twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nagarjuna Akkineni నాపై కుట్ర చేసి అలా ఇరికించారు.. ఆ రిలేషన్ వర్కవుట్ కాకపోవడంతో అంటూ నాగార్జున కామెంట్

    |

    సొగ్గాడే చిన్నినాయన సినిమా ఘన విజయం తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు వస్తున్నది. ఈ సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బంగార్రాజుపై అంచనాలు భారీగా పెరిగాయి. సంక్రాంతికి పండుగ లాంటి సినిమాను అందిస్తున్నామని నాగార్జున ధీమాగా చెబుతూ వస్తున్నారు. ఈ సినిమా గురించి నాగార్జున అక్కినేని ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

    స్వర్గం నుంచి బంగార్రాజు భూమిపైకి

    స్వర్గం నుంచి బంగార్రాజు భూమిపైకి

    సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో బంగార్రాజు గురించి, ఆయన రొమాన్స్ ప్రేక్షకులకు తెలుసు. కానీ బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య అక్కినేని పోషించిన చిన్న బంగార్రాజు పాత్ర స్పెషల్ ఎట్రాక్షన్. సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో కొడుకును రక్షించుకోవడానికి స్వర్గం నుంచి కిందకు వచ్చారు. అయితే ఇప్పుడు మనవడిని రక్షించుకోవడానికి ఏ పరిస్థితుల్లో బంగార్రాజు వచ్చారనేది చూపించబోతున్నాం. ఈ చిన్న బంగార్రాజు కూడా ప్రేక్షకులను మెప్పిస్తారనే విశ్వాసంతో ఉన్నాం. రక్తసంబంధంలో ఉండే కెమిస్ట్రీ పనిచేస్తుంది. చాలా సినిమాలకు అదే కమర్షియల్ ఫార్ములా అని నాగార్జున అక్కినేని చెప్పారు.

    సంక్రాంతి పండుగ టార్గెట్

    సంక్రాంతి పండుగ టార్గెట్

    సొగ్గాడే చిన్ని నాయన సినిమా తర్వాత సీక్వెల్ చేద్దామని ఆలోచనను కల్యాణ్ కృష్ణ చెప్పినప్పుడు కథ తీసుకురా.. చేద్దాం అని చెప్పాను. కథ నచ్చేలా రావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. చివరకు సినిమా స్టార్ట్ చేద్దామని అనుకొనేలోపే కోవిడ్ వచ్చింది. దాంతో ఈ సినిమా ప్రారంభానికి ఆలస్యం అయింది. సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకొని సినిమా చేద్దామని అనుకొన్న తర్వాత టీమ్ అంతా నా వెనుక నిలిచి ధైర్యాన్ని ఇచ్చింది. ఆగస్టులో ప్రారంభించి సంక్రాంతికి రిలీజ్ చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాం అని నాగార్జున అన్నారు.

    కేవలం రక్తసంబంధం కారణంగానే

    కేవలం రక్తసంబంధం కారణంగానే

    బంగార్రాజు రక్తసంబంధం చేసే ఓ మ్యాజిక్ లాంటి సినిమా. ఈ సినిమా చేసేటప్పుడు నాన్న అక్కినేని నాగేశ్వరరావు బాగా గుర్తుకువచ్చేవారు. ఆయన పంచెకట్టు ఈ సినిమాకు కొంత వరకు మొటివేషన్. మనం సినిమా కూడా కేవలం రక్తసంబంధం కారణంగానే వర్కవుట్ అయింది. మనం సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ప్రయత్నించారు. కానీ ఫాదర్ అండ్ సన్ బ్లడ్ రిలేషన్ వర్కవుట్ కాకపోవడంతో ఆ ప్రయత్నాలు మానుకొన్నారు. వెండితెరపై బ్లడ్ రిలేషన్ కారణంగానే నాన్నతో కలిసి చేసిన రెండు సినిమాలు వర్కవుట్ అయ్యాయి అని నాగార్జున తెలిపారు.

    సీక్వెల్ ఆలోచన లేదు..

    సీక్వెల్ ఆలోచన లేదు..

