నన్ను జడ్జ్ చేస్తే తట్టుకోలేను.. నా కొడుకుకు అంత వయసు రాలేదు.. నాని
Recommended Video
క్రీడా నేపథ్యం, కుటుంబ విలువల నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం జెర్సీ. మళ్లీ రావాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని, కన్నడ హీరోయిన్, యూటర్న్ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించారు. ఈ చిత్రం 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నాని తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. నాని చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే

క్రికెటర్ రమణ్ లాంబా జీవితం ఆధారంగా చేసుకొని నిర్మించారా?
రమణ్ లాంబా జీవితానికి, జెర్సీ సినిమా కథకు సంబంధం లేదు. టీజర్, ట్రైలర్ చూసి అలా ఊహించుకోవచ్చు. కొన్ని ప్రతికూల పరిస్థితుల తర్వాత ఆయన కమ్‌బ్యాక్ కావొచ్చు. సినిమా రిలీజ్ తర్వాత అలాంటి ఊహలకు తెరపడుతుంది. రమణ్ లాంబా జీవితం ఆధారంగా తెరకెక్కుతుందని వికీ పీడియాలో ఉన్నది కూడా తప్పే. ఎవరు పడితే వారు వికీని అప్‌డేట్ చేయడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తింది. ఇది బయోపిక్ కాదు. ఫక్కా ఫిక్షనల్ సినిమా. సినిమా చూస్తే అలాంటి వార్తలకు పుల్‌స్టాప్ పడుతుంది.

జెర్సీ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టామంటే?
క్రీడాకారులు ధరించే డ్రస్‌ను జెర్సీ అంటారు. క్రికెట్ క్రీడ నేపథ్యంగా తెరకెక్కడం వల్ల ఆ పేరు పెట్టలేదు. జెర్సీ అని టైటిల్ పెట్టడానికి చాలా స్ట్రాంగ్ రిజన్స్ ఉన్నాయి. అవేంటో సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. మజిలీ సినిమాను నేను ఇంకా చూడలేదు. జెర్సీ సినిమాకు ఎలాంటి పోలికలు ఉన్నాయో లేదో తెలియదు. కష్టాలు, సుఖాలతో కలిసి ఉన్న భావోద్వేగమైన చిత్రం ఇది.

జెర్సీ మీ కెరీర్‌లోనే విభిన్నమైన సినిమా అని భావిస్తున్నారా?
జెర్సీ సినిమాకు నేను చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. చాలా యూనిక్ సినిమా అని ఫిక్స్ నేను అయ్యాను. మీరు అయిపోవచ్చు. సినిమా రిలీజ్‌కు ముందు చాలా హ్యాపీగా ఉన్నాను. మంచి కంటెంట్‌తో, ఎమోషనల్‌గా సినిమా రూపొందింది. ఇంతకుముందు సినిమాల్లో బలం, బలహీనతలు నాకు తెలిసేవి. కానీ జెర్సీ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే గొప్ప ఫీలింగ్ కలుగులేదు. అందుకే నాకు ఈ కాన్ఫిడెన్స్ కలిగింది. దీనికి కాన్ఫిడెన్స్ కాకుండా ఇంకేదైనా పేరు పెడితే బాగుంటుంది.

జెర్సీ సినిమా చూసిన తర్వాత ఎలాంటి అనుభూతికి లోనయ్యారు?
జెర్సీ తర్వాత స్పెషల్ జోన్‌లో ఉన్నాను. నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాను. దర్శకుడు గౌతమ్ కథ చెప్పినప్పుడే రోమాలు నిక్కబోడిచాయి. గొప్ప ఫీలింగ్ కలిగింది. దర్శకుడు చెప్పిన ప్రకారం పాత్రలో ఒదిగిపోయాను. సినిమా యూనిట్ అంతా గొప్ప పని చేశామన్న ఫీలింగ్‌లో ఉన్నాం. దర్శకుడు గౌతమ్ తీసిన మళ్లా రావే చూసి ఈ సినిమా ఒప్పుకోలేదు. ఆయనలో నిజాయితీ, నమ్మకం చూసే సినిమాను ఒప్పుకొన్నాను. సినిమా చేస్తున్నప్పుడే గొప్ప సినిమా చేస్తున్నామనే ఫీలింగ్ కలిగింది.

తెర మీద తండ్రి పాత్రలో చూసుకొన్నప్పుడు ఎలా అనిపించింది?
చిన్న వయసులోనే భావోద్వేగంతో కూడిన తండ్రి పాత్రలో నటించడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. నిజ జీవితంలో కూడా తండ్రినే కదా. మేకప్, దానికి సంబంధించిన టెక్నికల్ అంశాలు సరిగా కుదిరితే తాత పాత్రలో నటించడానికి కూడా సిద్ధం. తండ్రిగా నటిస్తే కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయనే భయం కూడా లేదు. నటుడంటే తమ వయసుకు తగిన పాత్రలే కాకుండా వయసుకు మించిన పాత్రలు కూడా ధరించాలన్నది నా నమ్మకం.

ఎవరైనా జడ్జ్ చేస్తే బాధపడుతారా? మీ అబ్బాయి మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారా?
ఎవరైనా సరే, మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తే నిజంగా బాధపడుతాను. మనకు సంబంధం లేని వ్యక్తులు జడ్జ్ చేస్తే కష్టంగా ఉంటుంది. నిజ జీవితంలో నా కొడుకు జడ్జ్ చేసే వయసు రాలేదు. ఒకవేళ ఆ వయసు వచ్చినా చేయడు. ప్రపంచం దృష్టిలో హీరో కాకపోయినా.. కొడుకు దృష్టిలో హీరో కావాలని కోరుకొంటారు. ఇప్పటి వరకు నన్ను జడ్జ్ చేసినట్టు నా దృష్టికి రాలేదు. సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినప్పుడో.. కమర్షియల్ సినిమాలు చేసినప్పుడో కొందరు కామెంట్లు చేశారు. అయినా నేను పట్టించుకోలేదు.


Click it and Unblock the Notifications











