నాగార్జున విషయంలో డౌట్ పడ్డాను.. భయం లేకుండా.. ఆ టెన్షన్ గుర్తొచ్చింది.. నాని

నేచురల్ స్టార్ నాని, నాగార్జున కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం దేవదాస్. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఆక్షాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవదాస్ చిత్రం అమెరికాలో నాని, నాగార్జునకు అతిపెద్ద రిలీజ్ కానున్నది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను నాని మీడియాతో పంచుకొన్నారు. నాని చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

Recommended Video

Akkineni Nagarjuna And Nani Making Fun @Devadas Movie Press Meet

 నాగార్జునతో నటించడం

నాగార్జునతో నటించడం

నా కెరీర్‌లో మల్టీ స్టారర్ చిత్రంలో నటించడం తొలిసారి. నాగార్జునతో కూడా నటించడం తొలిసారి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి నటించబోతున్నాననే విషయం చాలా ఎక్సౌటింగ్ అనిపించింది. షూటింగ్ సమయంలో నేను సరదాగా ఉంటాను. ఈ సినిమా షూటింగ్‌లో నాగార్జునతో ఎలా ఉండాలనే విషయం కొంత ఇబ్బంది పెట్టింది.

ఎలాంటి సమస్యలు రాలేదు

ఎలాంటి సమస్యలు రాలేదు

దేవదాస్ కథ విషయానికి వస్తే ఫన్ ఫిలిం. షూటింగ్ స్పాట్‌లోనే చాలా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నాగార్జునతో నేను నా ఆలోచనలను, మాటలను షేర్ చేసుకోగలనా? ఆయన ఎలా తీసుకొంటారు అనే డౌట్ ఉండేది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సాంగ్ షూట్ చేయడంతో ఎలాంటి సమస్యలు రాలేదు.

 ఫ్రెండ్ అనే ఫీలింగ్ కల్పించారు

ఫ్రెండ్ అనే ఫీలింగ్ కల్పించారు

ఇక సీన్లు షూట్ చేసేటప్పుడు క్లినిక్ ఎపిసోడ్ షూట్ చేశారు. మధ్యాహ్నం వరకు మా మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఫ్రెండ్‌ అనే ఫీలింగ్ కల్పించడంతో నా వయసు నటుడితో పనిచేస్తున్నట్టు అనిపించింది. అదే చివరి వరకు కొనసాగింది. సినిమా చూస్తున్నప్పుడు తెర మీద మా మధ్య ఉన్న సన్నివేశాలు చాలా బాగున్నాయి. అందులో ఉండే ఇంటెన్సిటీ మాకే తెలుస్తుంది.

నాకు హీరోలానే కనిపిస్తారు

నాకు హీరోలానే కనిపిస్తారు

నాగార్జునను చూస్తున్నప్పుడు ఆయన హీరోలానే కనిపిస్తారు. ఆయన సినిమా నిన్నే పెళ్లాడుతా దేవీ థియేటర్‌లో చూడటానికి వెళ్లినపుడు టికెట్లు దొరుకుతాయా లేదా అనే టెన్షన్ నాకు ఇంకా గుర్తు. ఆయన ముందు ఉన్నప్పుడు నేను చూసిన ఆయన సినిమాలు, అప్పుడు పడిన కష్టాలు గుర్తుకొస్తాయి.

శ్రీరాం ఆదిత్యను డైరెక్టర్‌గా తీసుకోవడం

శ్రీరాం ఆదిత్యను డైరెక్టర్‌గా తీసుకోవడం

దేవదాస్ సినిమాకు దర్శకుడిగా శ్రీరాం ఆదిత్యను పెట్టాలన్నది నా ఆలోచనే. అప్పటికీ నాకు ఈ సినిమా కథ గురించి కొంతే తెలుసు. ఆ లైన్ చెప్పి.. ఒకవేళ ఈ కథను పూర్తిగా స్క్రిప్టుగా మలిచి తీసుకురా. కావాలంటే నెలన్నర సమయం తీసుకో. ఒకవేళ నాకు, నాగార్జున గారికి నచ్చితే సినిమా ఒకే అవుతుంది. లేకపోతే నీ శ్రమ వృథా అవుతుంది అని చెప్పాను.

 శ్రీరాంకు నో చెప్పలేకపోయా

శ్రీరాంకు నో చెప్పలేకపోయా

నేను చెప్పినట్టుగానే శ్రీరాం ఆదిత్య కష్టపడి పూర్తి స్క్రిప్టు తీసుకొచ్చారు. అప్పుడు నేను వరంగల్‌లో జరుగుతున్న ఎంసీఏ షూటింగ్‌లో ఉన్నాను. హోటల్‌కు వచ్చి నాకు స్క్రిప్టు వినిపించారు. అప్పుడు నాకు డేట్స్ సమస్య ఉన్నందున ఈ సినిమాను చేయకూడదని అనుకొన్నాను. కానీ శ్రీరాం ఇంట్రెస్ట్‌తో డెవలప్‌ చేసిన తీరుతో నేను ఇంప్రెస్ అయ్యాను. అప్పుడే స్వప్నదత్‌కు ఫోన్ చేసి చెప్పాను. నాగ్ సార్‌కు కూడా నచ్చడంతో శ్రీరాం ఆదిత్య డైరెక్టర్‌గా తెరపైకి వచ్చాడు.

 మల్టీస్టారర్‌తో భయం లేదు

మల్టీస్టారర్‌తో భయం లేదు

సోలో హీరోగా ఉంటూ హిట్లు కొడుతున్న నాకు నాగార్జున మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాననే భయం లేదు. ఎందుకంటే నాకంటూ ఇమేజ్ లేదు. నా కటౌట్ చూసి జనం సినిమాకు రారు. సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనే ప్రేక్షకులు వస్తారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో ఉన్న నాతో నాగార్జున సినిమా చేయడానికి రావడం నేను గొప్ప గౌరవంగా భావిస్తాను. అందుకే నేను దేవదాస్ తిరస్కరించలేదు.

నాగ్ కాంప్లిమెంట్‌ను మరిచిపోలేను

నాగ్ కాంప్లిమెంట్‌ను మరిచిపోలేను

మల్టీస్టారర్ చిత్రం చేస్తే నానితోనే చేస్తానని నాగార్జున చెప్పడం చాలా ఆనందం అనిపించింది. నాగార్జునతో రిలేషన్ బాగా పెంచుకోవాలని ప్రయత్నించా. షూటింగ్ సమయంలోనే నాని నీవు ఎంత బాగా నటిస్తావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. నాగార్జున ఇచ్చిన కాంప్లిమెంట్‌ను ఎప్పటికీ మరిచిపోలేను అని నాని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X