    సొగ్గాడే చిన్నినాయన సినిమా చేసేటప్పుడు సీక్వెల్ ఆలోచన లేదు. కానీ సినిమా బాగా ఆడిన తర్వాత సీక్వెల్ ఆలోచనతో కథ తయారు చేశాం. బంగార్రాజు ఆత్మ ఎక్కడికైనా వెళ్తుంది. కాబట్టి కథా విస్తరణకు చాలా స్కోప్ ఉంది. కాబట్టి బంగార్రాజు సీక్వెల్ కొనసాగుతుందా అంటే.. సినిమా రిలీజ్ తర్వాత హిట్ అయితే దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడే ఏమీ ఆలోచించలేదు అని నాగార్జున చెప్పారు.

    అనూప్ రూబెన్స్ మ్యూజిక్

    అనూప్ రూబెన్స్ మ్యూజిక్

    అన్నపూర్ణ స్టూడియోతో అనూప్ రూబెన్స్‌‌కు మంచి అనుబంధం ఉంది. ఇష్క్ అనే చిత్రం చూసిన తర్వాత ఆయన మ్యూజిక్ నచ్చి మనం సినిమా అవకాశం ఇచ్చాం. ఆ సినిమాకు మంచి మ్యూజిక్ చేయడంతో మాకు స్పెషల్‌గా మారారు. మ్యూజిక్ గురించి చాలా సమయం తీసుకొంటాడు. ఏదైనా నచ్చడం లేదంటే బాధపడడు. చాలా కూల్‌గా ఉంటాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్‌ను పెట్టుకొందామని కల్యాణ్ కృష్ణ చెప్పడంతో నాకు కూడా హ్యాపీ అనిపించింది. మేము అనుకొన్న విధంగానే సొగ్గాడే చిన్నినాయన కంటే మంచి మ్యూజిక్ ఇవ్వడం మరింత హ్యాపీగా మారింది అని నాగార్జున అన్నారు.

    నాగచైతన్యకు ఎలాంటి టిప్స్ అంటే

    నాగచైతన్యకు ఎలాంటి టిప్స్ అంటే

    బంగార్రాజు పాత్ర కోసం నాగచైతన్యకు ఎలాంటి టిప్స్ ఇవ్వలేదు. యాసకు సంబంధించిన డైలాగ్స్ రికార్డ్ చేసి పంపించాను. వాటిని ఫాలో అవుతూ చైతూ వెళ్లిపోయాడు. స్క్రిప్ట్ కల్యాణ్ రాసాడు కాబట్టి.. అంతా ఆయనే చూసుకొన్నాడు. విలేజ్ డ్రామా చైతూ ఇప్పటి వరకు చేయలేదు. బంగార్రాజు పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సినిమా చూస్తే ప్రేక్షకులు కూడా
    అదే ఫీల్ అవుతారు అని నాగార్జున చెప్పారు. ఇక రమ్యకృష్ణతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చుతుంది. ఆమె సెట్లో ఉంటే చాలా నవ్విస్తుంది. సెట్ అంతా చాలా సందడి సందడిగా ఉంటుంది అని నాగార్జున అన్నారు.

    నాతో అలా పాట పాడించి.. ట్రెండింగ్‌గా

    నాతో అలా పాట పాడించి.. ట్రెండింగ్‌గా

    కల్యాణ్ కృష్ణకు సొగ్గాడే చిన్ని నాయన కథపై బాగా పట్టు వచ్చింది. ఆ పాత్రల గురించి మంచి అవగాహన ఉంది. నేను పనిచేయాలనుకొన్న దర్శకుల్లో కల్యాణ్ ఒకరు. అతడితో పనిచేయడం చాలా సులువు. కథ నచ్చలేదంటే.. మళ్లీ వర్క్ చేసి తీసుకొస్తాడు. చాలా ఓపిక ఎక్కువ అంతకంటే ఆయన రచయితగా పవర్ ఉంది. ఆయన ఒక పాట కూడా రాశారు. వాసి వాడి తస్సాదియ్య అనే పాట కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇక నేను పాడిన పాట అనుకోకుండా జరిగింది. పాటలో కొన్ని మాటలు చెప్పాలని వెళ్లాను. కానీ మీరు పాట పాడమని అడిగారు. నాతో పట్టుబట్టి పాట పాడించారు. అంతకుముందే నాపై కుట్ర చేశారనుకొంటాను. నేను పాటపాడిన తర్వాత పదిమందికి వినిపించాం. అందరూ బాగుందని అనడంతో మళ్లీ ఫైనల్ ట్రాక్ పాడాను అని నాగార్జున చెప్పారు.

    English summary
    Tollywood Hero Nagarjuna Akkineni reveals about Bangarraju movie and Naga Chaitanya as China Bangarraj/u. He said about Singing spree in Bangarraju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X