హమ్మయ్య! బిగ్‌బాస్ అయిపోయింది.. అంత కాంప్లికేటా? కౌశల్ ఆర్మీపై నాని కామెంట్
Recommended Video

వరుస విజయాలతో ముందుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం బిజీగా మారిపోయాడు. ఓ పక్క దేవదాస్ చిత్రం, మరోపక్క బిగ్‌బాస్ రియాలిటీ షోను బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు. దేవదాస్ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, 30 తేదీన బిగ్‌బాస్ ప్రేక్షకులకు దూరం కాబోతున్నాడు. మరికొద్ది రోజుల్లో నాని స్వేచ్ఛావాయువులు పీల్చుకోనున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవదాస్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

క్షణం తీరిక లేకుండా ఉన్నా
నా కెరీర్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బిజీగా ఉన్నాను. అటు దేవదాస్, ఇటూ బిగ్‌బాస్‌తో క్షణం తీరిక లేకుండా పనిచేశాను. సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేసినా షెడ్యూల్ షెడ్యూల్‌కు పదిరోజులు బ్రేక్ వచ్చేది. కానీ ఈ రెండు ఒప్పుకొన్న తర్వాత తీరికలేదు. దేవదాస్ షూటింగ్ అప్పుడే అయిపోయిందా అని అనిపించలేదు. కానీ బిగ్‌బాస్ హమ్మయ్య అయిపోతుంది అనే ఫీలింగ్ కలిగింది.

నాలుగు నెలల్లో హాలీడే లేదు
దేవదాస్, బిగ్‌బాస్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేనెంత బిజీగా అయిపోయానంటే ఒక్క రోజు కూడా సెలవు దొరకలేదు. సాధారణంగా అయితే 15 రోజుల్లో బ్రేక్ వచ్చేది. నా కెరీర్‌లో గత నాలుగు నెలల్లో ఒక్క రోజు కూడా హాలీడే దొరకలేదు. మా అబ్బాయి (జున్ను)తో ఆడుకొనే సమయం చిక్కలేదు.

రెండు రోజులు అని అనుకుంటే
ఇలాంటి పరిస్థితి రావడానికి బిగ్‌బాసా లేదా దేవదాసా అనేది పక్కన పెడితే నేను చేసే వర్క్ అలాంటిది. దాని విలువ ఇప్పుడు అర్థం కాదు. లాంగ్ రన్‌లో మీకు దాని విలువ తెలుస్తుంది. బిగ్‌బాస్‌ను ఒప్పుకునేటప్పుడు శని, ఆదివారం కదా అనుకొన్నాను. క్రియేటివ్ పరంగా చాలా పనిచేయాల్సి వస్తుంది. కానీ వారం అంతా పనిచేయాల్సి వస్తుంది.

ఈ వారంతో శుభం కార్డు
బిగ్‌బాస్‌ను ఒప్పుకొని, నమ్మిన తర్వాత దానిని ఒకస్థాయిలో నిలబెట్టడానికి శ్రమ పడ్డాం. బిగ్‌బాస్ టీమ్ దాదాపు పిండేసినంత పనిచేసింది. మూడు నెలల తీరిక లేని సమయానికి ఈ వారం శుభకార్డు పడుతుంది. దాని తర్వాత ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు ప్లాన్ చేస్తున్నాను.

కౌశల్ ఆర్మీ గురించి నాని
దేవదాస్ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కౌశల్ ఆర్మీ ప్లాన్ చేస్తున్నదనే వార్తపై నాని స్పందిస్తూ.. అందంతా నమ్మే పని కాదు. మీరు నమ్ముతారా అనే ప్రశ్నించారు. అలాంటివన్నీ టైం వేస్ట్ పనులు అని నాని అన్నారు.

బిగ్‌బాస్‌తో ప్రపంచం పరిచయం
బిగ్‌బాస్ నాలో చాలా మార్పు తెచ్చింది. ఇప్పటి వరకు నేను నా సర్కిల్‌లో బతికేవాడిని. అందరూ మంచి వాళ్లే అనుకొనే వాడిని. కానీ బిగ్‌బాస్ చేసిన తర్వాత ఇంత కాంప్లెక్స్, కాంప్లికేట్‌గా ఉంటుందా అనే విషయం నా కళ్లు తెరిపించింది. ఓడిపోయి చూడు ప్రపంచమే నీకు పరిచయం అవుతుందనే పిల్లా జమీందార్ డైలాగ్ మాదిరిగానే.. బిగ్‌బాస్ చేసి చూడు ప్రపంచమే నీకు పరిచయం అవుతుంది అనేలా అనిపించింది.


Click it and Unblock the Notifications











