నా కోసం డెవిల్ కథ రాయలేదు.. మర్డర్ మిస్టరీలో ట్విస్ట్ అదే.. కల్యాణ్ రామ్ (ఇంటర్వ్యూ)
బింబిసార విజయం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. సంగీత దర్శకుడిగా హర్షవర్దన్ రామేశ్వర్ వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ..
డెవిల్ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ అవుతున్నది. 2021 సంవత్సరంలో అభిషేక్ నామా ఫోన్ చేసి కథ ఉంది. మీరు వినాలని చెప్పాడు. అప్పుడు శ్రీకాంత్ విస్సా వచ్చి కథ చెప్పినప్పుడు స్టోరి బ్యాక్ డ్రాప్ నచ్చింది. 1942 సంవత్సరంలో జరిగే కథ ఇది అని చెప్పగానే ఎక్సైట్ అయ్యాను. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. షెర్లాక్ హోమ్స్ సినిమాల్లో ఉండే మాదిరిగా ఓ డిటెక్టివ్ కథ. ఒక తింగరిలా ఆలోచించే వ్యక్తి కథ. నేను ఎప్పుడూ ఇలాంటి పాత్రను చేయలేదు. అందుకే వెంటనే సినిమా చేసేందుకు ఒప్పుకొన్నాను అని కల్యాణ్ రామ్ చెప్పారు.

డెవిల్ సినిమా నా కోసం రాసుకొన్న కథ కాదు. శ్రీకాంత్‌ను అడిగినప్పుడు.. నిర్మొహమాటంగా చెప్పిదేమిటంటే.. నేను ఓక కథ రాసుకొన్నాను. అభిషేక్ నామాకు చెప్పాను. దాంతో మీకు కథను నేరేట్ చేయమని చెప్పారు. కథగానే చేశానని చెప్పడం నాకు హ్యాపీగా అనిపించింది. అప్పటికే బింబిసార సినిమా సగం పూర్తయింది. ఈ సినిమాలో బ్యాక్ డ్రాప్, కమర్షియల్ వ్యాల్యూస్ బాగా నచ్చాయి. నేను కొన్ని మార్పులు చెబితే.. దాదాపు 1 సంవత్సరం ప్రీ ప్రొడక్షన్ చేశారు. ఒక సంవత్సరం షూట్ చేశాం అని కల్యాణ్ రామ్ తెలిపారు.
బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడటానికి వచ్చిన ఆడియెన్స్ అందించాల్సిన హంగులు, ఆర్బాటాలు పూర్తిగా ఉంటాయి. ఒక ఇన్వెస్టిగేషన్‌తో సాగే కథలో కమర్షియల్ వ్యాల్యూస్ జొప్పించిన తీరు ఈ సినిమా బలంగా మారింది. కమర్షియల్ అంశాలే సినిమాను మలుపు తిప్పుతాయి. మర్డర్ మిస్టరీ, సీక్రెట్ సర్వీస్‌కు సంబంధమేమిటనేది డెవిల్ సినిమాలో చూస్తాం అని కల్యాణ్ రామ్ చెప్పారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా కాదు. కేవలం కల్పిత కథ. ఇలాంటి కథ గతంలో జరిగి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. మర్డర్ మిస్టరీకి బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ కలపడం బాగుంది. ఈ సినిమాకు సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్. క్యాస్టూమ్ డిపార్ట్‌మెంట్ ఈ సినిమాకు కావాల్సిన మార్క్ చూపించారు. క్యాస్టూమ్ వల్లే నా క్యారెక్టర్ రూపు రేఖలు మారిపోయాయి. బ్రిటన్‌లో చదువుకొన్న ఇండియనైజ్డ్ పర్సన్ క్యారెక్టర్. అభిషేక్ నామా ఆర్ట్ విభాగాన్ని డీల్ చేశారు అని కల్యాణ్ రామ్ తెలిపారు.

కథలో కొత్తదనం లేకపోతే డిఫరెంట్‌గా చేయలేం. స్టోరిలో కొత్తగా ఉంటే.. కొత్తగా డైలాగ్ చెప్పవచ్చు. కొత్తగా పాత్రను డిజైన్ చేయవచ్చు. బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది.ఈ సినిమాలో డిఫరెంట్ అంశాలు, డీటెయిల్డ్‌గా ఉండే అంశాలు థ్రిల్ చేస్తాయి. 2023 సంవత్సరంలో డెవిల్ మూవీ హిట్‌తో ముగింపు పలకాలని ఎదురు చూస్తున్నాం అని కల్యాణ్ రామ్ అన్నారు .

డెవిల్ సినిమాలో సంయుక్త మీనన్ చాలా కీలకమైనా పాత్ర. అలాగే మాళవిక నాయర్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఎవరి పాత్ర కూడా ఇలా వచ్చిపోతుందనే ఫీలింగ్ కలుగదు. విరూపాక్ష సినిమాతో సంయుక్త తానేంటో నిరూపించుకొన్నది. అతనొక్కడే సినిమా తర్వాత నా సినిమాలో మరోసారి బలమైన పాత్ర ఆమెది అని కల్యాణ్ రామ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











