందికి జీవనోపాధి

వేల మందికి జీవనోపాధి

జబర్దస్త్ కార్యక్రమం వేల మందికి జీవనోపాధిగా మారింది. ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. అవుతున్నారు. గురు, శుక్రవారాల్లో జబర్దస్త్ షో వచ్చే టైమ్‌లో అద్భుతమైన రేటింగ్ ఉంటున్నది. బూతు అనేది కొందరు చేస్తున్న అభ్యంతరం మాత్రమే. ఇంటిల్లిపాది ఆ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు.

 రిలీజ్ డేట్స్ సమస్యపై దృష్టిపెట్టాం

రిలీజ్ డేట్స్ సమస్యపై దృష్టిపెట్టాం

టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఎక్కువ కావడం వల్ల రిలీజ్ డేట్స్ సమస్య తలెత్తుతున్నది. నా పేరు సూర్య, భరత్ అనే నేను చిత్రాల విషయంలో కూడా డేట్ క్లాష్ జరిగింది. నిర్మాతలందరం కలిసి కూర్చొని సమస్యను పరిష్కరించాం. మెగా హీరోలు కూడా ఎక్కువ కావడంతో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సినిమాలు క్లాష్ అయ్యాయి. నిర్మాతల మధ్య సరైన అవగాహన లేకపోవడం, సమాచారలోపం ఉండటం ఓ కారణం. ఇక నుంచి అలాంటి సమస్య లేకుండా చేసుకోవాలని సూచించాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X